ఆంధ్ర బాబూ, బొల్లిబాబూ, చంద్రబాబూ! తొమ్మిదేండ్లు ముఖ్యమంత్రిపదవి అనుభవించావు!
ఇంకా నీకు ముఖ్యమంత్రి పదవిపై మోజు తీరలేదా?
తొమ్మిదేండ్ల తరువాతకూడా నీవే పరిపాలిస్తే, కొత్తవారికి అవకాశం ఎవరిస్తారు?
వేలకోట్లు గడించినా, నీ ధనదాహం, పదవీదాహం తీరలేదా?
ఓట్లకోసం వరాల జిమ్మిక్కులు చేస్తున్నావ్.
నిన్ను ప్రజలు నమ్ముతారనే అనుకుంటున్నావా?
నిన్ను ప్రజలు నమ్ముతారనే అనుకుంటున్నావా?
పదవికోసం నీవు వేసిన ఎత్తుగడ ఇదని ప్రజలకు తెలియదా?
పిల్లి కళ్ళు మూసుకొని పాలుతాగుతూ, నన్నెవరూ చూడడంలేదని అనుకొన్నట్టున్నది నీ వాలకం!
డిప్యూటీ ముఖ్యమంత్రి పదవి బీసీలకూ, కాపులకూ తప్ప మరొకరికి వద్దా?
తెలంగాణలో బీసీని ముఖ్యమంత్రిని చేస్తానని ప్రకటించినట్లే...సీమాంధ్రలో బీసీని ముఖ్యమంత్రి చేస్తానని ఎందుకు ప్రకటించవు?
రేపు ముఖ్యమంత్రివై...గతంలో తెలంగాణను దోచుకున్నట్టే, సీమాంధ్రను దోచుకోవడానికి పన్నాగం ఇది కాదుకదా!
తెలంగాణలో ప్రకటించని ఆడపిల్లలకు సెల్‍ఫోన్‍లు పథకం సీమాంధ్రలో ఎందుకు ప్రకటించావు?
నీ పెద్దకోడలికే రక్షణ లేకుండా చేసిన నీవు, రేపు ఆడపిల్లలకు ఎలాంటి రక్షణ కల్పిస్తావని మేం నమ్మాలి?
ఇదంతా ఎన్నికలలో ప్రజలను నమ్మించి, వోట్లు కొల్లగొట్టే ఎత్తుగడ!
ప్రజల చెవుల్లో పెద్ద కాలీఫ్లవర్‍లు పెట్టాలనే యోచన!
నీలాంటి వాళ్ళను ఎందరిని చూచివున్నారు వాళ్ళు?
ముఖ్యమంత్రి పదవి బరినుండి తప్పుకో, బీసీలకో, ఎస్సీలకో ఆ అవకాశం ఇవ్వు!
అప్పుడే నమ్ముతారు నీవు నీతిమంతుడవని!
గతంలోన తొమ్మిదేండ్లు
ముఖ్యమంత్రిగా ఉంటివి,
ముఖ్యమంత్రి పదవి దాహ
మింక నీకు తీరలేదె?
మరియొక్కరి కవకాశము
ఈయకుండ ఒక్కనివే
ముఖ్యమంత్రిగా పదవిని
అనుభవించ నేలనయ్య?
తెలంగాణలోన బీసి
ముఖ్యమంత్రి ఉండగాను,
సీమాంధ్రలొ కూడ బీసి
ముఖ్యమంత్రి వద్దాయేం?
తెలంగాణలోన డిప్యూటీ
ముఖ్యమంత్రి ఒక్కరున్న,
సీమాంధ్రలొ ఇద్దరనుచు
ప్రకటించుట దేనికొరకు?
డిప్యూటీ ముఖ్యమంత్రి
పదవి ఒక్కటున్నచాలు!
ముఖ్యమంత్రి బీసీలకు,
డిప్యూటీ ఎస్సీలకు!!
ముఖ్యమంత్రి కావలెనని
కోర్కె నీకు ఉండుగాక,
బీసీ, ఎస్సీల కిపుడు
పదవులీయగానువలదె?
బీసీ, ఎస్సీలలోన
ఒక్కరికిని ముఖ్యమంత్రి,
ఇంకొకరికి డిప్యూటీ
ముఖ్యమంత్రి పదవి వలయు!
ముఖ్యమంత్రిగా తొమ్మిది
ఏండ్ల పాలనమ్ములోన
వేలకోట్లు గడించితివి,
ఇంక తృప్తి కలుగలేదె?
ఆడపిల్లలకు సెల్‍ఫోన్
అని ఇప్పుడు అనుచుంటివి,
తెలంగాణలోన నీవు
ఎందుకు ప్రకటించలేదు?
ఎన్నిక తాయిలము లివే,
ఓట్లకొరకు బీసీలకు,
ఆడపిల్లలకును నీవు
వేసినట్టి గాల మిదే!
స్వంత కోడలిని ఇడుముల
పాల్జేసినయట్టి నీవు,
బాలికలకు రక్షణమ్ము
నెట్టుల కల్పింతువయ్య?
పదవిపైన ప్రేమె గాని,
ప్రజలపైన ప్రేమ లేదు!
నోట్లు గడించుటకె నీవు,
వోట్లు అడుగుచుంటివయ్య!!
ఎన్నికలలొ స్టంటిదయ్య!
ముఖ్యమంత్రి బరినుండియు
నీవు తప్పుకొని, ఎస్సికి
చోటిచ్చిన నమ్మెదమయ!
జై తెలంగాణ! జై ఆంధ్రప్రదేశ్!
2 కామెంట్‌లు:
కర్రి మొగమోడా, గద్ద ముక్కోడా,
తాగుబోతోడా , నిద్రమొగమోడా,
విషం కక్కాఎ తెలపామోడా,
మనసంత విద్వెషంతో నిండిన
తెల్బానోడా, పక్కొడి మీద పడి ఏడకురా,
మొద్దు గుడుంబా గాడా,
కష్టపడి పని చెయ్యరా, ఏడుపు అదే పొవుం
ఓయీ rome neo! నేను చెప్పింది వాస్తవాలు! విషం కక్కుతున్నది నువ్వు! అసభ్యమైన, అసంబద్ధమైన వ్యాఖ్యలతో పెట్రేగిపోయింది నీవు. నేను రాసిన రాతలు అబద్ధాలైతే...సప్రమాణపూర్వకంగా ఖండించడం చేతకాక, అడ్డమైన ఏడుపులు ఏడుస్తున్నది నీవు. పైగా నన్ను ఏడుస్తున్నావని అంటున్నావు. చేతకాని మొహాలకు అడ్డమైన కూతలురాక మరేం వస్తాయి? మమ్మల్ని దోచుకొని తిన్నదోపిడీ దొంగలకు ఇలాంటి మాటలుకాక మరేం వస్తాయి? ఇంకా మమ్మల్ని తెలబాన్ అంటున్న కుసంస్కారానికి జాలిపడుతున్నాను తెలబాన్ధ్రుడా! మేం కష్టపడేవాళ్ళమో..సోమరిలా పరాన్నభుక్కులమై ఇతరుల ఉద్యోగాలు కొట్టేసి మెక్కేవాళ్ళమో ప్రపంచానికంతటికీ తెలుసు! వెధవమాటలాపి..మరోసారి ఈ బ్లాగులోకి రాకు...నీ మాటలకంపు భరించలేకున్నాం...ఫోరా...దుర్గంధభూయిష్ఠుడా!
కామెంట్‌ను పోస్ట్ చేయండి