గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

మంగళవారం, మే 06, 2014

చేసిన పాపం ఎప్పటికైనా కట్టికుడుపుతుంది...

ఈ టపాను కిరణ్ కుమార్ రెడ్డి మన తెలంగాణకు చేస్తున్న ద్రోహానికి ఆవేదనతో...
నేను దివి:14-02-2014 నాడు ఈ బ్లాగులో పెట్టాను.
ఇప్పుడు మళ్ళీ ఈ టపాను ఈ బ్లాగులో పెట్టవలసిన అవసరం వచ్చింది.
ఎందుకంటే ఆనాడు నల్లారి మన తెలంగాణను గోసపెట్టుకుంటుంటే...ఆనాటి ఈ టపాలో నేను శాపనార్థాలు పెట్టాను.
అవన్నీ ఇప్పుడు ఒక్కొక్కటీ నిజమవుతున్నాయి.
నల్లికుట్ల నల్లారి తెలంగాణ విషయంలో ఎన్ని కుట్రలు చేశాడో, అన్ని కుట్రలు తన పార్టీలోనే తనపై జరిగి, తనవాళ్ళనుకున్నవాళ్ళే తనకు వెన్నుపోటుపొడిచారు.
తెలంగాణుల ఉసురుపోసుకున్న పాపం ఊరకే పోతుందా?
ఎప్పటికైనా కట్టికుడుపుతుంది...కట్టికుడుపుతున్నది...ఎలాగుననో...వీక్షించండి.


(ఇది...దివి:14-02-2014 నాటి టపా)

రెండు రాష్ట్రముల విభజన
పూర్తియైన తరుణంలో
నల్లికుట్ల నల్లారీ,
విషముకక్కగానేలా?

బ్రహ్మాస్త్రం అన్నావూ,
లాస్టుబాలు అన్నావూ,
కొత్తపార్టి అన్నావూ,
నీ పప్పులు ఉడికాయా?

కలిసియుండమనువారిని
యెట్లు కలిపి యుంచెదనని
కుట్రపన్నుతున్నావయ?
గడ్డిని తినుచున్నావా?

మానసికంగా విడిపో
యిన వారిని కలిపెదనని
స్వార్థంతో రంకె వేసి,
కుప్పిగంతు వేయనేల?

తెలంగాణలో దోచిన
దేదియు సరిపోలేదా?
ఇంకా దోచగ బూనెడి
వక్రబుద్ధి మానవేల?

తెలంగాణ ఉసురుతాకి,
మట్టిగొట్టుకొనిపోదువు!
రాజకీయ జీవితమే
దక్కని సన్నాసవుదువు!!

ఇంత జరిగినా కూడా
తెలగాణకు అడ్డుపడగ
యోచించెడి నీకిప్పుడు
తెలగాణుల శాపమిదియె!

భవిష్యత్తు కానరాక,
నాశనమై పోదువయ్య!
కుట్రలెన్ని పన్నినను
పనికిరాకపోవుదువయ!!

విభజనమ్ము ఖాయమనియు
ఇంకా గ్రహియింపనిచో,
ఎవరును కాపాడలేరు,
అసహ్యించుకొంద్రు నిన్ను!

పగటికలలు కనుచుండిన
రెంటికి జెడు రేవడివలె
సంకనాకి పోదువయా,
విలువ కోలుపోదువయా!

పిచ్చిచేష్టలను మానుము,
పిచ్చికూతలను మానుము!
అందరు మెచ్చే పనులకు
మంచి మనసుతో పూనుము!!

***     ***     ***     ***

నల్లారికి ఎలాంటి స్థితి దాపురించిందో తెలుసుకోవాలంటే...
దీనిపై క్లిక్ చేయండి

(ఆంధ్రప్రభ దినపత్రిక సౌజన్యంతో...)జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి