-గుట్టుచప్పుడు కాకుండా 11వ షెడ్యూల్‌లో సీమాంధ్ర అక్రమప్రాజెక్టులు
-టీ ఇంజినీర్ల సంఘం ఆరోపణ
రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లులోని పదకొండో షెడ్యూల్‌లో మరో పదహారు సాగునీటి ప్రాజెక్ట్‌లను నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులు హడావిడిగా చేర్చడంలో ఆంతర్యమేమిటని తెలంగాణ ఇంజినీర్లు ప్రశ్నిస్తున్నారు.
కృష్ణా, గోదావరి బేసిన్‌లలో కొన్ని అక్రమప్రాజెక్టులను షెడ్యూల్‌లో చేర్చి వాటర్ మేనేజ్‌మెంట్ బోర్డుల పరిధిలోకి తీసుకువచ్చే ప్రయత్నం జరుగుతోందని తెలంగాణ ఇంజినీర్ల జేఏసీ నాయకులు శ్రీధర్ దేశ్‌పాండే, సల్లా విజయ్‌కుమార్, హైదరాబాద్ ఇంజినీర్ల అసోసియేషన్ ప్రెసిడెంట్ మహేందర్, తెలంగాణ రిటైర్డ్ ఇంజినీర్ల ఫోరం అధ్యక్షుడు చంద్రమౌళి, ప్రధాన కార్యదర్శి మేరెడ్డి శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి ఆరోపించారు.
సీమాంధ్రకు చెందిన కొన్ని అక్రమ ప్రాజెక్టులకు అధికారిక గుర్తింపునివ్వడానికి పదకొండో షెడ్యూల్‌లో చేరుస్తూ సీమాంధ్రకు చెందిన అధికారులు కేంద్రానికి సిఫారసు చేయడం అన్యాయమని వారు పేర్కొన్నారు.
ఓవైపు ఇరురాష్ట్రాలకు మరికొద్ది రోజుల్లో కొత్త ప్రభుత్వాలు ఏర్పడనున్న క్రమంలో నీటి పారుదలశాఖ ఉన్నతాధికారులు గుట్టుచప్పడు కాకుండా అలవికాని ప్రాజెక్టులను పదకొండో షెడ్యూల్‍లో చేర్చడం అనుమానాలకు తావిస్తోందని వెంటనే వివరాలను ఆ అధికారులు బయటపెట్టాలని వారు డిమాండ్ చేశారు.
సీమాంధ్రుల ఆగడాలు ఇన్నీ...అన్నీ...కావు!
ప్రతి శాఖలో...ప్రతి ఒక్కటీ...వాళ్ళ మోసాన్ని ప్రకటించేదే!
వీరిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టరాదు.
అక్రమాలు బయటపెట్టాలి...తగిన శిక్షవేయించాలి...
అప్పుడుగానీ వీళ్ళ తిక్కకుదరదు...
మన తెలంగాణులకు న్యాయంజరగదు!(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో...)
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి