గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శనివారం, మే 10, 2014

జగన్ Vs చంద్రబాబు (యథా గతం...తథా వర్తమానం)

(నమస్తే తెలంగాణ దినపత్రికలో కట్టా శేఖర్ రెడ్డి కాలమ్...వ్యాసం)


విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్రలో ఏదో ప్రళయం పుట్టిస్తాడనుకున్న జగన్ కేవలం రాజకీయ ప్రచారానికి పరిమితమయ్యాడు. విభజన అనివార్యతను గుర్తించి మసలుకున్నాడు. చంద్రబాబు మాత్రం బిల్లు పార్లమెంటు ముందుకు వచ్చిన రోజునుంచి కంటికి కునుకు లేకుండా కాలికి బలపం కట్టుకుని చెన్నయ్ నుంచి కోల్‍కత్తా దాకా, బొంబాయి నుంచి చండీగఢ్, ఢిల్లీ, లక్నో దాకా వెళ్లి తెలంగాణను అడ్డుకోవడానికి ప్రయత్నించాడు.


చంద్రబాబును తెలంగాణ మేధావులు ఎందుకంత తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు? అని నా మిత్రుడు చాలాయేళ్ల తర్వాత నన్ను కొంచెం కటువుగానే అడిగారు. అభ్యుదయవాదులయినవాళ్లు కూడా సీమాంధ్రలోనూ చంద్రబాబును వ్యతిరేకించడం ఏమిటి? అని ప్రశ్నించారు. ఆయన నన్నడిగిన ప్రశ్ననే నేను చాలా మందిని అడిగాను. అవును...సీమాంధ్రులు జగన్‌ను ఎలా సమర్థిస్తారు? చంద్రబాబును ఎందుకు వ్యతిరేకిస్తారు? అని తెలుసుకోవడానికి ప్రయత్నించాను. మీకో విషయం తెలుసా? ఆంధ్రా పొలిటికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ అంతా...తెలంగాణలో కేసీఆర్ ఓడిపోవాలని, కాంగ్రెస్ గెలవాలని కోరుకున్నట్టే, తెలంగాణవాదులు...అక్కడ చంద్రబాబు ఓడిపోవాలని, జగన్ గెలవాలని కోరుకున్నారు. 

ఎందుకంటే ఆంధ్రా ఎస్టాబ్లిష్‌మెంట్‌కు ప్రతినిధి చంద్రబాబు. చివరి నిమిషం వరకు తెలంగాణపై యుద్ధం కొనసాగించినవాడు చంద్రబాబు. తెలంగాణను ఓడించడానికి అన్ని కుట్రలూ చేసినవాడు చంద్రబాబు. జగన్ ఎప్పుడో తెలంగాణ రాజకీయ రంగాన్ని వదలిపోయాడు. తెలంగాణలో అతనికి స్టేక్స్ లేవు. ఒకటో రెండో వచ్చినా అవి నిలిచేవికావు. కానీ చంద్రబాబు తెలంగాణను వదిలిపెట్టలేదు. తెలంగాణ సమాజాన్ని కెలకడం, కల్లోలపర్చడం మానుకోలేదు. అందుకే తెలంగాణవాదులకు అతనే ప్రత్యర్థిగా, ప్రమాదకారిగా కనిపిస్తాడు...అని ఒక జర్నలిస్టు మిత్రుడు వ్యాఖ్యానించారు. అక్కడ చంద్రబాబు గెలిస్తే తెలంగాణకు సమస్యలు సృష్టిస్తాడన్న భయం ఇంకా ఇక్కడి ప్రజల్లో (తెలంగాణవాదుల్లో) ఉంది. చంద్రబాబు సూటిగా రాజకీయాలు చేయడం ఎప్పుడూ లేదు. సమాజాన్ని విభజించి పాలించాలని చూస్తాడు. ఎప్పుడూ అడ్డదారులు, దొడ్డిదారులు వెతుక్కోవడమే. అందుకే అతనంటే ఇక్కడ వ్యతిరేకత...అని మరో విశ్లేషకుడు చెప్పారు. 


రి సీమాంధ్ర ప్రజలకు మంచి నాయకుడు అవసరం లేదా? వాళ్లేమైపోయినా ఫర్వాలేదా? అని నా మిత్రుడు ప్రశ్నించాడు. ఏది మంచి, ఏది చెడు నిర్ణయించుకోవడంలో ప్రజల సామూహిక విజ్ఞత తర్వాతనే ఎవరైనా. ప్రజలు మోసపోతారని, ప్రలోభాలకు గురవుతారని, తప్పు చేస్తారని, లొంగిపోతారని ఎవరయినా అనుకుంటే అది ముమ్మాటికీ దుస్సాహసమే. తెలంగాణవాదులు, తెలంగాణ మేధావుల అభిప్రాయాలతో నిమిత్తం లేకుండా ఇక్కడి ప్రజలు, అక్కడి ప్రజలు తీర్పు ఇస్తారు.ఎవరు గెలిస్తే వారు మంచి నాయకుడని ప్రజలు గుర్తించినట్టు. ఇక్కడ కేసీఆర్ అయినా, పొన్నాల అయినా, అక్కడ జగన్ గెలిచినా, చంద్రబాబు గెలిచినా..ఆ తీర్పును గౌరవించవలసిందే. ప్రజాస్వామ్యంలో ఇంతకంటే కొలమానం లేదు.


ద్దరిలో ఒకరు తెలిసిన దయ్యం (నోన్ డెవిల్). ఒకరు తెలియని దయ్యం(అన్ నోన్ డెవిల్). చంద్రబాబు గురించి ప్రజలకు తెలుసు. ఆయన విధానాలు తెలుసు. ఆయన రాజకీయాలు తెలుసు. ఆయన ఎత్తులు జిత్తులు తెలుసు. ఆయన పాలనా సమర్థత తెలుసు. ఆయనకున్న దృక్పథమూ తెలుసు. ఆయన అనైతిక పోకడలూ తెలుసు. ఆయన అధికారంలో ఉన్న తొమ్మిదేళ్లకాలంలో ఏమి చేశాడో జనం ఇంకా మర్చిపోలేదు. ఆయన ఆ తర్వాత పదేళ్లుగా ప్రతిపక్ష నాయకుడిగా ఉండి కూడా గతాన్ని మరిపింపలేకపోయాడు. కోల్పోయిన విశ్వసనీయతను పునరుద్ధరించుకునే ప్రయత్నం చేయకపోగా మరింత విశ్వసనీయతను కోల్పోయే పనులు చేశారు. మాటలు మార్చడం, మనుషులను మార్చడం, మిత్రులను మార్చడం...చంద్రబాబు నైజంగా మారిపోయింది.


చంద్రబాబు తన గీతను పెద్దది చేసుకోలేకపోయాడు. ఇతరుల గీతను చెరిపేసి, దులిపేసి, చిన్నది చేసి ఎదగాలని చూశాడు. ఈ కుట్రపూరితమైన స్వభావం చాలా మందిలో ఏహ్యభావం పుట్టించింది. చంద్రబాబుది "న ఘర్‌కా, న ఘాట్‌కా" పరిస్థితి. చంద్రబాబు ఇక్కడ...లేఖ ఇచ్చింది, తెలంగాణ తెచ్చింది నేనే నంటాడు. అక్కడ...తెలంగాణను నిలువరించడానికి ప్రయత్నించింది నేనే నంటాడు. విభజన దుర్మార్గంగా జరిగిందంటాడు. జగన్...రాష్ట్రవిభజన ఖాయమైన తర్వాత తెలంగాణ జోలికి రావడం మానేశాడు. విభజనకు అనుకూలంగా తన రాజకీయ జీవితం మల్చుకున్నాడు. తెలంగాణలో మొత్తం పార్టీ జారిపోతున్నా ఆయన పట్టించుకోలేదు. 


తెలంగాణ నాది కాదన్నట్టుగానే వ్యవహరించాడు. విభజన వ్యతిరేక నినాదాలు చేసినా అవి ఉద్యమ రూపం తీసుకోలేదు. విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్రలో ఏదో ప్రళయం పుట్టిస్తాడనుకున్న జగన్ కేవలం రాజకీయ ప్రచారానికి పరిమితమయ్యాడు. విభజన అనివార్యతను గుర్తించి మసలుకున్నాడు. చంద్రబాబు మాత్రం బిల్లు పార్లమెంటు ముందుకు వచ్చిన రోజునుంచి కంటికి కునుకు లేకుండా కాలికి బలపం కట్టుకుని చెన్నయ్ నుంచి కోలకత్తా దాకా, బొంబాయి నుంచి చండీగఢ్, ఢిల్లీ, లక్నో దాకా వెళ్లి తెలంగాణ ను అడ్డుకోవడానికి ప్రయత్నించాడు. విభజన తర్వాత కూడా చంద్రబాబు తెలంగాణ వాదులను, కేసీఆర్‌ను లక్ష్యంగా చేసుకుని రాజకీయ దాడులకు పాల్పడ్డాడు. జగన్ తెలంగాణవాదుల జోలికిరాలేదు. 


తెలంగాణ పార్టీల జోలికి రాలేదు. చంద్రబాబును తెలంగాణవాదులు వ్యతిరేకించడానికి వెనుక ఒక తరం అనుభవించిన క్షోభ ఉంది. వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి జీవించి ఉంటే తెలంగాణపై దాష్టీకం చెలాయించే విషయంలో బహుశా చంద్రబాబు స్థానాన్ని ఆయన తీసుకుని ఉండేవారేమో! కానీ ఆయన మరణించిన తర్వాత ఆయన స్థానాన్ని ఆయన తనయు డు తీసుకోలేదు. చంద్రబాబే తీసుకున్నాడు. 2009 డిసెంబరులో మొదలైన ఆయన ఆటలు విభజన పూర్తయ్యేదాకా కొనసాగుతూనే ఉన్నాయి. చంద్రబాబును తెలంగాణవాదులు ఎంతకీ జీర్ణించుకోలేకపోవడానికి ఇంత నేపథ్యం ఉంది. 


యినా ఎన్నికల ఫలితాలు అనేక తీర్పులు చెబుతాయి. పాతను కడిగేసి కొత్తకు శ్రీకారం చుడతాయి. నాయకులకు కొత్త జీవితాన్ని ప్రసాదిస్తాయి. పాత ముద్రలు తొలగిపోయి కొత్త పేరు ప్రతిష్ఠలు వస్తాయి. కాపాడుకుంటే ఉన్నత శిఖరాలకు సోపానం అవుతాయి. తప్పులు చేస్తే పాతాళం చూపిస్తాయి. సర్వేలు, అంచనాలు మనిషి ఆసక్తిని తృప్తి పర్చుకోవడం కోసమే. అవి నిజం కావాలని లేదు. పూర్తిగా అబద్ధం కూడా కాకపోవచ్చు. టీడీపీ-బీజేపీ, దాని అనుకూల మీడియా సంస్థలు సీమాంధ్రలో తమ కూటమికి అధికారం వస్తుందని నమ్ముతున్నాయి. చంద్రబాబు 120కి పైగా అసెంబ్లీ స్థానాలు, 20కి పైగా లోక్‌సభ స్థానాలు వస్తాయని ధీమా ప్రకటించారు. వైసీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి కూడా దాదాపు అదే లెవెల్లో మాట్లాడుతున్నారు. 

స్వతంత్ర విశ్లేషకులు మాత్రం స్వల్ప ఆధిక్యంతో జగన్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని, టీడీపీ-బీజేపీలు జగన్‌ను బాగా నిలువరించగలిగాయని చెబుతున్నారు. లోక్‌సభ స్థానాల్లో కూడా జగన్‌కు ఎక్కువ స్థానాలు వస్తాయని అంచనా వేస్తున్నారు. పోలింగ్ శాతం బాగా పెరగడం వల్ల టీడీపీ లాభం పొందుతోందని లగడపాటి వంటివారు చెబుతున్నారు. కానీ గ్రామీణ ప్రాంతాల్లో పోలింగ్ శాతం పెరగడం జగన్‌కు బాగా ఉపకరిస్తుందని, పట్టణ ప్రాంతాల ఓటింగ్ పెరిగితే తెలుగుదేశానికి ఉపకరిస్తుందని మరికొందరు విశ్లేషకులు చెబుతున్నారు. పత్తిపాడు వంటి నియోజకవర్గాల్లో 90 శాతం పోలింగ్ జరిగింది. అటువంటి నియోజక వర్గాలు చాలా ఉన్నాయి. పోటీ ఎంత బీభత్సంగా ఉందో పోలింగ్ శాతం చూస్తే అర్థమవుతుంది. 


న్నింటికంటే ఆసక్తికరమైన అంశం ఏమంటే, సమైక్యాంధ్ర పార్టీలు సోదిలో లేకుండా పోవడం. అసలు ఎన్నికల ప్రచారంలో సమైక్యాంధ్ర అన్న వాదమే వినిపించకపోవడం. భస్మాసురుని కథ, కిరణ్‌కుమార్‌రెడ్డి కథ చాలా దగ్గరగా ఉంటాయి. ఆయన ఏదో చేసేద్దామనుకున్నారు. తన రాజకీయ భవిష్యత్తును, కాంగ్రెస్ భవిష్యత్తును కోలుకోలేనంతగా దెబ్బతీశారు. రాజకీయాల్లో ఆత్మహత్యలు చేసుకోవడం అంటే ఇలాగే ఉంటుందేమో. ఆయన ఒక్కరు కాదు...లగడపాటి రాజగోపాల్, ఉండవల్లి అరుణ్‌కుమార్, హర్షకుమార్, సబ్బంహరి...ఇంకా చాలా మంది సమైక్యాంధ్ర అనే ఎండమావి వెంట స్వారీ చేసి, చివరికి అడ్రసులేకుండా పోయారు. రాష్ట్ర విభజన రెండు ప్రాంతాలకు కొత్త రాజకీయాలను పరిచయం చేస్తుంది. పాత నాయకులనే కొత్త పాత్రల్లో చూపిస్తుంది.

***      ***      ***

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో...)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

3 కామెంట్‌లు:

శ్యామలీయం చెప్పారు...

మీరు మీ ప్రియతమతెలంగాణారాష్ట్రం గురించి ఆలోచించుకోండి చాలు.
ఇతర రాష్ట్రాల సంగతులు మీకెందుకు?

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

కొందరు సీమాంధ్రులు తెలంగాణా ఉద్యోగాల్ని అక్రమంగా కొల్లగొట్టి, అనుభవించి, రిటైరై కూడ, సీమాంధ్ర పెన్షన్ డబ్బులుగాక, తెలంగాణ పెన్షన్ డబ్బులు తినాలనుకుంటున్నారు. అలాగే, కొందరు ఉద్యోగాల్ని అక్రమంగా కొల్లగొట్టిందిగాక, వాళ్ళ సీమాంధ్ర రాష్ట్రానికి వెళ్ళకుండా తెలంగాణలోనేవుండి పబ్బం గడుపుకుందామని చూస్తున్నారు. ఇలాంటి దగుల్బాజీలు తెలంగాణకు నష్టం కలిగించేపని చేస్తుండగాలేనిది...నేను కేవలం ఒక టపా రాస్తేనీ నష్టమొచ్చిందా తాడిగడపవారూ? మాకు అవసరమున్నది మేం రాసుకుంటున్నాం. మధ్యలో మీకెందుకు బాధ? మిమ్మల్ని ఎవరైనా పిలిచారా? ఇది నమస్తే తెలంగాణలో వచ్చిన వార్తనే! నేను దీన్ని హైలైట్ చేశా. అంతే! మీకెందుకు కోపం? నేను మీ జోలికి వచ్చానా, వార్తకొచ్చానా? మీ పేరైనా ఎత్తానా? ఎందుకండీ ఉక్రోశం? మీ బ్లాగుల్లో రాసుకోండి తెలంగాణకు వ్యతిరేకంగా! నాపై ఎన్నోసార్లు వ్యతిరేకంగా మీరు రాసుకొంటే నేనెప్పుడైనా ఇలా అడిగానా? ఎవరి హద్దుల్లో వాళ్ళుంటే మంచిదండీ! స్వస్తి.

Jai Gottimukkala చెప్పారు...

శ్యామలీయం మాస్టారూ, ఇదే మాట మీకో వర్తిస్తుందేమో ఆలోచించండి.

Why preach what you do not practice Sir?

కామెంట్‌ను పోస్ట్ చేయండి