గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

మంగళవారం, మే 13, 2014

వాళ్లంతా హైదరాబాదీలేనట!


-కార్మికశాఖలో విభజనవేళ పుట్టుకొచ్చిన నయా తెలంగాణ పౌరులు

ఆప్షన్ల పుణ్యమా అని ఆంధ్రా ఉద్యోగులెవరూ తెలంగాణను విడిచి వెళ్లేలా లేరు. హైదరాబాద్‌లో పుట్టాం అనే సాకుతో ఇక్కడే తిష్ఠ వేయడానికి దారులు వెతుకుతున్నారు. ప్రధానంగా రాష్ట్ర కార్మిక శాఖ, ఆంధ్రప్రదేశ్ భవన, మరియు నిర్మాణ కార్మికుల బోర్డుల్లో ఈ పరిస్థితి కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది.

ఇంతకాలం ప్రాంతం పేరు చెప్పి అధికారం చెలాయించిన సీమాంధ్రులు విభజన ప్రక్రియ మొదలు కావడం ఆలస్యం హఠాత్తుగా హైదరాబాదీ బ్యాడ్జీతో నయా తెలంగాణ పౌరులుగా మారిపోయారు. ఉద్యోగుల విభజన చేపట్టేటప్పుడు సీమాంధ్ర అధికారులు సమర్పించిన ఆధారాలను, ఓ కమిటీ ద్వారా పరిశీలించాలని టీఎన్జీఓలు కార్మిక శాఖ కమిషనర్‌ను కోరారు. ఐతే సీమాంధ్ర ఉన్నతాధికారులు వారి డిమాండ్ తోసిపుచ్చారు. పలువురు అధికారుల స్థానికతను బట్టబయలుచేస్తూ టీ ఉద్యోగులు ఇచ్చిన వివరాలను ఆ ఉద్యోగులకే అందజేస్తూ ఉద్యోగుల మధ్య చిచ్చు పెడుతున్నారు. 

చట్ట విరుద్ధంగా పోస్టింగులు:
కార్మికశాఖ అక్రమాల పుట్టగా మారింది. ఈ శాఖలో ప్రెసిడెన్షియల్ ఆర్డర్లకు విరుద్ధంగా అనేక పోస్టింగులు ఇచ్చారని, జిల్లాల నుంచి ప్రధాన కార్యాలయానికి 12.5 శాతం కోటాకు మించి నియామకాలు చేపట్టారని టీ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. సీమాంధ్రనుంచి వచ్చి ఇక్కడ నాల్గో తరగతి పోస్టులో చేరిన కొందరు ఇపుడు సూపరింటెండెంట్లుగా మారిపోయారు. గుంటూరు జిల్లాలో ఓ అసిస్టెంట్ కమిషనర్ విధి నిర్వహణలో చనిపోతే ఆయన స్థానంలో కారుణ్య నియామకం కింద ఒకరికి ఇవ్వాల్సిన పోస్టులో ఇద్దరికి పోస్టింగులు ఇచ్చారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ శాఖలో ప్రిన్సిపల్ సెక్రటరీ మొదలు జాయింట్ సెక్రటరీ, డిప్యూటీ సెక్రటరీ...ఇలా అందరూ సీమాంధ్రులే ఉన్నారు.

వీళ్ల సర్టిఫికెట్లు పరిశీలించాల్సిందే...
టీ ఉద్యోగులు సమర్పించిన వినతి పత్రంలో...
-జాయింట్ కమిషనర్ కేటీ పద్మజ
-అసిస్టెంట్ కమిషనర్లు ఎస్ అజంతకుమారి, రామలక్ష్మి, జీ గోపమ్మ, డీవీ పద్మజ, సిసీహెచ్ ఉషారాణి
-పర్యవేక్షకులు వి వెంకటరమణి, ఎస్‌కే అహ్మద్‌అలీ, కుసుమకుమారి, వెంకటేశ్వర్లు, సుబ్బారావు, కే వసంతరావు, సీహెచ్ వెంకటేశం, ఎస్ రమేశ్, ఆనంద్‌పాల్, ఎం వేణుగోపాల్, టీ శ్రీనివాసరావు, రామకృష్ణ, జీ నారాయణస్వామి, జీ రత్నశీలకుమారి, ఈవీ రమణమ్మ, శారదాకుమారి, కే శ్రీధర్, ఎన్ సురేశ్‌బాబు, ఏ సీతాలక్ష్మి, ఎస్‌కే నజీర్‌బాషా, ఏవీఎన్ మణి, కేజీ జ్ఞానసుందర్, హరికృష్ణ
-సీనియర్ అసిస్టెంట్లు ఉమాదేవి, దేవర ఆశ, ధనుంజయుడు, పద్మశ్రీ, కనక దుర్గాభవాని, ఏవీఎస్ నాయుడు
-సీనియర్ స్టెనోలు ఈ జ్యోతికుమారి, నాగరాణి, ప్రసన్నకుమారి

...వీరందరి స్థానికత వివరాలను నిగ్గు తేల్చాలని డిమాండ్ చేస్తున్నారు.

సీమాంధ్రుల ఆగడాలు ఇన్నీ...అన్నీ...కావు!
ప్రతి శాఖలో...ప్రతి ఒక్కటీ...వాళ్ళ మోసాన్ని ప్రకటించేదే!
వీరిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టరాదు.
అక్రమాలు బయటపెట్టాలి...తగిన శిక్షవేయాలి...
అప్పుడుగానీ వీళ్ళ తిక్కకుదరదు...
మన తెలంగాణులకు న్యాయంజరగదు!

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో...)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి