గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

బుధవారం, సెప్టెంబర్ 25, 2013

ఆత్మబలిదాన సాహస్రి...!ఆత్మ బలిదాన సాహస్రియ యిట మాకు!
హైదరాబాదు కొలువు మీకే దొఱుకును!!
నాత్మ గౌరవోద్యమ తీక్షణమ్ము మాకు!
మేము చచ్చినన్ గొలువులు మీకు వలయు!! (1)

నీదు లక్ష్యమ్ము హైదరాబాదు; కాని,
దానిఁ గూడిన తెలగాణమేను మాది!
మాధ్యమముకై నిమిష కాలమందు మీకు
నుద్యమము; మాకు నిచట నిత్యోద్యమమ్మె!! (2)

ఆంగ్ల పాలనలో మీర లాంగ్ల విద్య
నందఁగ; నిజాము పాలన యందు మేము
విద్య లేనట్టి వారము; వేగిరముగఁ
గొల్లఁగొట్టితిరయ మీరె కొలువు లన్ని!! (3)

ఇటెటు రమ్మన్న వచ్చియు నిల్లు మాదె!
మీరు పోపొండటనఁగానె, మేము వెడలి,
ప్రక్క రాష్ట్రాలు, దేశాలు  వలయు కొలువు,
బానిసల వోలెఁ జేసెడి బ్రతు కిదేమి? (4)

అఱువదేండ్లుగ పాలించి, వఱలి మీరు
బాగుపడితిరి! మేము నిష్ఫలిత దుష్ట
దాస్య శృంఖలా బద్ధ విదార హృదిని
బ్రతుకు నీడ్చుచుఁ జచ్చుచు బ్రతికితి మిట!! (5)

న్యాయమే మీకు రాష్ట్రమ్ము నాపు టిదియ?
యాత్మ బలిదాన మెద్ది మీ యాత్మఁ దాఁకెఁ?
గఱుగ లేదె మీ హృదయమ్ము? కర్కశులరె?
యైనచో మీకు మాకుఁబొ త్తయ్య వలదు!! (6)

12 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

this photo is tibetan read this link.
http://www.telegraph.co.uk/news/worldnews/asia/tibet/9301849/China-detains-hundreds-in-Tibet-over-self-immolation-protests.html

sharma చెప్పారు...

hahahaha... adirindi, tibetan telaban ayyaadaa.. thanks for the link!
paandityam visham kakkadaaniki upyoginchadam mahaa baagundi, mi vignataki johaarlu.

అజ్ఞాత చెప్పారు...

అడ్డమైన పేర్లుపెట్టి పైశాచికానందాన్ని పొందే రాక్షసులకేమర్థమౌతుంది తెలంగాణ వాసుల ఆవేదన? మీది రాక్షస జన్మ; మాది దేవతా జన్మ! మాకున్న సంస్కారం మీ కెన్ని జన్మలెత్తినా రాదు!

అజ్ఞాత చెప్పారు...

తెలబాన్లది ఆవెదన కాదు. అసుయ. అసుయ, ద్వెషంతొ రగిలిపొతున్న కొందరు తెలబాన్ గూండాలు చేసిన దొంగ వుద్యమం

sreerama

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

చిత్రమేదైతేనేం? మా తెలంగాణ బిడ్డ లంతటి ఆవేదనతో ఆత్మహత్యలు చేసుకోవడ మబద్ధమా? ఒకరా...యిద్దఱ..ముగ్గురా...నలుగురా...వేయిమంది! ఇవి అబద్ధాలా? ప్రాణం విలువ మీకేం తెలుసు? పక్కవాని చేతిలోది లాక్కొని తినడం తెలుసు! దొంగ వేషాలు వేసి, మాయలు చేయడం తెలుసు! తెలంగాణ భాషనూ, యాసనూ హేళన చేయడం తెలుసు! తెలంగాణ ప్రజల ఆవేదనను అర్థం చేసుకోండి...హేళన చేయకండి...సంస్కారులవండి!

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

తెలంగాణ వాదం అవాస్తవమా...అబద్ధమా...? మా వేయిమంది ఆత్మబలిదానం అబద్ధమా? మీవి అబద్ధాలు...అవాస్తవాలు! కేవలం పెట్టుబడిదార్ల తొత్తులు ఆడించినట్టల్లా ఆడుతూ...ఉద్యమం చేస్తున్నామని బిల్డప్పులిస్తున్నారు. సీమాంధ్రలోని బడుగు, బలహీన వర్గాల ప్రజలు మీ ఉద్యమాన్ని వ్యతిరేకిస్తున్నా, వాళ్ళనణగద్రొక్కి, ఉత్తుత్తి ఉద్యమం చేస్తున్నది మీరు! అసలు మీకు మేం ఇలాంటి పేర్లు పెట్టాలి...తెలబాంధ్ర, సీమ తెలబాన్లు....అంటే ఎలా ఉంటుంది?

అజ్ఞాత చెప్పారు...

ఇవాళ అనంతపురం ఎంపీ వెంకట్రామి రెడ్డి ఒకే ఒక్క సూటి ప్రశ్న అడిగాడు. 1959 లో ఖమ్మంలో కలిసిన భధ్రాచలం మీద మీకు హక్కు ఉంటే అంతకు పూర్వమే 1956 లో కలిసిన మాకు హైద్రాబాదుపై హక్కు లేదా? అని... తెలంగాణ వాదులూ ఈ ప్రశ్నకు మీ దగ్గర జవాబు ఉందా? ఉంటే చెప్పండి.

Unknown చెప్పారు...

తాను చేస్తే శృంగారం ఎదుటివాడు చేస్తే వ్యభిచారం అనటం బాగాలేదు గురూగారూ.....మీ భావాలకోసం ఒక రాజకేయ పార్టీ అనుబంధంతో మీరు చేసారు....మా భవిష్యత్తు పై భయంతో మేం చేస్తున్నాం.....ఎవరు ఒప్పుకున్నా లేకున్నా హైదరాబాదు అందరి ఆస్థి. విడిపోతే భాగం అడగే హక్కు అందరికీ వుంది....పెట్టుబడి లేనిచోట వ్యాపారం నడవదు....వ్యాపారం జరగనిచోట లాభం రాదు.....ఇంత అభివృద్దే వుండదు. అన్నిటికంటే హాస్యాస్పదం ఎంటంటె ఎవరైతే ఇన్నాళ్ళు తెలంగాణాకి ప్రాతినిధ్యంవహించి మీరు కోరుకునే అభివృధి సాధించలేకపొయారో...విడిపోయి వారికిందే బ్రతుకుదామనుకోవడం......బ్రదర్ రాష్ట్రం మొత్తం ప్రాంతాలకతీతంగా రాజకీయంగా, ఆర్ధికంగా కుదేలయింది.... దానికి ఎం చేస్తే, ఎం మార్చితే బాగుపడుతుందో ఆలోచించకుండా మంకుపట్టు వాదం సరికాదు.....

అజ్ఞాత చెప్పారు...

Asalu meeku emi kaavali... Samaikyandra kavala.... Hyd kavala? Hyd ne kavali ante mari Samaikyandhra ani, Telugu jathi ikyatha ani donga maatalu matladoddu. Hakku ante meeru emi develop chesaru Hyd ni... meeru emina charity chesara? mee business development kosam chesaru.... anthe kaani prajala kosam emi cheyya ledu ga.... Ika pothe BCM vishayam.... BCM lo temple kattinchina Sri Ramadasu Nelakondapalli ki chendina vadu... idi okkati chalu kada ok na?

Mandhubabu చెప్పారు...

Seemandhravaada naaku kindhi vishyamulu arthamu kaaledhu.

1. memu venukabadi unnamu ani ante.. adi emi ledhu meeru full abivruddhi chedillu antaaru. ante meeru venukbadi mosapoyinatle kadha. mari mosapoyinollu maatho endhuku kalisi undadamu.

2. meere maaku thindi thindamu, sanskramu inkaa evo evo nerpinchina medhaavulu. ippudu meeru vidipoyi brathukaleraaa??? endhuku maa meedha adhrapadi maatho kalise untaaru.

3. mu thu.. sigguledhaa.. vellipondraa anna kuda inkaa maathone untaamu ani antundlu.. mee oorilo kaani mee kuntubamu lo kaani ila anna kudaa.. mohamu tuduchukoni vallathone untaaraaa.

4. asalu maatelangana vallu mee arealaki vachhi endhuku vyaparalukaani udyogaalu kaani cheyyaru.... endhukante meeru mammalni piki raanivvaru.. brathukanivvaru kanukaa..

5. hyd lo e andhrodu ainaa.. valla hotel ke pothadu.. valla battala shop ke pothaadu..... endhuku maa telangana shops meeku vaatioki kud apaniki raavaa..

6. hyd lo enni hotels lo.. antha mee oorilonundi export chestharu thappa.. kaneesamu 30% aina ikad vallaki udyogali ichhindlaaa...

7. maaku teluge raadhu.. maau pandithule leru ani evo pichhi pichhi kuthalu kusindlu... gee sir kante medhavulu mee daggara unnaraaa..

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

ఇటెటు రమ్మంటే ఇల్లంతా నాదంటున్నారు. ఈ హైదరాబాదు మీ తాతముత్తాతల సొమ్మేం కాదు. మీరిక్కడికి బతకడానికి వచ్చారు. బతకండి. నాదనవద్దు. మా తెలంగాణ జిల్లాలవాళ్ళదే ఈ హైదరాబాదు. అద్దెకని ఇంట్లో దిగి, ఇల్లే నాదంటే మూతిమీద ఫెడీమని ఒక్కటిస్తారెవరైనా. ఎవరి హద్దుల్లో వారుంటే మంచిది. మీ సీమాంధ్రలో వెయ్యండి ఈ వేషాలు. ఇక్కడ కాదు.

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

చరిత్ర తెలిసిన వాడెవడూ ఇలా మాట్లాడడు. 1959లో కాదు, మొదటినుండీ భద్రాచలం తెలంగాణాలోనే ఉన్నది. మీరనేది 1959కి ముందు ఆంధ్రాదే భద్రాచలం అని. కంచెర్ల గోపన్న తహసీలు దారుగా ఉన్న భద్రాచలం ప్రాంతం ఆంధ్రాదే ఐతే, గోపన్న గోల్కొండ నవాబుల దగ్గర ఎందుకు సేవ చేశాడు? మాదీ మాదీ అని చించుకున్నంత మాత్రన మీదైపోదు! రాజకీయ వాదులు ఎన్నో వాగుతుంటారు. వాళ్ళు మాట్లాడిందే వేదం కాదు. తెలుసుకోండి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి