గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శుక్రవారం, మే 30, 2014

మా జన్మభూమికై నేను ప్రాణత్యాగానికైనా సిద్ధం!


-ఆర్డినెన్స్ రద్దు కోరుతూ ఎమ్మెల్యే రాజయ్య ఆమరణ దీక్ష
- మద్దతుగా దీక్షలో పాల్గొన్న సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు 
- ఆందోళనల్లో కానరాని టీడీపీ, కాంగ్రెస్, వైఎస్సార్సీపీ

నేతలు రాజ్యంగ విరుద్ధంగా ఆర్డినెన్స్ తెచ్చి ఖమ్మం జిల్లాలో ఏడు మండలాలను సీమాంధ్రలో కలపడాన్ని నిరసిస్తూ భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. భద్రాచలంలోని అంబేద్కర్ సెంటర్‌లో గురువారం దీక్షలను సీపీఎం జిల్లా కార్యదర్శి పోతినేని సుదర్శన్ ప్రారంభించారు. రాజయ్యతోపాటు ముంపు ప్రాంతాలకు చెందిన 17మంది సీపీఎం ఎంపీటీసీలు, సర్పంచ్‌లు దీక్షలో కూర్చున్నారు. జిల్లాలోని ఏ ఒక్క గ్రామాన్ని, సెంటు భూమిని కూడా వదులుకునే ప్రసక్తి లేదని భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య స్పష్టంచేశారు. ప్రాణత్యాగానికైనా సిద్ధమని, ముంపు గ్రామాలను వదులుకోబోమన్నారు.

గిరిజన చట్టాలను ఉల్లంఘించినందుకు ప్రభుత్వంపై రాజ్యాంగ ఉల్లంఘన కింద సుప్రీంకోర్టు కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సుదర్శన్ మాట్లాడుతూ బీజేపీ, టీడీపీలు గిరిజన వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నాయని విమర్శించారు. మానవ విధ్వంసం చేయడం ద్వారా ఏ రకమైన అభివృద్ధిని టీడీపీ, బీజేపీలు కోరుకుంటున్నాయని ప్రశ్నించారు. ఆర్డినెన్స్‌ను రద్దు చేసే వరకు పోలవరం ప్రస్తుత డిజైన్‌ను మార్పు చేసే వరకు సీపీఎం ప్రజాపోరాటం ఆగదని తేల్చిచెప్పారు. దీక్షలకు టీఆర్‌ఎస్, సీపీఐ నాయకులు సంఘీభావం పలికారు. కేంద్రం ఆర్డినెన్స్‌తో జిల్లాలోని లక్షలాది గిరిజన, ఆదివాసీల జీవనం విధ్వంసానికి గురయ్యే ప్రమాదము్న్నా టీడీపీ, వైఎస్సార్సీపీ, కాంగ్రెస్ నేతలు మాత్రం సంఘీభావం తెలపకుండా మౌనం వహించారు. ఎక్కడా ఆందోళనల్లో పాల్గొనలేదు. ఆయా పార్టీల తరపున ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన ఎంపీ, ఎమ్మెల్యేలు కంటికి కానరాకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి