-సీమాంధ్ర ఉద్యోగుల మరో కుతంత్రం
-నకిలీల వివరాలన్నీ సేకరిస్తున్నాం
-వారిపై త్వరలోనే క్రిమినల్ కేసులు
-టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు దేవీప్రసాద్
సీమాంధ్ర ఉద్యోగులు నకిలీ ధ్రువీకరణ పత్రాలు సృష్టించి సర్వీస్ పుస్తకంలో తమ స్థానికతను మార్చేందుకు యత్నిస్తున్నారని టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు జీ దేవీప్రసాద్ విమర్శించారు. రాష్ట్ర విభజన తర్వాత కూడా తెలంగాణలోనే తిష్ఠ వేసేందుకు బోగస్ సర్టిఫికేట్లను సృష్టిస్తున్నారని ఆరోపించారు. నకిలీ సర్టిఫికెట్లను తయారు చేస్తున్న అక్రమార్కుల వివరాలను సేకరిస్తున్నామని, త్వరలోనే వారిపై క్రిమినల్ కేసులను నమోదు చేస్తామని హెచ్చరించారు.
మంగళవారం నాంపల్లిలోని తెలంగాణ ఉద్యోగ భవన్‌లో తెలంగాణ పంచాయతీరాజ్ నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం నేతలు దేవీప్రసాద్‌తోపాటు టీఎన్జీవో ప్రధాన కార్యదర్శి కారం రవీందర్‌రెడ్డిని సన్మానించారు. ఈ సందర్భంగా దేవీప్రసాద్ మాట్లాడుతూ ఉద్యోగుల విభజన స్థానికత ఆధారంగానే జరపాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించారు. ఈ నిర్ణయం తర్వాత అనేకమంది ఆంధ్ర ఉద్యోగులు బోగస్ సర్టిఫికేట్లు సృష్టిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. సీమాంధ్ర ఉద్యోగులు తెలంగాణలో ఉండటానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోబోమని స్పష్టం చేశారు. ఆంధ్ర ఉద్యోగులను తెలంగాణకు కేటాయించడాన్ని కూడా అంగీకరించేది లేదన్నారు. చాలా ఏళ్లుగా పంచాయతీరాజ్ శాఖలో స్వీపర్లుగా విధులు నిర్వహిస్తున్న వారి సర్వీసులను క్రమబద్ధీకరించేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.
నెలకు కేవలం రూ.1600 జీతంతో పనిచేస్తున్న స్వీపర్లు కనీస సౌకర్యాలు కూడా తీర్చుకోలేక అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, వారి సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో కేంద్ర సంఘం ప్రతినిధి రామినేని శ్రీనివాస్‌రావు, తెలంగాణ పంచాయతీరాజ్ నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మర్రి యాదయ్యగౌడ్, ప్రధాన కార్యదర్శి మహమ్మద్ మహబూబ్, నాయకులు మహమ్మద్ జాఫర్, లింగయ్య, జే అశోక్, రామ్‌చందర్, మహమ్మద్ పాషా, ఎం అమర్‌నాథ్ తదితరులు పాల్గొన్నారు.
సీమాంధ్రుల ఆగడాలు ఇన్నీ...అన్నీ...కావు!
ప్రతి శాఖలో...ప్రతి ఒక్కటీ...వాళ్ళ మోసాన్ని ప్రకటించేదే!
వీరిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టరాదు.
అక్రమాలు బయటపెట్టాలి...తగిన శిక్షవేయించాలి...
అప్పుడుగానీ వీళ్ళ తిక్కకుదరదు...మన తెలంగాణులకు న్యాయంజరగదు!
(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో...)
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి