తెలంగాణ కన్యాయము
జరుగుచున్న దనియు నెంత
చెప్పినా, విభజన కమిటి
పెడచెవి బెట్టుచు నున్నది!
స్థానికతను ఆధారము
చేసికొనియు విభజనమును
చేపట్టుటయే న్యాయమ
టంచు చెప్పినను వినరేం?
తెలంగాణ కార్యాలయ
ములలోపల తెలగాణులు,
సీమాంధ్రా కార్యాలయ
ముల నాంధ్రులు ఉండవలెను!
గతంలోన సీమాంధ్రులు
అక్రమముగ దోచినట్టి
తెలగాణుల ఉద్యోగాల్
తెలగాణుల కీయవలెను!
ఆప్షను లనుపేర తెలం
గాణ ప్రాంత ఉద్యోగాల్
కొల్లగొట్టు కుట్ర జరుగు
చున్న దనిన, వినరెందుకు?
సీమాంధ్రులు విభజన కమి
టీ సభ్యుల మేనేజ్ చే
సిన యట్టుల తోచుచున్న
దయ్య నేడు పరికింపగ!
ఆంధ్రవాళ్ళు తెలగాణను
ఉండుటకే ఆప్షనిడిన,
వారి శాతమే హెచ్చగు!
తెలంగాణ వచ్చి వేస్టు!!
ఛత్తీస్ ఘడ్, ఉత్తర ఖండ్,
జార్ఖండ్ రాష్ట్రములందున
అమలు చేయనట్టి ఆప్ష
నుల పద్ధతి ఇచట నేల?
సీమాంధ్రుల లాబీయింగ్
ఇచట బాగ పనిచేసెను!
దోపిడి దొంగల వాదమె
కేంద్రము బలపరిచెనయ్య!!
అరువదేండ్లుగా దోపిడి
చేయబడిన తెలగాణుల
ఉద్యోగాల్ దొంగలకే
కట్టబెట్టు కుట్ర ఇదయ!
ఉమ్మడి ఆంధ్రప్రదేశ
మందు తెలంగాణ వారి
ఉద్యోగాల్ కొల్లగొట్టి
నట్టి ఉదాహరణ లెన్నొ!
ముల్కి నిబంధనలు, రాష్ట్ర
పతి ఉత్తర్వులును, ఆరు
సూత్రమ్ముల పథకమ్ములు,
గిర్‍గ్లానీ, ఫజలాలీల్
నిర్ధారించెను వీటిని!
ఆరువందలపది జీవొ,
మూడు వందల డెబ్బది యొ
కటి-డి వంటి వెన్నొ తెలియ
జేయు నాంధ్ర దోపిడీని!
నష్టపోయినట్టి తెలం
గాణ నింక నష్టపఱచు
కుట్రలన్ని తిప్పికొట్టి
న్యాయమ్మును జరుపవలెను!
అమాయకులు తెలగాణుల
సీమాంధ్రులు మోసగించి,
ఉద్యోగాల్ కొల్లగొనిరి!
ఎచట జూసినను వారలె!!
స్థానికతను తప్పనిసరి
చేసి, వారి గుర్తింపగ
తగిన నిబంధనలు చేసి,
స్థానికులనె ఉంచవలయు!
తాతల, తండ్రుల ప్రాంతమె
స్థానికతను పట్టిచ్చును!
ఇచట బుట్టినంత మాత్ర
మున స్థానికు లెట్లౌదురు?
ప్రథమ నియామకము, ఆంటి
సిడెంటు సర్టిఫికెటు మరి
జనన ధ్రువీకరణపత్ర
ములు ఆధారమ్ములగును!
ఇట్టి సర్టిఫికెటు లన్ని
అసలు, నకిలి తేల్చుటకై
భన్వర్ లాల్ వంటి మంచి
అధికారుల కమిటి వలెను!
నకిలీదని తేలినచో
ఉద్యోగము నూడ బెఱికి,
కఠినమైన కారాగృహ
శిక్షవేయవలయునయ్య!
ఇట్లుగాక ఆప్షనిచ్చి,
దొంగలకే ఉద్యోగాల్
కట్టబెట్టుచో తెలగా
ణులు తక్షణముద్యమింత్రు!
తెలంగాణ కొలువులందు
సీమాంధ్రులు ఎట్లు ఉండ్రు?
ఆప్షనిడినచో, తెలగా
ణమ్ము మాకు ఇచ్చి వేస్టు!
ఆప్షనిడిన యుద్ధమ్మే!
తెలంగాణ ఉద్యోగులు
కలసికట్టుగాను నిలచి
దీని నెదుర్కొందురయ్య!
*** *** *** ***
ఇదే అంశంపై మరిన్ని వివరాలకై:
(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో...)
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
2 కామెంట్‌లు:
ఎవరితో యుధ్ధం చేస్తారు?
ఎంతమందిని చంపేస్తారు?
ఆటవికంగా మాట్లాడకండి దయచేసి.
మహాత్మాగాంధీగారు స్వాతంత్ర్యసంగ్రామం చేసి ఎంతమందిని చంపారో మేమూ అంతమందినే చంపుతాము. ఆటవికంగా మాట్లాడుతున్నది మీరు. మేము చేసిన ఉద్యమంలో ఎవరినైనా చంపామా? మాది సత్యాగ్రహ యుద్ధం. ఈ ఉద్యమంలో మా యువవీరులు పన్నెండువందలమంది ఆత్మబలిదానం చేసుకున్నారు గానీ, ఎవరినీ చంపలేదన్నది మీరు గుర్తుంచుకుని మాట్లాడితే మంచిది.
కామెంట్‌ను పోస్ట్ చేయండి