గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

ఆదివారం, మే 25, 2014

మేం తెలంగాణను వదిలిపెట్టం...మేమూ హైదరాబాదీలమే!


- తెలంగాణలోనే ఉంటాం
- అసెంబ్లీ సీమాంధ్ర ఉద్యోగుల జిత్తులు
- ఆప్షన్ల పేరుతో తప్పుడు ధ్రువపత్రాలు 
- తవ్వుతున్నకొద్దీ బయటపడుతున్న అక్రమాలు
- తప్పుడు సమాచారం ఇచ్చినవారిపై చర్యలు తీసుకోవాలి: తెలంగాణ ఉద్యోగులు

ఉద్యోగుల విభజనలో సీమాంధ్ర ఉద్యోగుల అక్రమాలు తవ్వుతున్నకొద్ది బయటపడుతున్నాయి. ప్రభుత్వం ఇచ్చిన ఆప్షన్ వెసులుబాటును ఆధారంగా చేసుకొని తెలంగాణలో తిష్ఠ వేసేందుకు అక్రమ మార్గాలన్నింటినీ ఉపయోగించుకొంటున్నారు. సీమాంధ్రలో పుట్టి పెరిగిన తాము హైదరాబాదీలమే అంటూ తప్పుడు ధ్రువపత్రాలు సృష్టిస్తున్నారు. అసెంబ్లీలో అటెండర్ నుంచి సెక్రటరీ వరకు దాదాపు నాలుగు వందల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. ఔట్ సోర్సింగ్ కింద మరో 70 నుంచి 80 మంది విధులు నిర్వహిస్తున్నారు.

నాలుగో తరగతి ఉద్యోగులు కాకుండా ఇరు ప్రాంతాల ఉద్యోగులు 188 మంది ఉన్నారు. వీరి జాబితాను నోటీస్ బోర్డులో పెట్టారు. ఇందులో సీమాంధ్రకు చెందిన వారే ఎక్కువగా ఉన్నట్లు తెలంగాణ ఉద్యోగులు చెబుతున్నారు. ఏ రాష్ట్ర ఉద్యోగులు ఆ రాష్ట్రంలోనే పని చేయాల్సి ఉన్నప్పటికి కొంతమంది సీమాంధ్ర ఉద్యోగులు హైదరాబాదీలమంటూ తప్పుడు ధ్రువీకరణ పత్రాలను సమర్పించారని ఆరోపణలున్నాయి. 40 నుంచి 50 మంది వరకు తప్పుడు ధ్రువ పత్రాలు ఇచ్చారని తెలుస్తున్నది. వారిలో 22 మందిని గుర్తించి అసెంబ్లీ కార్యదర్శికి ఫిర్యాదు చేశారు. మిగతా వారి వివరాలను కూడా త్వరలో అందిస్తామని, అప్పటి వరకు ఆప్షన్లపై నిర్ణయం తీసుకోవద్దని అసెంబ్లీ కార్యదర్శిని కలిసి విజ్ఞప్తి చేశారు. 

తెలంగాణ ఉద్యోగుల పేర్లు గల్లంతు
కేఆర్ సురేష్‌రెడ్డి స్పీకర్‌గా ఉన్న సమయంలో అసెంబ్లీలో 30 మంది ఉద్యోగులను ప్రభుత్వం నియమించింది. అందులో తెలంగాణ, సీమాంధ్రకు చెందిన నాలుగో తరగతి ఉద్యోగులు 24 మంది ఉన్నారు. మరో ఏడుగురికి మాత్రం ఎన్జీవోల కింద అపాయింట్‌మెంట్ లెటర్ ఇచ్చా రు. ఈ ఏడుగురు తెలంగాణ వారే. అయితే, అసెంబ్లీ కార్యాలయం విడుదల చేసిన జాబితాలో నాలుగో తరగతికి చెందిన 23 మంది పేర్లున్నాయి. మిగతా ఏడుగురి పేర్లు పేర్కొనలేదు. దీనిపై తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ఉద్యోగులు కాబట్టే వారిపేర్లు జాబితాలో చేర్చలేదని ఆరోపిస్తున్నారు. ఈ ఏడుగురిని సీమాంధ్రకు పంపాలనే దురుద్దేశంతో జాబితాలో పేర్లు చేర్చలేదని విమర్శిస్తున్నారు. 

తెలంగాణలో కొనసాగడానికి వీల్లేదు
తెలంగాణ ఉద్యమంలో ఎప్పుడూ భాగస్వాములు కాని ఈ సీమాంధ్ర ఉద్యోగులు తీరా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయిన తర్వాత తాము తెలంగాణ వారిమేనని తప్పుడు ధ్రువపత్రాలు అందజేస్తున్నారని అసెంబ్లీ తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు పోలోజు వేణుగోపాల్ విమర్శించారు. తప్పుడు సమాచారం ఇచ్చిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీమాంధ్ర ఉద్యోగులు తెలంగాణలో పని చేయడానికి వీలు లేదని స్పష్టం చేశారు. తప్పుడు వివరాలు అందించిన వారిపై అసెంబ్లీ కార్యదర్శికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. మరి కొంతమంది సమాచారం సేకరించి త్వరలోనే అసెంబ్లీ కార్యదర్శికి అందిస్తామని చెప్పారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో...)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

3 కామెంట్‌లు:

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

నా తెలంగాణ సోదరమిత్రులారా! ఒక్క విన్నపం. మన తెలంగాణులపట్ల చులకనభావంతో కొందరు సీమాంధ్రులు ఈ బ్లాగులో వ్యాఖ్యానిస్తున్నారు...! వాళ్ళను ఎదుర్కోవడంలో నేను కొంత వరకు కృతకృత్యుడనయ్యాను...అయితే మన తెలంగాణులు వ్యాఖ్యలరూపంలో వాళ్ళను ఎదుర్కోనంతకాలం వాళ్ళు ఇలానే రెచ్చిపోయి వ్యాఖ్యానిస్తుంటారు..కాబట్టి మీ స్పందనలను వ్యాఖ్యల రూపంలో తెలుపగలరు.

ఉదాహరణకు...ఈ బ్లాగులోని "ఉమ్మడి రాజధానిలో సొమ్మొకరిది...సోకింకొకరిది...!" అనే టపాలోని వ్యాఖ్యలు చూడండి...స్పందించండి...సీమాంధ్రులకు దిమ్మతిరిగేలా రిపార్టీ ఇవ్వండి! రండి!

విశ్వరూప్ చెప్పారు...

చచ్చిన పామును ఇంకా చావగొట్టడం ఎందుకు? ఇలాంటి వెధవలతో వాదన వృధాప్రయాస. అలాంటి కామెంట్లు పబ్లిష్ చేయకండి. వల్లకున్నదీ, మనకు లేనిది మందబలం. ఆమందబలంతో వాళ్ళు తాత్కాలికంగా నెగ్గుతారు. మనకున్నదీ, వారికి లేనిదీ న్యాయం. అందుకే అంతిమ విజమ మనదే.

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

బాగా సెలవిచ్చారు. అయితే మనం వాళ్ళ కుట్రలకు, కుతంత్రాలకు తగిన విధంగా స్పందించకుంటే...ఇంకా మితిమీరిపోతారు...కాబట్టే...ఈ రాతలు...! అయినా మన తెలంగాణులకు ఈ విషయాలు ఎప్పటికప్పుడు తెలపవలసిన అవసరం మనకు ఉంది! తప్పక సీమాంధ్రులను ఎదుర్కొని, వాళ్ళ కుట్రలను, కుతంత్రాలను పటాపంచలు చేయాల్సిందే! స్వస్తి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి