గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

ఆదివారం, మే 25, 2014

సరికొత్త నాటకం...అంతా గోప్యం...!



-కార్మికశాఖలో తేలని ఉద్యోగుల కేటాయింపు
-వెబ్‌సైట్‌లో వివరాలను బ్లాక్ చేసిన ఉన్నతాధికారి 
-లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినా అంతే
-ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న డిప్యూటీ కమిషనర్
-ఆందోళనలో టీ ఉద్యోగులు

రాష్ట్ర విభజన వేళ తెలంగాణలోనే తిష్ఠ వేయాలని చూస్తున్న సీమాంధ్ర అధికారులు అందుకోసం కొత్త నాటకాలకు తెరతీస్తున్నారు. సీమాంధ్రుల ఆధిపత్యం అధికంగా ఉన్న కార్మికశాఖలో ఉద్యోగుల కేటాయింపును అత్యంత గోప్యంగా ఉంచేందుకు సీమాంధ్ర ఉన్నతాధికారులు ప్రయత్నిస్తున్నారు. ఉద్యోగుల్లో ఎవరిని ఏ రాష్ట్రానికి కేటాయించారన్న వివరాలను వెబ్‌సైట్‌లో ఉంచారు కానీ.. దానికి ఓ ఉన్నతాధికారి ప్రత్యేకంగా పాస్‌వర్డ్ పెట్టుకొని ఎవరిని చూడనీయకుండా అడ్డుపడుతున్నారు.

రెండు రోజులుగా ఇదే పరిస్థితి. దీనిపై కమిషనర్ ఏ అశోక్‌ను తెలంగాణ టీఎన్జీవో కార్మికశాఖ విభాగం ప్రశ్నించగా లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే ఆ అధికారిపై చర్యలు తీసుకుంటానని చెప్పారు. కమిషనర్ సూచనమేరకు.. టీ ఉద్యోగులు ఫిర్యాదు చేయగా, వెంటనే ఉద్యోగుల కేటాయింపు వివరాలను అందజేయాలంటూ డిప్యూటీ కమిషనర్‌ను ఆయన ఆదేశించారు. కానీ సదరు అధికారి..కమిషనర్ ఆదేశాలను కూడా ఖాతరు చేయడం లేదు. శనివారం వందలాది మంది ఉద్యోగులు కార్యాలయంలో తమను ఏ రాష్ట్రానికి కేటాయించారో తెలుసుకునేందుకు కంప్యూటర్ల ముందు గంటల తరబడి గడిపారు. కానీ రహస్య పాస్‌వర్డ్ ఉండడంతో వెబ్‌సైట్ తెరుచుకోలేదు. ఉద్యోగుల కేటాయింపు వివరాలను గోప్యంగా ఉంచేందుకు అధికారులు ఉద్దేశపూర్వకంగానే ఇలా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రధాన కార్యాలయంలో సీమాంధ్రులే ఎక్కువగా ఉన్నారు. వారంతా తాము తెలంగాణ వారమంటూ ఆప్షన్లు ఇచ్చినట్లు సమాచారం. 

నకిలీ ధ్రువ పత్రాలతో తప్పుడు స్థానికతను చూపినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా కార్మికశాఖలో సూపరింటెండెంట్లుగా 90 శాతం సీమాంధ్రులే ఉన్నారు. వారిలో సగం మంది తెలంగాణలోనే ఉండేందుకు కుట్రలు సాగిస్తున్నారని టీఎన్జీవో కార్మికశాఖ విభాగం అధ్యక్షుడు చంద్రశేఖర్‌గౌడ్ శనివారం టీ మీడియాకు చెప్పారు. కేటాయింపుల వివరాలు వెల్లడైతే ఇవన్నీ బయటపడతాయన్న భయంతోనే ఉన్నతాధికారులు వెబ్‌సైట్‌కు సీక్రెట్ పాస్‌వర్డ్ ఏర్పాటు చేసుకున్నారని ఆరోపించారు. డిప్యూటీ కమిషనర్ ఉన్నతాధికారుల ఆదేశాలను కూడా బేఖాతరు చేస్తుండడం విడ్డూరంగా ఉందన్నారు. తాము చాలా రోజులుగా ఉద్యోగుల కేటాయింపు, వివరాలను ఇవ్వాలని కోరినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. సీమాంధ్ర ఉద్యోగులు తెలంగాణలో కొనసాగాలని ప్రయత్నిస్తే సహించేది లేదని హెచ్చరించారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి