-టీఈఈఏ నిజ నిర్ధారణ బృందం స్పష్టీకరణ
మహబూబ్‌నగర్ జిల్లా ఆత్మకూర్ సమీపంలో నిర్మితమౌతున్న దిగువ జూరాల జెన్‌కో జలవిద్యుత్ కేంద్రంలోకి నీరుచేరి ప్రమాదానికి గురికావటం ముమ్మాటికీ సీమాంధ్ర అధికారుల కుట్రేనని తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజినీర్స్ అసోషియేషన్ (టీఈఈఏ) విమర్శించింది. టీఈఈఏ ఏర్పాటు చేసిన నిజనిర్ధారణ కమిటీ ఆదివారం జూరాలను సందర్శించి ఘటనపై పూర్వాపరాలను సేకరించింది. ఈ సందర్భంగా నిజనిర్ధారణ కమిటీ చైర్మన్ ఎస్ స్వామిరెడ్డి, టీఈఈఏ అధ్యక్షుడు శివాజీ విలేకరులతో మాట్లాడుతూ సీమాంధ్ర అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని ఆరోపించారు. నాసిరకమైన పనులు నిర్వహించినందునే ఈ ప్రమాదం సంభవించిందని చెప్పారు. 10 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చినా తట్టుకునే విధంగా ప్రాజెక్ట్ పిల్లర్లను నిర్మించారని, ప్రస్తుత కేవలం 70వేల క్యూసెక్కుల నీటికే ప్రమాదం సంభవించడం అనుమానాలకు తావిస్తున్నదని తెలిపారు.14.74 కోట్లు వెచ్చించిన ప్రాజెక్ట్ 120 మెగావాట్ల విద్యుదుత్పత్తిని చేసినా రోజుకు రూ. 2 కోట్ల చొప్పన వంద రోజుల్లో రూ.200 కోట్లు తెలంగాణ ప్రజలకు మిగిలేవని, కానీ, ఇప్పుడు వడ్డీ రూపంలో రూ.200 కోట్లు చెల్లించాల్సిన దుస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనంతటికీ కారణం సీమాంధ్రకు చెందిన అధికారి విజయానంద్ ఎండీగా, మాజీ డైరెక్టర్‌గా రిటైర్డయిన ఆదిశేషు హైడల్ సలహాదారుగా ఏపీకి నియమింపబడి ఇక్కడి పనులను పర్యవేక్షించడమేనన్నారు. కమిటీ నివేదికను రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నివేదించనున్నట్లు తెలిపారు.
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి