గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

సోమవారం, మే 05, 2014

గత వాగ్దానాలు నెరవేర్చడు...కొత్త వాగ్దానాలు చేస్తాడు...


గతములోన చేసినట్టి
వాగ్దానము లెన్నిటినో
నెరవేర్చకయే ఇప్పుడు
నూతన వాగ్దానాలా?

మాటయిచ్చి తప్పువాని
నెన్నుకొనరు జనమనియును
గత ఎన్నికలందు తెలిసి
కూడ యిపుడు మాటలేల?

మాటలు చెప్పుట కాదయ
ప్రజకు మేలు చేయవలెను!
చేతలలో ఫలితమున్న
వోట్లు అవే రాలునయ్య!!

ఊకదంపుడుపన్యాస
ములుకావయ ప్రజకు ప్రీతి
కారకములు! మేలు చేసి
చూపినచో, దరిజేర్తురు!!

మాటతప్పువానినెపుడు
ప్రజలు దరికి  రానీయరు!
వాగ్దానాల్ నెరవేర్చుచొ
భవిష్యత్తు బాగుపడును!!

అంతర్ముఖుడవు నీవయ,
పైకి ఒకటి లోన ఒకటి!
బయటా లోపట ఒక్కటి
ఎప్పుడగునొ అపుడె జయము!!

***     ***     ***     ***

చంద్రబాబునాయుడు చేసిన/తప్పిన వాగ్దానాల చిట్టాకై...

జై తెలంగాణ!    జై ఆంధ్ర!

2 కామెంట్‌లు:

jaya చెప్పారు...

పెప్పర్ స్పే తో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి .. ఒపీనియన్ పోల్ తో తనను తానే అవమానం చేసుకున్న లగడపాటి
లాంటివారు తెలుగుజాతికి అవమానం

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

సైలెంటైన లగడపాటి గురించి మనకెందుకు? గతంలో ఎన్నో హామీలిచ్చి తప్పి, మళ్ళీ మనని మోసగించడానికి హామీలు గుప్పిస్తున్న చంద్రబాబు గురించి మాట్లాడండి. వేలకోట్లు నొక్కేసి ఎరగనట్టున్నాడు. పెద్దకోడలిని ఇంట్లోకి రానీయకుండా అన్యాయంగా వెళ్ళగొట్టాడు. ఇలాంటి అవినీతిపరుణ్ణి మళ్ళీ ఎన్నుకొని పట్టం కడతారా? చెప్పండి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి