గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

సోమవారం, మే 05, 2014

ఆంధ్రావాళ్ళు ఆంధ్రాలో పనిచేయాలి...తెలంగాణవాళ్ళు తెలంగాణలో పనిచేయాలి...ఇదే న్యాయం!


(మిత్రులారా!
ఇదే టపా గతంలో దివి: 30-03-2014 నాడు ఇదే బ్లాగులో ప్రకటించినాను.
ఇప్పుడు మరల దాని అవసరం వచ్చింది కాబట్టి మరల ప్రకటిస్తున్నాను.
గమనించగలరు.)

తెలంగాణలోన తిష్ఠ
వేసినట్టి ఆంధ్రవాళ్ళు,
అక్రమముగ ఉద్యోగాల్
చేయుచుండ్రి నిస్సిగ్గుగ!

హైదరబాదున తొంబది
శాతము ఉద్యోగమ్ముల
నాంధ్రవారె ఆక్రమించి,
రాజ్యమేలుచుండిరయ్య!

తెలంగాణ రాష్ట్రమ్మున
ఇంకా వారలు ఉండిన,
తెలగాణుల కుద్యోగాల్
ఎచటినుండి వచ్చునయ్య?

ఆంధ్రవారు ఆంధ్రలోన,
తెలగాణులు తెలంగాణ
లో ఉద్యోగాలు చేయ
ఇరువురికిని మేలగునయ!

తెలంగాణ వచ్చినతరి
వారిని కొనసాగించుట
తగదని యెల్లరు గట్టిగ
ఉద్యమించవలెనయ్యా!

ఆంధ్రవారి నాంధ్రకిపుడు
పంపించగవలెనయ్యా!
తెలంగాణ ఉద్యోగాల్
తెలంగాణ కీయుడయ్య!!

ఉద్యోగుల విభజనమ్ము
స్థానికతను ఆధారము
జేసికొనియు చేసినచో
న్యాయమ్మే జరుగునయ్య!

హైద్రబాదు ఉద్యోగము
లందు తెలంగాణవారు
నలుబదెనిమిది శాతముకు
బదులుగ, పదిశాతముండ్రి!

తెలంగాణ కొలువులందు
తొంబది శాతమ్మాంధ్రులు
ఎట్టులుంద్రు? తప్పకుండ
ఆంధ్రకె పంపించవలెను!

అక్రమముగ ఉద్యోగాల్
పొందినట్టి ఆంధ్రవాళ్ళ
నందరినీ ఆంధ్రకిపుడు
తప్పక పంపగవలెనయ!

తెలంగాణలోన ఎవరు
అధికారమునకు వచ్చిన,
వారలు, ఈ ఉద్యోగుల
కొనసాగింపును మాన్పుడు!

విభజించెడి అధికారులు
గిర్‍గ్లాని కమిషను చెప్పి
నట్టి నివేదికను అమలు
పరచినచో న్యాయమగును!

అరువదేండ్లుగా తెలం
గాణకు అన్యాయమ్మును
ఆంధ్రవారు చేసినారు!
ఇపుడు కూడ చేయుదురా?

ఈ అన్యాయమ్మును ఇకపై
తెలగాణులు సహియింపరు!
స్థానికతన విభజింపక
పోయినచో ఉద్యమింత్రు!!

విభజన కమిటీ ఇప్పుడు
గతంలోన జరిగినట్టి
అన్యాయములను గ్రహించి,
న్యాయము జరిపింపవలెను!

ఆంధ్రవారి నాంధ్రాకే
తప్పక పంపించవలెను!
ఖాళీ ఉద్యోగములలొ
తెలగాణుల నింపవలెను!!

ఆంధ్రవాళ్ళ అక్రమాలు
ఇంకానా, సహియింపము!
తక్షణమే వారినిపుడు
ఆంధ్రాకే పంపవలెను!!

ఆంధ్రవార్కి ఏ ఆప్షను
ఈయరాదు, ఈయరాదు!
ఆంధ్రాకే పంపించుట
చేయవలెను, చేయవలెను!!

***     ***     ***     ***

మరిన్ని వివరాలకు


జై తెలంగాణ! జై జై తెలంగాణ!!

4 కామెంట్‌లు:

sandeep kumar చెప్పారు...

sir mee state meeku vachchindhi kada inka endukandi Andhra vallani (mammalni) thidatharu? Mee state lo meeru emaina chesukovachchu aa hakku meeku undhi kaani inka prathidaniki endukandi mammalni criticise chestharu? ee prapancham lo maaku unna bandhuvulu meere hindi varo tamil varo kannada varo kadu sir. seemandhra loni saamanya prajanikam meeku elanti anyayam cheinsdho cheppandi? inka pettubadi darulantara telangana lo pettubadi darulu lera andi , ante telangana pettubadi darulu maatrame telangana lo vyaparam cheyataniki maatrame telanagana vudyamam jarigindha andi? okkasari aalochinchandi......................

సూర్యుడు చెప్పారు...

You mean people from Telangana are not residing or working anywhere other than Telangana ;)

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

ప్రాంతీయత (nativity) ఆధారంగా విభజన జరగాలి అని స్పష్టంగా చెప్పుతున్నా కూడా అయోమయంలో పడిపోతున్నారు. తెలంగాణలో పుట్టి పెరిగి విద్యాబుద్ధులు నేర్చుకున్నవాళ్ళు వేరే చోట పనిచేస్తున్నా...తెలంగాణ ప్రాంతంవాళ్ళే అవుతారు...అలాగే ఆంధ్రాప్రాంతంలో పుట్టి పెరిగి విద్యాబుద్ధులు నేర్చుకొని, తెలంగాణలో పనిచేస్తున్నారనుకోండి...వాళ్ళు ఆంధ్రా ప్రాంతం వాళ్ళే అవుతారు గానీ తెలంగాణవాళ్ళు కారు. ఇదే మేం చెప్పేది. మా తెలంగాణ ఉద్యోగాల్లో అక్రమంగా చొరబడి, ఇంకా ఇక్కడే ఉద్యోగం చేస్తామంటే చూస్తూ ఊరుకోవడానికి మేం పాతకాలపు తెలంగాణపు ఎడ్డివాళ్ళం కాం. పాతరోజులు పోయాయి. కాబట్టి అక్రమార్కులు మూటాముల్లే సర్దుకుని ఆంధ్రాకు వెళ్ళాల్సిందే.

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

చూడండి సందీప్ గారూ! మా రాష్ట్రం మాకు వచ్చిందంటున్నారు మీరు. ఎలాంటి రాష్ట్రం వచ్చిందో చూడండి. ఆంక్షలతో కూడిన రాష్ట్రం ఇచ్చారు. గవర్నరుకు అధికారాలు కట్టబెట్టారు. పదేండ్లు ఉమ్మడి రాజధాని, హైకోర్టు, ఉన్నతవిద్యల్లో రిజర్వేషన్, జనాభా ప్రాతిపదికగా ఉద్యోగులవిభజన...ఇలా అన్నీ ఆంక్షలే. మా రాష్ట్రాన్ని మా ఆలోచన ప్రకారం పరిపాలించుకోడానికి ఆంక్షలెందుకు? మిథాయి పొట్లం ఇస్తామన్నారు...ఇచ్చారు...కానీ అందులో మిఠాయిమాత్రం లేదు. మిఠాయి సీమాంధ్రులకు ఇచ్చారు. (ఇలా అంటే మీకు కోపం). సీమాంధ్రులంటే సామాన్యప్రజానీకం కారు...సీమాంధ్ర పెత్తందారులు, బడా నాయకులు, అక్రమార్కులు! వీళ్ళపైనే మా యుద్ధం. హైదరాబాదులో అక్రమంగా మా ఉద్యోగాల్లో చొరబడిన ప్రతిఆంధ్రవాడూ ఇందులో చేరతాడు. మేం వాళ్ళనే సీమాంధ్రకు పంపాలని అంటున్నాం. సీమాంధ్ర స్థానికులను సీమాంధ్రకే పంపాలని అంటున్నాం. ఏ ప్రాంతీయులకు ఆ ప్రాంతంలోనే ఉద్యోగ భద్రత కల్పించాలంటున్నాం. ఇందులో అధర్మం ఏం కనిపిస్తున్నదండీ మీకు? మీరే బాగా ఆలోచించండి. మా తెలంగాణులకు విద్యా అవకాశాలు గతంలో చాలా తక్కువ వుండడం మూలాన, ఇక్కడి ఉద్యోగాల్లో సీమాంధ్రులు అక్రమంగా ప్రవేశించి, ఇక్కడే రిటైరై ఇక్కడే పెన్షన్ తీసుకుంటే మాకు నష్టం కాదా? ఆలోచించండి. కాబట్టి ఉద్యోగులను, పెన్షనర్లను ప్రాంతీయత ఆధారంగా విభజించి, ఎక్కడి వాళ్ళను అక్కడే ఉద్యోగం చేసుకోడానికి పంపాలంటున్నాం. ఇది తప్పా? మీరే బాగా ఆలోచించండి!

కామెంట్‌ను పోస్ట్ చేయండి