గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

సోమవారం, మే 19, 2014

సీమాంధ్ర అహంకారాన్ని గెలిచి నిలిచిన లీడర్...


-తెలంగాణ ఉద్యమ సారథికి కుడిభుజం

-సీమాంధ్ర దోపిడీపై గురిపెట్టిన ఈటె

మలి దశ తెలంగాణ ఉద్యమాన్ని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ప్రారంభించి, నడిపించి, ఉరికించి తీరం చేర్చిన 14ఏళ్ల ప్రస్థానంలో ఆ పార్టీలో మరో నేత కూడా ఉద్యమానికి మహా పోరాటమే చేశారు. కేసీఆర్‌కు కుడిభుజంలా ఉంటూ సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు జరిగిన అన్యాయాలను ఎలుగెత్తి చాటుతూ తెలంగాణ ప్రజల్లో ఉద్యమ చైతన్యం రగిలించారు. 


శాసనసభలో టీఆర్‌ఎస్‌ను ఒంటరి చేసి సమైక్యవాదులు చెలరేగిపోతుంటే తన వాగ్ధాటితో వారిని దీటుగా ఎదుర్కొని నిలిచి గెలిచారు. ఆయనే టీఆర్‌ఎస్‌ఎల్పీ నేతగా నిన్నమొన్నటివరకు కొనసాగిన ఈటెల రాజేందర్. తెలంగాణ సమాజం పడుతున్న బాధలను ప్రపంచానికి అర్థమయ్యేలా చెప్పటంలోనూ, యువత, ఉద్యోగులు, రైతులు, కార్మికులు ఇలా అన్నివర్గాల వారినీ ఉద్యమంలో సమన్వయం చేయటంలోనూ ఆయన నిర్వర్తించిన పాత్ర అసాధారణం. కేసీఆర్ తూటాల్లాంటి మాటలతో తెలంగాణ జనాన్ని ఉద్యమంలోకి ఉరుకులు పెట్టిస్తే, ఈటెల తన సహజసిద్ధమైన సౌమ్యతతో తెలంగాణ ఎందుకు కావాలో సామాన్యులకు సైతం విడమర్చి చెప్పారు. నిండు అసెంబ్లీలో పిడికెడంత మంది ఏం చేస్తారంటూ సీమాంధ్ర అహంకారి సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హుంకరించినప్పుడు ఆయను సవాలు చేసి నిలబడి తెలంగాణ ప్రజల చేత ఈటెల శహబాష్ అనిపించుకొన్నారు. 2008లో జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ పోటీ చేసిన 16 స్థానాల్లో ఏడింట్లో మాత్రమే విజయం సాధించింది. 

2004 ఎన్నికల్లో పార్టీ తరఫున గెలిచిన 26 మంది ఎమ్మెల్యేల్లో 10 మంది కాంగ్రెస్ వైపు వెళ్లడంతో మళ్లీ ఉద్యమాన్ని రక్షించుకునే క్రమంలో ఈ ఎన్నికలు జరిగాయి. కేవలం ఏడు శాసనసభ స్థానాలే గెలవడంతో దీనికి శాసనసభాపక్ష నేతగా ఈటెల రాజేందర్‌ను ఎన్నుకున్నారు. ఆ తరువాత 2009 ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ 10 శాసనసభ స్థానాలే గెలిచింది. ఈ సమయంలో కూడా ఈటెల రాజేందరే శాసనసభాపక్ష బాధ్యతలు స్వీకరించారు. ఇంతింతై వటుడింతయై అన్నట్లుగా టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల బలం పెరగటంలో ఈటెల పాత్ర వెలకట్టలేనిది. టీఆర్‌ఎస్‌ఎల్పీ నేతగా ఆరు సంవత్సరాల కాలంలో ముగ్గురు సీమాంధ్ర ముఖ్యమంత్రులను ఎదుర్కొని నిలిచిన ఆయన, తెలంగాణ వచ్చిన తర్వాత ప్రజల సమస్యల పరిష్కారమే ఎజెండాగా ముందుకు సాగుతున్నారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో...)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

2 కామెంట్‌లు:

Naa Tho Neenu చెప్పారు...

Orey sannasi,

Telangana vachindi kadara.. inka ninaaa edavadam api koncham pani cheyandi raa telangana develop cheyadaniki...

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

ఒరేయ్ ఉడుకుమోతు వెధవా! ఇప్పటిదాకా తెలంగాణపై పరాన్నభుక్కులుగా ఆధారపడి మెక్కి సోమరిపోతులుగా మారి బలిసింది ఎవడురా? మేం పనిచేస్తేనే మాకు తిండి....మీకు మరొకని నెత్తిన చెయ్యిపెట్టి మోసగించి, బురిడీకొట్టించి...అక్రమార్జనచేస్తేనే వస్తుంద్... బలుపు...పొగరు! శ్రమను నమ్ముకున్నవాళ్ళం మేం....పరుల రెక్కలకష్టాన్ని అనాయాసంగా దొబ్బితినడానికి చూసేది మీరు! మా అభివృద్ధి మేం చూసుకుంటాం...మధ్యలో నీ ఏడుపు ఎందుకురా? పోయి అసంపూర్ణంగా ఆగిపోయిన నీ బ్లాగులో వెధవరాతలు రాసుకోపో....మా బ్లాగుల్లోకి చవట సన్నాసిలా మరోసారి రాకు...వస్తే గాడిదపై సన్మానం చేయిస్తాం వెధవా! ఫో...ఫో...ఫో...

కామెంట్‌ను పోస్ట్ చేయండి