రెండువారములలోపల
విభజన పని ముగియనుండ,
దేవాదాయ శాఖలో
పదోన్నతుల నిచ్చుటేల?
విభజన ప్రక్రియకాటం
కము కలుగక యుండు కొఱకు,
ఆర్థికశాఖయె పదోన్న
తులను నిషేధించెగదా!
సందట్లో సడేమియా
అన్నట్లుగ అధికారులు
సీమాంధ్రోద్యోగులకును
పదోన్నతుల నిచ్చుచుండ్రి!
దేవాదాయ శాఖలో
ఇరు నిష్పత్తులకు మించి,
సీమాంధ్రా ఉద్యోగుల
నియమించిరి గతంలోన!
అన్ని గ్రేడ్లలో వందల
సంఖ్యలోన సీమాంధ్రులు
తెలంగాణమందు నేడు
అక్రమముగ జొరబడిరయ!
ఇట్టి కారణమ్ముచేత
వారెక్కువ ఉండ్రి గాన,
విభజించెడి నిష్పత్తిలొ
భేదముండి జాప్యమాయె!
మూడు వత్సరములుగాను
పెండింగున పెట్టినట్టి
పదోన్నతుల, నేడిప్పుడు
చేపట్టుట దుర్మార్గము!
తెలంగాణ ఉన్నతపద
వులలోపల, సీమాంధ్రుల
పదోన్నతులు చేపట్టియు
ఆక్రమింప జూచుచుండ్రి!
విభజన కమిటీ దీనికి
తక్షణమే స్పందించియు,
ఈ పదోన్నతుల నాపియు,
అన్యాయము నాపవలెను!
నిష్పత్తులు ప్రక్కనిడియు,
ఆంధ్రవారి నాంధ్ర పంపి,
తెలగాణుల తెలంగాణ
నుండునట్లు విభజింపుడు!
అక్రమార్కులందరిపై
కఠినచర్యలను గైకొని,
మునుముందెవ్వరు ఇట్టుల
చేయకుండ శిక్షింపుడు!
*** *** *** ***
ఇదే అంశంపై పూర్తి వివరాలకై:
(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో...)
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
2 కామెంట్‌లు:
Well said...
ధన్యవాదాలండీ!
కామెంట్‌ను పోస్ట్ చేయండి