మే పదహారవ తేదీ
నుండి జూను రెండువరకు
ప్రభుత పాలనమ్ము లేక
రాష్ట్రం అరిగోసపడును!
ఎన్నిక ఫలితాలు తెలిసి
నంక కూడ విజేతలే
ప్రమాణ స్వీకారమేది
లేక ఊరకుండవలెనె?
గతములోన జూను రెండు
ప్రభుత రద్దు చేయక మును!
అదియె జూను ఒకటి వరకు
నడచుననియు తలచి చేస్రి!!
ప్రభుత రద్దుపరచి రిపుడు,
కాన, ఫలితములు బహిర్గ
తమ్ము లైన పిదప, గెలిచి
నట్టివారు పాలకులే!
ఇట్టి పాలకులును జూను
రెండు వరకు ఆగనేల?
పదహారునొ, పదిహేడునొ
ప్రమాణమ్ము చేయవలయు!
అటులకాకయున్న రాష్ట్ర
మంత అట్టు ఉడికి పోవు!
పాలనమ్ము కుంటు పడును!
కాన ప్రభుత నేర్పరపుడు!!
అసెంబ్లీని రద్దుచేయ
గానె మరొక టేర్పడవలె!
కాని, ఎన్నికలు జరుగక
పోవుటచే ఆగినదయ!!
ఫలితము తెలిసిన వెంటనె
ప్రభుత్వమ్ము నేర్పరుపుడు!
గవర్నరుకు గడువు ముగిసె!
కాన, ప్రభుత ఏర్పడవలె!!
ఎన్నుకున్న ప్రతినిధులను
రెండువారములవరకును
ప్రమాణమ్ము చేయకుండ
ఆపుట హక్కుల హరణమె!
కావున హోం శాఖవారు
దీనిని అవగాహనమ్ము
చేసికొని, అపాయింటెడ్
తేదీ ఇక మార్చవలయు!
జూను రెండు గాక ఇపుడు
మే పదా రపాయింటెడ్
తేదీగా మార్పుచేసి
ప్రజలను కాపాడవలెను!
అప్పుడున్న పరిస్థితులు
ఇపుడు లేని కారణమున,
పరిస్థితులు గమనించియు
తేదే యిక మార్చవలెను!
*** *** *** ***
ఇదే విషయమై మరిన్ని వివరాలకై:
(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో...)
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి