గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

బుధవారం, మే 28, 2014

ఇవి రెచ్చగొట్టే చర్యలుకావా?


- కేంద్రం నిర్దేశాలు పాటించడం లేదు
- కాంట్రాక్టు ఉద్యోగుల తొలగింపుపై టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ స్వామిగౌడ్ 
- వార్‌రూంకు భారీగా ఫిర్యాదులు: ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్

రాజీవ్ విద్యామిషన్‌లో పని చేసే 2,300 మంది కాంట్రాక్టు ఉద్యోగులను సీమాంధ్ర అధికారి తొలగించడంపై టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ స్వామిగౌడ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వంలో కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని కేసీఆర్ చెప్పినా ఉద్యోగులను తొలగించడం రెచ్చగొట్టే చర్యే అవుతుందన్నారు. సోమవారం ఆయన తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ కొత్తగా ఉద్యోగాలను రిక్రూట్‌మెంట్ చేయడం, ఉన్నవారిని తొలగించడం లాంటి చర్యలను చేపట్టవద్దని కేంద్రం స్పష్టమైన ఆదేశాలిచ్చినా ఎందుకు తొలగించారని నిలదీశారు. అంతకు ముందు రాజీవ్‌విద్యామిషన్ కాంట్రాక్టు ఉద్యోగులు భవన్‌కు తరలివచ్చి ఎమ్మెల్సీ స్వామిగౌడ్, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌కు తమ గోడు వినిపించారు. 

కుట్రలు బయటపడుతున్నాయి: శ్రీనివాస్‌గౌడ్
టీఆర్‌ఎస్ పార్టీ వార్‌రూంలో ఏర్పాటు చేసిన వెబ్‌సైట్, ఈ మెయిల్ ఐడీకి సీమాంధ్ర ఉద్యోగులు చేసే కుట్రలపై అనేక ఫిర్యాదులు అందుతున్నాయని ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ చెప్పారు. ఇప్పటి వరకు 55 శాఖల నుంచి 560 మంది ఫిర్యాదులు చేశారని, అలాగే 386 మెయిల్స్, వెబ్‌సైట్ ద్వారా 11 ఫిర్యాదులు అందాయన్నారు.

సోమవారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ సీమాంధ్రలోని 13 జిల్లాలో తెలంగాణ ఉద్యోగులు 0.5 శాతం ఉంటే, తెలంగాణలోని ఒక్క మహబూబ్‌నగర్ జిల్లాలోనే 1175 మంది సీమాంధ్ర ఉద్యోగులున్నారని వివరించారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన 2 వేలమంది కానిస్టేబుల్స్ తెలంగాణలో విధులు నిర్వహిస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. వార్‌రూంకు వచ్చిన ఫిర్యాదులను ఒక నివేదిక రూపంలో త్వరలో ప్రభుత్వ ప్రధానకార్యదర్శికి అందజేస్తామని తెలిపారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి