-అక్రమ
పదోన్నతులను సమీక్షించాలి
-ప్రతిజిల్లాలో పదివేల ఉద్యోగాలు భర్తీ చేయాలి
-టీఎన్జీవో ప్రధానకార్యదర్శి కారం రవీందర్‌రెడ్డి
భవనాల విభజనలో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని టీఎన్జీవో ప్రధాన కార్యదర్శి కారం రవీందర్‌రెడ్డి ఆరోపించారు. వీటిపై తెలంగాణ ప్రభుత్వం సమీక్షించాలని విజ్ఞప్తి చేశారు. భవనాలకు తాత్కాలిక సదుపాయాలను కల్పించే నెపంతో కోట్ల రూపాయలను నామినేషన్ పద్ధతుల్లో ఖర్చు చేస్తున్నారని, తెలంగాణ ఖజానాను ఖాళీ చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
సీమాంధ్ర కార్యాలయాలు తాత్కాలికంగానే ఇక్కడ ఉంటాయన్న విషయాన్ని అధికారులు
విస్మరిస్తున్నారని విమర్శించారు. భవనాల విభజనలో అన్నీ సౌకర్యాలతో ఉన్నవాటిని
సీమాంధ్ర కార్యాలయాలకు, సౌకర్యాలు లేనివాటిని తెలంగాణకు
కేటాయిస్తున్నారని టీఎన్జీవో ప్రధానకార్యదర్శిగా మరోసారి ఎంపికైన సందర్భంగా టీ
మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో రవీందర్‌రెడ్డి ఆరోపించారు. వ్యవసాయ, దేవాదాయ, వాణిజ్యపన్నులశాఖల్లో ఈ అన్యాయం
జరుగుతోందన్నారు.
అపాయింటెడ్
డే ప్రకటించిన తర్వాత నియామకాలు, పదోన్నతులు ఇవ్వకూడదని, డీపీసీలు పెట్టకూడదని, డిప్యూటేషన్లు చేయకూడదన్న
నిబంధన ఉన్నప్పటికీ, సీమాంధ్ర అధికారులు పట్టించుకోవడం
లేదన్నారు. వివిధ శాఖల్లో డీపీసీలు నిర్వహించి అక్రమంగా పదోన్నతులు కల్పించారని,
సీమాంధ్ర అధికారులు తెలంగాణలో తిష్ఠవేసే కుట్ర చేస్తున్నారని
రవీందర్‌రెడ్డి ఆరోపించారు. విభజన సందర్భంలో సుహద్భా వాతావరణాన్ని
పెంపొందించాల్సిన అధికారులు వాతావరణాన్ని కలుషితం చేస్తున్నారన్నారు. జిల్లాలోని
రాష్ట్రస్థాయి పోస్టుల్లో స్థానికేతరులను నియమిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో
తెలంగాణ ఉద్యోగులనే నియమించాలన్న డిమాండ్‌ను పట్టించుకోవడం లేదని విమర్శించారు.
మార్గదర్శక సూత్రాలు వెల్లడించిన తర్వాత వీటన్నింటిపై సమీక్షించి, తదుపరి కార్యాచరణను ప్రకటిస్తామని రవీందర్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రతీ
జిల్లాలో 10వేల ఉద్యోగాలు భర్తీ చేసే విధంగా కొత్త ప్రభుత్వం
చర్యలు తీసుకోవాలని కోరారు.
(నమస్తేతెలంగాణదినపత్రిక సౌజన్యంతో…)
.జై తెలంగాణ! జై జై తెలంగాణ!
2 కామెంట్‌లు:
Ori daridruda, konni rojulalo velipoye Seemandhrula meeda anta kadupumanta emiti ra? vachhe 5 yellalo chudu emi jarugutundo.. tagi chavandi
ఓరీ దరిద్రాతిదరిద్రుడా! కొన్ని రోజుల్లో పోయేవాళ్ళు దొంగ సర్టిఫికెట్లతో నానా నాటకాలతో తెలంగాణలోనే తిష్ఠవేసే నాటకాలేమిటి? అరవై ఏండ్లు దోచారు...కొన్ని రోజుల్లో పోబోతూ ... ఉద్యోగాల్లో ప్రమోషన్‍లూ, కొత్త ఉద్యోగాల భర్తీలాంటివి ఉండరాదంటున్నా...ఖాతరు చేయకుండా...తెలంగాణకు అన్యాయం చేయడం ఏమిటి? ఐదేండ్లలో ఏదో జరుగుతుందని చెప్పడం ప్రగల్భాలు. పలకడమే. అంత దమ్మున్నవాళ్ళు మీరైతే అరవై ఏండ్ల కిందటే కొత్తరాజధాని కట్టుకొని వుండేవాళ్ళు. హైద్రాబాద్‍పై ఆశపడి, మమ్మల్ని దోచుకుని వుండేవాళ్ళు కారు. ఎంతైనా సీమాంధ్రులు పరాన్నభుక్కులే...తెలంగాణ నీళ్ళు, నిధులు, కొలువులు, నేల అన్నీ కొల్లగొట్టారు. మీ ప్రతాపం మా దగ్గరా? ఇకపోతే మమ్మల్ని తాగి చావండి...అంటున్నావు...మొన్న ఎన్నికల్లో సీమాంధ్రలోనే ఎక్కువ తాగుబోతులున్నారని తేలింది. అసలు తాగుబోతులు, సోమరిపోతులు మీ సీమాంధ్రులే...అనవసరంగా...తెలంగాణుల్ని ఆడిపోసుకుంటున్నారు. మళ్ళీ ఈ బ్లాగులోకి రాకురా దరిద్రాతిదరిద్రుడా! వెళ్ళరా వెళ్ళు!
కామెంట్‌ను పోస్ట్ చేయండి