గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

గురువారం, మే 15, 2014

ఎంతైనా సీమాంధ్ర బుద్ధికదా...కుట్రలు చేయకుండావుంటారా?

industrial-- తెలంగాణలో పారిశ్రామిక రంగంపై సీమాంధ్రుల కుట్ర...
- సీమాంధ్రలో పరిశ్రమలు ఏర్పాటుచేస్తే..ప్రత్యేకహోదాతో లాభం అంటూ ఉచిత సలహాలు.. 
-రాయితీలపై విస్తృత ప్రచారం...
- 148 భారీ పరిశ్రమలపై సీమాంధ్రుల కన్ను..
-ఉమ్మడి సర్వర్‌తో ఇబ్బందులే...

రాష్ట్ర విభజన సమయంలోనూ సీమాంధ్ర అధికారులు తమ బుద్ధి పోనిచ్చుకోలేదు. సొంత ప్రాంతంపై వారు చూపుతున్న వల్లమాలిన అభిమానం భవిష్యత్తులో తెలంగాణకు తీవ్రనష్టదాయకం కానుంది. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు-2014ను రాజ్యసభలో ప్రవేశపెట్టిన సందర్భంగా ప్రధాని మన్మోహన్‌సింగ్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌తోపాటు, తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకహోదా వర్తింపజేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఆ విషయాన్ని మరుగున పెట్టి కేవలం ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే ప్రత్యేకహోదా అంటూ పరిశ్రమలశాఖకు చెందిన కొందరు సీమాంధ్ర అధికారులు ప్రచారం మొదలుపెట్టారు. తెలంగాణ రాష్ట్రంలో కొత్త పరిశ్రమలను నెలకొల్పేందుకు దరఖాస్తు చేసుకున్న పారిశ్రామికవేత్తలు, ఔత్సాహికులు, కంపెనీలకు ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేసుకుంటే లాభమని ఉచిత సలహాలిస్తున్నారు. ఇప్పటికే ఉమ్మడి రాష్ట్రంలో 148 భారీ ప్రాజెక్టులను నెలకొల్పేందుకు అనుమతులు కోరుతూ దరఖాస్తులొచ్చాయి. రాష్ట్ర విభజన కోసం ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న కాలంలో వచ్చిన ఈ దరఖాస్తులన్నీ ఇంతకాలం పెండింగ్‌లోనే ఉన్నాయి. ఇప్పటివరకు వీటిని పరిశీలించకుండా కాలయాపన చేశారు.

వీరిలో చాలామంది తెలంగాణలోనే పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అయితే రాష్ట్ర విభజనతో మారిన పరిస్థితులను ఆసరాగా చేసుకుని ఆంధ్రప్రదేశ్‌కు ఈ పరిశ్రమలన్నింటినీ తరలించే కుట్రలు జరుగుతున్నాయి. ప్రధానంగా పరిశ్రమలశాఖ, దాని అనుబంధ శాఖల్లో ఉన్నతాధికారులంతా సీమాంధ్రకు చెందినవారే కావడంతో దరఖాస్తుల పరిశీలన బాధ్యత ఏకపక్షంగా సాగుతోంది. తమ దగ్గరకు అనుమతుల కోసం వచ్చే దరఖాస్తుదారులు/పారిశ్రామికవేత్తలకు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ఉండడం వల్ల అక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేసుకుంటే పన్నుల భారం తగ్గి, అధిక లాభాలు పొందొచ్చునంటూ సలహాలిస్తున్నారు.

ఉమ్మడి సర్వర్‌తో నష్టమే
రాష్ట్ర విభజన సందర్భంగా అన్ని శాఖలతోపాటు పరిశ్రమల శాఖ కూడా రెండుగా విడిపోనుంది. ఈ రెండు శాఖలకు ప్రత్యేక వెబ్‌సైట్లు రూపొందించేందుకు ప్రస్తుతం ఏర్పాట్లు చేస్తున్నారు. కానీ రెండింటికీ ఉమ్మడిగా ఒకే సర్వర్‌ను ఉంచడం సమస్యగా మారనుంది. ఒకే సర్వర్ ఉంటే ఒక రాష్ర్టానికి వచ్చే దరఖాస్తులు మరో రాష్ర్టానికి కూడా తెలిసిపోతాయి. ఏకగవాక్ష (సింగిల్‌విండో) విధానంలో అనుమతులు ఇచ్చే పాలసీ ప్రస్తుతం అమలులో ఉంది. ఈ సమయంలో ఒకే సర్వర్ ఉండడం వల్ల సీమాంధ్ర ఉన్నతాధికారులు పారిశ్రామికవేత్తలను ప్రభావితం చేసి పరిశ్రమల స్థాపనలో ఆధిపత్యాన్ని చెలాయించేందుకు అవకాశం ఏర్పడుతుందని సాంకేతిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అపాయింటెడ్ డే లోపే రెండు రాష్ట్రాలకు రెండు వెబ్‌సైట్లను రెండు సర్వర్లను ఏర్పాటుచేయాలని తెలంగాణ ఉద్యోగులు కోరుతున్నారు.

కొన్ని ప్రధాన ప్రాజెక్టులు
- ఆదిలాబాద్ జిల్లాలో రూ.3360 కోట్లతో శాలివాహన సిమెంట్ ఇండస్ట్రీస్, ఖమ్మం జిల్లాలో రూ.3360 కోట్లతో ఐటీసీ పేపర్ లిమిటెడ్, మెదక్ జిల్లాలో రూ.1000 కోట్లతో ఎఫ్‌ఆర్‌టీ డెయిరీ వెంచర్స్ ప్రైవేటు లిమిటెడ్, మహబూబ్‌నగర్ జిల్లాలో రూ.970 కోట్లతో ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్ హోంప్రొడక్ట్స్ లిమిటెడ్, కరీంనగర్ జిల్లాలో రూ.700 కోట్లతో బయోమాస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ప్రైవేటు లిమిటెడ్, రంగారెడ్డి జిల్లాలో రూ.582 కోట్లతో వైట్‌గోల్డ్ టెక్స్‌టైల్ పార్కు లిమిటెడ్, రూ.1000 కోట్లతో బీడీఎల్ యూనిట్లు, నిజామాబాద్ జిల్లాలో రూ.453 కోట్లతో రెడ్సన్ సీమ్‌లెస్ ట్యూబ్స్ లిమిటెడ్, మహబూబ్‌నగర్ జిల్లాలో రూ.400 కోట్లతో జాన్సన్ అండ్ జాన్సన్ ప్రైవేట్ లిమిటెడ్, రంగారెడ్డి జిల్లాలో రూ.300 కోట్లతో మిథాని, రూ.280 కోట్లతో టెక్స్‌కాన్ స్టీల్ లిమిటెడ్, మెదక్ జిల్లాలో రూ.66 కోట్లతో ఎన్‌వర్షన్ సర్వీసెస్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీలు చేపట్టనున్న ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయి.

- నల్లగొండ జిల్లాలో రూ.7751 కోట్లతో మెగా మల్టీప్రొడక్ట్ ఇండస్ట్రియల్ పార్కు, రూ.700 కోట్లతో ఎస్సార్‌ఎం గ్లోబల్ సిమెంట్స్, రూ.600 కోట్లతో మైహోం ఇండస్ట్రీస్ లిమిటెడ్, రూ.404 కోట్లతో ఎన్విరాన్‌మెంటల్ సర్వీసెస్, ఆదిలాబాద్‌లో రూ.800 కోట్లతో రేణుక సిమెంట్ లిమిటెడ్, రంగారెడ్డి జిల్లాలో రూ.500 కోట్లతో బీఈఎల్ యూనిట్, మెదక్ జిల్లాలో రూ.100 కోట్లతో నూజివీడు సీడ్స్ ప్రైవేటు లిమిటెడ్‌లు చేపట్టనున్న ప్రాజెక్టులు ప్రాథమిక దశలోనే ఉన్నాయి.

- మహబూబ్‌నగర్ జిల్లాలో రూ.1500 కోట్లతో వెస్ట్‌కోస్ట్ పేపర్ మిల్స్ లిమిటెడ్, రూ.154 కోట్లతో హీమాంక్షి బేకర్స్ ప్రైవేటు లిమిటెడ్, ఖమ్మం జిల్లాలో రూ.15900 కోట్లతో మధుకాన్ గ్రూప్ గ్రానైట్ స్లాబ్ అండ్ టైల్స్, రంగారెడ్డి జిల్లాలో రూ.704 కోట్లతో బిర్లా రీసెర్చ్ అండ్ లైఫ్ సైన్సెస్ లిమిటెడ్ ఇంట్రీగ్రేటెడ్ ఆయూర్వేద కాంప్లెక్స్, నల్లగొండ జిల్లాలో రూ.13 కోట్లతో ఎన్‌కేఎన్ అగ్రో ప్రొడక్ట్స్ ప్రైవేటు లిమిటెడ్ వీట్ పౌడర్ ప్రాజెక్టుల పనులు నేటికీ ప్రారంభం కాలేదు.

పెండింగ్ దరఖాస్తులపై దృష్టి పెట్టాలి
- కే సుధీర్‌రెడ్డి, చైర్మన్, తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య
పెండింగ్ దరఖాస్తులపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ప్యాకేజీల రూపంలో అందించే రాయితీలపై దుష్ప్రచారం చేసి ఇక్కడ ఏర్పాటు చేయనున్న పరిశ్రమలను ఆంధ్రప్రదేశ్‌కు తరలించే ప్రమాదం ఉంది. పరిశ్రమలశాఖలో ఉన్నతాధికారులంతా సీమాంధ్రులే కావడం వల్ల ఈ అనుమానాలు కలుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమలు ఏర్పాటు చేయడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయని, ల్యాండ్ బ్యాంక్ అధికంగా ఉండడం వల్ల పెద్ద ఎత్తున స్థలాలు పొందే అవకాశం ఉందంటూ వీరు ప్రచారం చేసే అవకాశం లేకపోలేదు. పరిశ్రమల శాఖ కార్యాలయం ఒకే చోట ఉండడం, ఒకే సర్వర్ ద్వారా రెండు వెబ్‌సైట్లను నిర్వహించడం వల్ల దుష్పరిణామాలు తప్పవు.


సీమాంధ్రుల కుట్రల్ని భగ్నం చేసి...
తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చుకోవడానికి అనువైన మార్గాలు వేసుకోవాల్సిన అవసరం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన మరుక్షణం నుండే ఏర్పడుతుంది.
తెలంగాణ నాయకులు, మేధావులు, సాంకేతిక నిపుణులు ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండి...
తెలంగాణకు దక్కవలసిన ప్రతి అంశంపైనా దృష్టి పెడితేనే అభివృద్ధి సత్వర గతిన సాధ్యమవుతుంది.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో...)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

2 కామెంట్‌లు:

Unknown చెప్పారు...

ఏమయ్యా నీకు బుద్దుందా అసలు? నోటికొచ్చిన కూతలు కూస్తావు.అదేమంటే ప్రజల్ని అనలేదు పెట్టుబడి దారుల్ని అన్నాననంటావు. పద్యాలు రాయగానే పండితుడివై పోతావా? కొద్దిగా సంస్కారం అక్కర్లేదా?ఎంతైనా సీమాంధ్ర బుద్ధి ఏమిటి? ఇలాగేనా రాసేది? ఇది అభిమానం కాదు, ఉన్మాదం!

కాస్త తల తిరుగుడు తగ్గించుకుని ప్రేలాపనలు మాను! లేదంటే నీ రాష్ట్రంలోనే నీ తాట తీయాల్సి ఉంటుంది గుర్తుంచుకో!

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

నీవన్న మొదటి రెండు వాక్యాలు నీకే చెందుతాయి. ఎందుకంటే...అసలు నీకు కళ్ళున్నాయా? అరవై ఏండ్లనుండి తెలంగాణులను సీమాంధ్రులు దోచుకున్నది నీ కంటికి కనిపించలేదా? మీరు దోపిడీ చేస్తారు...కానీ...మేం ఇదేంటని ప్రశ్నించకూడదు. ప్రశ్నిస్తే "నీకు బుద్ధుందా" అంటారు. నేను ఉన్నవిషయం ఉన్నట్లు చెప్పాను..."ఉన్నది ఉన్నట్లంటే ఊళ్ళో ఉండవద్దు" అన్నట్లు నీ మాటలున్నాయి. మేం ఎప్పుడు సీమాంద్రులను దోషులుగా చూపినా...అక్రమార్కులనే...సాధారణ పౌరులను కాదు. ఈ పాటి జ్ఞానం కూడా లేకుండా నన్ను పరుషంగా అంటున్న నీకే అసలు సంస్కారం లేదు. పద్యాలు రాయగానే పండితుడినై పోయానని నేనెప్పుడూ అనలేదు. నా పాండిత్యానికి నీ సర్టిఫికేటు కూడా నాకనవసరం. అడుక్కోచ్చుకున్న డైలాగులతో సంస్కార హీనుడివై నానా ప్రేలాపనలూ ప్రేలుతున్నది నువ్వుకాదా? మేం మీ కింద ఎంతకాలం నోరెత్తకుండా అణగిమణగి వుండాలి? సీమాంధ్ర అక్రమార్కుల దౌర్జన్యం "సెక్రెటేరియట్"కు వెళ్ళితే తెలుస్తుంది. వాళ్ళు ఎన్ని నాటకాలాడుతున్నారో...ఆడారో. మా ఉద్యోగాల్లో మీరే...ఉండాలి...మీ ఉద్యోగాల్లో మీరే ఉండాలి. మాకు ఉద్యోగాలు అక్కరలేదా? మీ రాష్ట్రంలో మీరు ఉద్యోగాలు చేసుకోవాలి...మా రాష్ట్రంలో మేము ఉద్యోగాలు చేసుకోవాలి. ఇదీ న్యాయం. కానీ, మా ఉద్యోగాలూ, మీ ఉద్యోగాలూ రెండూ మీకే కావాలా? అవ్వా నాకే కావాలి...బువ్వా నాకే కావాలి...అంటే మేం ఎక్కడికి పోవాలి? ఇంకా దోపిడీ చేసే బుద్ధి సీమాంధ్రులది అని నేనంటే నీకు రోషం ఎందుకు వస్సోంది? అక్రమార్కులతో పాటు నిన్నుకూడా కలిపాననుకుంటున్నావా? నీకెందుకు రోషం? నువ్వు తప్పు చేస్తే నీకు రోషం. గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకోవడం అంటే ఇదే! ఇంత పరుషంగా నన్ను తిట్టేముందు మీ సీమాంధ్రులు మా పట్ల చేసిన ద్రోహం గుర్తుకు తెచ్చుకో. నీవు నన్నన్న మాటలన్నీ నీకే వర్తిస్తాయి. ఏనుగు పోతుంటే కుక్కలు ఎన్ని మొఱగవు? ఇది కూడా అంతే అని నేను సరిపెట్టుకుంటాను. నీది సీమాంధ్ర అభిమానం కాదు, సీమాంధ్ర ఉన్మాదం!

"కాస్త తల తిరుగుడు తగ్గించుకుని ప్రేలాపనలు మాను! లేదంటే నీ రాష్ట్రంలోనే నీ తాట తీయాల్సి ఉంటుంది గుర్తుంచుకో!" అనడం నీ సీమాంధ్ర బుద్ధికి నిదర్శనం. ఈ మాటలు నీకే వర్తిస్తాయి అనేది గుర్తుంచుకో. మరో సారి నా బ్లాగులోకి వచ్చి ఇలాంటి అడ్డమైన చెత్తవాగుడు, తలతిక్క వాగుడు మళ్ళీ వాగకు. మళ్ళీ వచ్చావో మర్యాద దక్కదు...జాగ్రత్త.

కామెంట్‌ను పోస్ట్ చేయండి