గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

బుధవారం, మే 07, 2014

సేమ్ టు సేమ్...


అన్నకోసము చెల్లి యెంతయు
కష్టపడుటయె నిజము ఐనచొ
చూడుడీ శర్మిల ప్రియాంకల
వైఖరుల నిచటన్!

జగనుకోసము శర్మిలయె, మరి
రాహులునకై ఆ ప్రియాంకయు
చూడముచ్చటగా ప్రచారము
చేసిరోయయ్యా!

ముఖ్యమంత్రి, ప్రధానమంత్రియు
అగుటకొరకై కష్టమైనను
ఈ ప్రచారము చేసి వారలు
ప్రజల కోరిరయా!

వారు మాత్రము పోటిచేయరు
వారి తల్లులు ఎంపిలౌటకె
వారి భర్తలు వివాదములలొ
ముఖ్యులే అన్నల్!

చూడగా ఈ పోలికలు ద
గ్గరగనున్నవి ఇరువురకునిక
వారి కోర్కులు నెగ్గగలవో
నెగ్గవో కనుడీ!

ఏది ఏమైనను ప్రజలు తమ
మనసు మెచ్చిన మంచివారికె
వోటు వేసియు గెలువజేతురు
వారలే రాజుల్!

***   ***   ***   ***

ఇదే అంశంలో మరిన్ని వివరలకై:

(ఆంధ్రప్రభ దినపత్రిక సౌజన్యంతో...)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి