-తెలంగాణలోనే ఉంచాలని వెల్లువెత్తుతున్న డిమాండ్..
-బూర్గంపాడులో రెండో రోజు రిలే నిరాహార దీక్షలు
-కొనసాగిన బంద్.. పోలవరం డిజైన్ మార్చాలని సూచన..
-రేపటి నుంచి భద్రాచలం ఎమ్మెల్యే రాజయ్య ఆమరణ దీక్ష
పోలవరం ముంపు ప్రాంతాలను తెలంగాణలోనే ఉంచాలని డిమాండ్ చేస్తూ గిరిజన బిడ్డల ఆందోళనలు ఉధృతమయ్యాయి. అపాయింటెడ్ డే దగ్గరికి వస్తుండడం, మరోవైపు ముంపు ప్రాంతాలను సీమాంధ్రలో కలపాలని కేంద్రం ఆర్డినెన్స్ తేవాలని యోచిస్తుండడంతో ఏజెన్సీలో ఉద్యమం భగ్గుమంటున్నది. తెలంగాణలోనే ఉంచాలంటూ బూర్గంపాడులో అఖిలపక్షం ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలు మంగళవారం రెండో రోజుకు చేరాయి.
ఈ సందర్భంగా టీఆర్‌ఎస్ నేత శంకర్‌నాయక్ మాట్లాడుతూ పోలవరం ముంపుపేరుతో బూర్గంపాడును సీమాంధ్రలో కలపాలనుకోవడం సరికాదన్నారు. ముంపునకు గురికాకుండా కరకట్ట నిర్మాణం చేపట్టాలని సూచించారు. ముంపు గ్రామాలపై చట్టపరంగాను, రాజకీయపరంగాను టీఆర్‌ఎస్ పోరాటం చేస్తుందన్నారు. బూర్గంపాడు రెవెన్యూ గ్రామాన్ని సీమాంధ్రలో కలపాలనే నిర్ణయా న్ని నిరసిస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన బంద్ విజయవంతమైంది. బూర్గంపాడు మండలం గ్రామాన్ని తెలంగాణలో కొనసాగించాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం నాయకులు కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకట్రావును కలిసి వినతిపత్రం అందజేశారు.
ఆమరణ దీక్ష చేయనున్న ఎమ్మెల్యే సున్నం: పోలవరం ముంపును తెలంగాణలోనే ఉంచాలని డిమాండ్ చేస్తూ భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య గురువారం నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టనున్నారు. భద్రాచలంలో ముంపు మండలాల ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన దీక్షలో పాల్గొననున్నారు.
(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
4 కామెంట్‌లు:
Were these mandalams are part of Telangana before 1956? why are u asking for Andhra mandalams?
నా తెలంగాణ సోదరమిత్రులారా! ఈ రోజు సాయంత్రం గం.04-00లకు నేను ప్రచురించే టపా: "పోల ’వరం’ కాదు...జలప్రళయమే!" ను చదివి, పోలవరం నిర్మాణం ద్వారా పొంచివున్న ముప్పును గురించి తెలుసుకోండి! తద్వారా పోలవరం నిర్మాణంలో డిజైన్ మార్పు ఎంత అవసరమో గుర్తించండి...ఉద్యమించండి...సాధించండి! జై తెలంగాణ!
1956 కి ముందు ఈ మండలాలు తెలంగాణాలో ఉన్నయా ఆంధ్రలున్నయా?
పెద్ద రాష్ట్రవిభజనకి ఇరు వర్గాలనీ కూర్చోబెట్టి సంప్రదించమంటే ఏం అవసరంలేదు, కన్సెస్ అవసరం లేదు అది రాదు అన్న కచరా నోరు ఇప్పుడు అదే పద్ధతిలో ఇది చేస్తే ఎందుకు కిందమీద దుంకుతున్నడు.. మీకైతె ఒకతీరు వాల్లకైతే ఒకతీరా? అన్ని గుంజుకోని వాల్లనేం జేస్తరు అడ్కతినమంటరా? ఆశక్కుడ హద్దుండాలె, TRS , కచరా ఎప్పుడో తెలంగాణ కొంపముంచుతరు పోలవరం గాదు... థూ బైట తెలంగాణోన్నని చెప్కోనీకె సిగ్గైతంది..
మల్ల మోడరేషన్ ఏంది మధూ? విమర్శలకు భయమైతందిలే? బైట దునియాల గుడ్క మాకట్లనే ఉంది? తెలంగాణోడంటే కిరికిరిపెట్టేటోడన్న పేరువడ్డం? మారుండ్రిరా నాయ్నా.. పని మొదలు వెట్టుండ్రి, డెవెలప్ జేయుర్రి, సెక్రెటేరియట్ ల లక్ష ఉద్యోగాలు ఆంధ్రోళ్ళున్నరంటిరి ఇప్పుడేమో మొత్తం కలిసి 60 వేల కన్న తక్కువనే గదా, ఉచ్కాయించి ఉచ్కాయించి లొల్లి వెట్టి డెవెలప్మెంట్ పాడు జేసిర్రు, ఇంగ లాస్ట్ కి హౌల గాళ్ళమైనం మేం...
-ఒక సగటు తెలంగాణ వాసి...
ఎదుటివారికి చెప్పేటందుకే నీతులు వున్నాయి! సీమాంధ్రలో పనికిమాలిన వెధవలు కొందరు పనికిమాలిన రాతలు రాస్తుంటే మోడరేషన్ పెట్టక ఏం చేస్తాం?
1956కన్నముందు అని తెగ వాగుతున్నారు? 1956కన్న ముందు మీకు ఎక్కడినుంచి వచ్చింది? మా తెలంగాణ ఏలుబడిలోనిది కాదా? భద్రాచలానికి తహసీలుదారు ఎవరు? మా తెలంగాణవాడు కంచెర్ల గోపన్నకాడా? మాది కాని భద్రాద్రి మీదెలా అయింది? 1956 తర్వాత ఆంధ్రనుండి భద్రాచలాన్ని పరిపాలించడం చేతకాక, మళ్ళీ మా తెలంగాణకే ఇచ్చారు! మాది చివరకు మావద్దకే వచ్చిచేరింది! మాది మాది అని తెగ ప్రేమ ఒలకబోస్తున్నారు? మీదైతే మా తెలంగాణలో ఎందుకు కలిపారు? గతంలో అది మాదే కాబట్టి...మేమైతే బాగా పాలించగలం కాబట్టి! నోరున్నదికదా అని ఎలా పడితే అలా వాగితే మీదౌతుందా?
స్వైరోచ్చారణ మీరు సేయఁ దగునే? భద్రాచల ప్రాభవ
ప్రారబ్ధుల్ తమరా? నిజాము తమరా? రామాలయ మ్మందునన్
మీ రొక్కమ్ములు, శిస్తు లెన్ని కలిసెన్? మీ రెక్క డున్నారలో?
కారోయీ యిట స్థానికాఖ్యు లనఁగన్! కంచెర్ల గోపన్న శ్రీ
కార మ్మిచ్చట నాలయమ్ము కొఱకై కావింప నిర్మాణమున్,
దా, రొక్కమ్మది రాజ ద్రవ్య మగుటన్, ద్రవ్యమ్ము వెచ్చించుచున్,
“నా రాముండు భరించు నన్ని” యనుచున్, ధన్యాత్ముఁడైనట్టి త
త్పౌరున్, భక్తుని, రామదాసుఁ జెఱనున్ బంధింపఁగాఁ దానిషా;
మా రామయ్య మహోన్నతంపు మహిమన్ మన్నింపఁ దానీషఁ, దాఁ
జేరం బోయియు, రొక్కమిచ్చి, విడిపించెన్ రామదాసున్ వెసన్!
ఆ రాజప్పుడు తప్పు సైఁచు మని తా నా రాముఁ బూజింప, స
త్కారమ్ముల్, పలు రీతి సౌరు లమరన్, గళ్యాణ మింపారఁగన్,
జేరంగాఁ జని, మేలి ముత్యములఁ నిచ్చెన్ గాఁ దలంబ్రాలు! వే,
ధారాదత్తముఁ జేసె మాన్యముల సన్మాన్యాది సంసేవకై!
మా రామయ్యయు, రామదాసు, ప్రభువౌ మా తానిషల్ స్థానికుల్!
మీ రీ బంధము లేవి లేని పరులే! మీదైన భద్రాచలం
బౌరా! నోళ్ళును మూయ, వృద్ధిఁ గనకే, పర్వెత్తె షష్ట్యబ్దముల్!
మీ రీ వేళ మహాప్త భక్త తతి సంప్రీతాస్థ వాక్యమ్ములన్
గోరన్, మీ దిది యౌనె? యెట్టు లగునో? గోపన్న మీ వాఁడె? ప్రా
పా రాజన్యుఁడగున్ నిజాము ప్రభుఁడే భద్రాద్రిఁ బాలింపఁగా;
నా రాజెద్దియ రాజధాని యనెనో యా హైద్రబాదే యిటన్
సారాచార విచార సార్వజనియౌ భద్రాద్రిఁ దా నిమ్ముగా
సారించెన్ బరిపాలనమ్ము! కనుకన్, సాగెన్ దెలంగాణలోఁ;
బారమ్మిద్దియ! రాజ్య మిద్దియ కదా! భద్రాద్రి మాదే కదా!
మీ రెట్లందురు మాదె యంచు నిపుడున్? మీ దెట్లు? మాదే కదా!
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
కామెంట్‌ను పోస్ట్ చేయండి