-నీటిపారుదల అభివద్ధిశాఖలో అక్రమ పదోన్నతులు
-నిబంధనలకు విరుద్ధంగా ఏఈ, డీఈఈ, ఈఈలకు ప్రమోషన్లు
-గవర్నర్, సీఎస్‌లకు తెలంగాణ ఉద్యోగుల ఫిర్యాదు
వడ్డించేవాడు మనోడైతే బంతిలో ఎక్కడ కూర్చున్నా ఫర్వాలేదన్న సామెత సీమాంధ్ర ఉద్యోగులకు అతికినట్టు సరిపోతుంది. రాష్ట్ర విభజన సమయంలో ఎలాంటి పదోన్నతులకు అవకాశం లేదని ప్రభుత్వం ఇప్పటికే సర్క్యులర్ జారీ చేసినా, కొందరు సీమాంధ్ర ఉన్నతాధికారులు ఆ నిబంధనలను తుంగలో తొక్కి దొడ్డిదారిన పదోన్నతులు ఇస్తున్నారు. స్టేట్ క్యాడర్ పోస్టులో కూర్చొని ఇక్కడినుంచి వెళ్లకుండా తమ సీటును కాపాడుకునేందుకు కొందరు ఉద్యోగులు శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారు.
తాజాగా రాష్ట్ర నీటి పారుదల అభివద్ధి సంస్థ(ఏపీఐడీసీ)లో...కొందరు ఏఈ, డీఈఈ, ఈఈలకు పదోన్నతులు ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. ఇది గుర్తించిన ఐడీసీ తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ నాయకులు ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. సంస్థలో నిబంధనలు పాటించకుండా సీమాంధ్ర ఉద్యోగులకు పదోన్నతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారంటూ సోమవారం గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతికి సంఘం ఫిర్యాదు చేసింది.
తెలంగాణ ఉద్యోగులకు నష్టం చేసేందుకే కొందరు ఉన్నతాధికారులు నిబంధనలకు వ్యతిరేకంగా ప్రమోషన్లు ఇస్తున్నారని సంఘం ఆరోపించింది. సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సీమాంధ్ర అధికారులకు మేలు కలిగించే నిర్ణయాలు తీసుకుంటున్నారని, ఆయనపై చర్య తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు.
సీమాంధ్రుల ఆగడాలు ఇన్నీ...అన్నీ...కావు!
ప్రతి శాఖలో...ప్రతి ఒక్కటీ...వాళ్ళ మోసాన్ని ప్రకటించేదే!
వీరిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టరాదు.
అక్రమాలు బయటపెట్టాలి...తగిన శిక్షవేయాలి...
అప్పుడుగానీ వీళ్ళ తిక్కకుదరదు...
మన తెలంగాణులకు న్యాయంజరగదు!
(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో...)
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి