గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

సోమవారం, మే 26, 2014

సీమాంద్ర విద్యుత్ ఉద్యోగుల కుట్రలు సాగనివ్వం...

TEEA


-అవసరమైతే కోర్టుకు ఈడుస్తాం:టీఈఈఏ అధ్యక్షుడు శివాజీ హెచ్చరిక

-యాజమాన్యం తీరుకు నిరసనగావిద్యుత్ ఉద్యోగుల ధర్నా 
రాష్ట్ర విభజన తర్వాత కూడా సీమాంధ్ర ఉద్యోగులు తెలంగాణలోనే ఉండిపోయేందుకు చేస్తున్న కుట్రలకు నిరసనగా తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజినీర్స్ అసోసియేషన్ (టీఈఈఏ) ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యోగులు విద్యుత్‌సౌధ ఎదుట శనివారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా టీఈఈఏ అధ్యక్షుడు శివాజీ మాట్లాడుతూ.. సీమాంధ్ర ఉద్యోగులు తప్పుడు ధ్రువపత్రాలతో తెలంగాణలో తిష్ఠ వేయడానికి కుట్రలు చేస్తున్నారని, అందుకు యాజమాన్యం సహకరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

జెన్‌కోలో తెలంగాణకు ప్రకటించిన 293 పోస్టుల్లో వందకుపైగా సీమాంధ్ర ఉద్యోగులు కొనసాగుతున్నారని తెలిపారు. జెన్‌కోలో సీమాంధ్ర ఉద్యోగులు 70శాతానికి పైగా ఉన్నట్టు గతంలోనే ప్రకటించిన యాజమాన్యం..ఇప్పుడు 50 శాతం కన్నా ఎక్కువ మంది తెలంగాణ ఉద్యోగులున్నారని జాబితాలలో పేర్కొనడం శోచనీయమన్నారు. ట్రాన్స్‌కోలో మెట్రోజోన్ మినహాయిస్తే తెలంగాణకు కేటాయించిన 120 పోస్టుల్లో 39 సీమాంధ్రులకు కట్టబెట్టేందుకు యాజమాన్యం సహకరిస్తోందన్నారు. విద్యుత్ ఉద్యోగుల విభజనలో యాజమాన్యం తెలంగాణ పట్ల వివక్ష ప్రదర్శిస్తోందన్నారు. 

ఉద్యోగి నియామక సమయంలో పోలీస్ విచారణ ఎక్కడ జరిగింది? సర్వీసు రికార్డుల్లో ఉన్న చిరునామా ఆధారంగా ఉద్యోగులను గుర్తించాలని ఆయన డిమాండ్ చేశారు. సమైక్యరాష్ట్రంలో రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం నాన్‌లోకల్ కోటాలో సీమాంధ్ర ఉద్యోగులను నియమించారని, ప్రస్తుతం వారందరూ వెనక్కి వెళ్లాల్సిందేనని, లేకపోతే కోర్టుకు ఈడుస్తామని శివాజీ హెచ్చరించారు. తప్పుడు ధ్రువీకరణపత్రాలతో తెలంగాణలోనే ఉండాలనుకునే సీమాంధ్ర ఉద్యోగులకు చిక్కులు తప్పవని, ఇప్పటికైనా వారు ఆలోచించుకోవాలని సూచించారు. యాజమాన్యం తీరును నిరసిస్తూ రెండు గంటలపాటు తెలంగాణ ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. ధర్నాలో టీఈఈఏ ప్రతినిధులు రాజేశ్వర్‌రావు, శ్రీకాంత్, రవి, లింగమూర్తి, చంద్రయ్య, భద్రయ్య, సత్యనారాయణ పాల్గొన్నారు. 

జై తెలంగాణ! జై జై తెలంగాణ!


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి