గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శుక్రవారం, మే 16, 2014

రెండు రాష్ట్రాలకూ ఒకే గవర్నర్ ...ఎవరి కుట్ర?


జూన్ రెండో తేదీ నుంచి ఉనికిలోకి వచ్చే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఒకే గవర్నర్‌ను కొనసాగించాలని కేంద్ర హోంశాఖ చేసిన సిఫారసుకు ప్రధాని ఆమోదముద్ర వేశారు. ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గవర్నర్‌గా కొనసాగుతున్న ఈఎస్‌ఎల్ నరసింహన్‌ను జూన్ 2వ తేదీ తర్వాత కూడా రెండు రాష్ట్రాలకూ ఉమ్మడి గవర్నర్‌గా కొనసాగించాలని కేంద్ర హోంశాఖ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ ఫైలును ప్రధాని కార్యాలయానికి పంపింది. దీనిని పరిశీలించిన ప్రధాని ఆమోదం తెలిపి రాష్ట్రపతి కార్యాలయానికి పంపారు. రాష్ట్రపతి ఆమోదముద్ర తర్వాత అధికారిక ప్రకటన వెలువడనుంది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో రెండవ భాగంలోని 7వ క్లాజ్ ప్రకారం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొనసాగుతున్న గవర్నర్‌నే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ (13 జిల్లాల) రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవం తర్వాత కూడా కొనసాగించాలని, ఎంతకాలం వరకు అనేది రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేస్తారని పేర్కొంది.

ఆవిర్భావ తేదీ అనంతరం ఉమ్మడి రాజధాని నిర్వహణ విషయంలోనూ, ప్రజా భద్రత, స్వేచ్ఛ, పబ్లిక్ ఆస్తుల రక్షణ తదితరాలకు సంబంధించి గవర్నర్‌కు ప్రత్యేక బాధ్యతలు, అధికారాలు ఉంటాయని కూడా పేర్కొంది. ముఖ్యంగా శాంతి భద్రతలు, అంతర్గత భద్రత, ఉమ్మడి రాజధానికి అవసరమైన భవనాల కేటాయింపు, ముఖ్యమైన భవనాలకు రక్షణ తదితరాలన్నీ గవర్నర్ పర్యవేక్షణలో ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని ఆదేశాల మేరకు ప్రస్తుతం కొనసాగుతున్న గవర్నర్ నరసింహన్‌ను జూన్ 2వ తేదీ తర్వాత కూడా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్‌గా కొనసాగించాలని ప్రధాని ఆమోదం తెలిపి రాష్ట్రపతి కార్యాలయానికి పంపారు. కాబట్టి అధికారిక ఉత్తర్వులు వెలువడేంత వరకు నరసింహన్ ఉమ్మడి గవర్నర్‌గానే కొనసాగుతారు.



సీమాంధ్రుల లాబీయింగూ...
జైరాం రమేశ్ లాంటి సీమాంధ్ర వత్తాసుదారుల కుట్రవల్లా...
రాష్ట్రం ఏర్పడితే హైదరాబాదులో సీమాంధ్రులకు రక్షణ ఉండదు అనే...అర్థంలేని...ఆధారంలేని వ్యాఖ్యలవల్లా...
రెండు రాష్ట్రాలకూ ఒకే గవర్నర్‍
అనే గుదిబండ
మన తెలంగాణ మెడకు
వ్రేలాడదీయబడబోతోంది...

ఎలాంటి పరిస్థితుల్లో
ఒక రాష్ట్రపు గవర్నర్‍ను
మరొక రాష్ట్రానికి కూడా
గవర్నర్‍గా కొనసాగిస్తారో...
రాజ్యాంగ బద్ధంగానే
ఈ నిర్ణయం ఉందా?
అనేది
రాబోయే పాలకులు
గుర్తెరిగి...
తెలంగాణ మెడకు వ్రేలాడదీసిన
ఈ గుదిబండను
రాజ్యాంగబద్ధంగా
శాశ్వతంగా
తొలగించేపని చేయాల్సివుంది!
త్వరలోనే ఇది జరుగుతుందని ఆశిద్దాం...

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో...)



జై తెలంగాణ!   జై జై తెలంగాణ!


2 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

Ee edupu gottu kutra dialogues inkaa aaputhaaraa .....janmanthaa ila edusthuuuuuune vuntaraa?

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

సీమాంధ్రులు ఏడుపుగొట్టు కుట్రలతో...వెధవ డైలాగులతో...తెలంగాణకు నష్టం కలిగించగా లేనిది...మేం సీమాంధ్రుల కుట్రల గురించి మాట్లాడితేనే తప్పొచ్చిందా? మీరూ సీమాంధ్రులేగా...మీ సీమాంధ్రులు...జన్మంతా తెలంగాణను దోస్తూనేవుంటారా...మేం దోపిడీకి గురవతూనేవుండాలా? చెప్పొచ్చాడండీ నీతిమంతుడు...! ముందు మీ సీమాంధ్రులను...తెలంగాణను దోచే పనులు చేయకుండా...ఆపి, ఆ తర్వాత...మాట్లాడండి. ఊరకే మా బ్లాగుల్లోకి వచ్చి ఏడుపుగొట్టు డైలాగులతో నసపెట్టకండి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి