ఇదే టపాను నేను గతంలో "ఇదీ...సీమాంధ్ర పాలకుల నిర్వాకం!" పేరిట...దివి: 15-03-2014 ఈ బ్లాగులో ప్రచురించాను. ఈ మధ్య (దివి: 07-05-2014) బాసర ట్రిపుల్‍ఐటీలో అసౌకర్యాలను గూర్చి పత్రికల్లో రకరకాల వార్తలు వచ్చిన నేపథ్యంలో గతం నుండి ఇప్పటి వరకూ బాసర విద్యార్థుల కష్టాలలో ఏమార్పూ రాలేదని అర్థమైంది. అందుకే అందరి దృష్టికీ తేవడానికై ఈ టపాను మళ్ళీ నేడు ప్రచురింపవలసివస్తున్నది. నేతలూ, అధికారులూ తగిన విధంగా స్పందించి, ఆ విద్యార్థులకు జరుగుతున్న అన్యాయాన్ని కొంతైనా తీరుస్తారని ఆశ. ఇక చదవండి...
బాసరలో ట్రిపులైటీ
నెలకొల్పుట పేరునకని,
నూజివీడులో, ఇడుపుల
పాయలొ జూచిన తెలియును!!
సీమాంధ్రుల పక్షపాత
మున కిదియే నిదర్శనము!
మొక్కుబడిగ నెలకొల్పిరి,
సమస్యలకు తావిచ్చిరి!!
త్రాగుటకును మంచినీళ్ళు
కరువైనవి ఈ చోటున!
స్నానాదికములకు నదిని
ఆశ్రయింపవలె నిచ్చట!!
ఆహారపు సరఫరాలొ
ప్రైవేట్ వ్యక్తుల దందా!
అధికారుల మెప్పించుచు
విద్యార్థుల మాడ్చుచుండ్రి!!
అనారోగ్య స్థితుల కిచట
వైద్యమ్మే కరువాయెను!
ప్రజాస్వామ్యమున విద్యా
ర్థుల బానిసలను జేసిరి!!
అధికారులు, నాయకులకు
ఎన్నిమార్లు మొరపెట్టిన,
వాగ్దానములిచ్చెదరయ,
నెరవేర్చుట మరచెదరయ!
విద్యార్థుల దయనీయపు
పరిస్థితికి తలిదండ్రులు
చక్కజేయు దారిలేక,
ఆవేదనచెందుచుండ్రి!
గతంలోన విద్యార్థులు
నలుగురు ఇది తాళలేక,
మరియొక మార్గము లేకయె
ఆత్మహత్య జేసికొనిరి!
విద్యార్థిను లిట వేధిం
పులకును గురియగుచుండిరి!
ఆదుకొనెడివారు లేక,
బావురుమని యేడ్చుచుండ్రి!!
ఆందోళన జరిగినపుడు
’గుర్తింతురు’ అని భయపడి,
విద్యార్థినులంత ముసుగు
ధరియించుట దారుణమ్ము!
"ఒక విద్యార్థినిని గదిని
బంధించియు, హింసించిరి"
అను ఆరోపణను జూడ,
ఈ స్థితెంత దారుణమయ?
హైదరబాదున నిర్మిం
పగ జూచిన ట్రిపులైటీ
బాసరలో పెట్ట గోర,
కక్షబూనిరయ్యవారు!
కోస్తలోన, సీమలోన
నెలకొల్పిన సౌకర్యాల్
బాసరలో ఏలలేవు?
తెలగాణముపై వివక్ష??
కాంగిరేసు పరిపాలన,
సీమాంధ్రుల అజమాయిషి,
ఈ విద్యా సంస్థ నిటుల
అధోగతికి నెట్టివేసె!
మన తెలగాణపు సంస్థను
మనమే సరిచేయవలెను!
మన బాధల దీర్చునట్టి
పాలకులను ఎన్నవలెను!!
*** *** ***
ఈ విషయంలో పూర్తి వివరాలకు :
(నమస్తే తెలంగాణ పత్రిక సౌజన్యంతో)
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి