గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

గురువారం, ఆగస్టు 14, 2014

అక్రమార్కులపై జోరుపెంచిన సీఐడీ...!

- ఇందిరమ్మ గృహాల విచారణలో భారీగా వెలుగుచూస్తున్న అక్రమాలు
- అనర్హులు, అవినీతిని వెలికితీస్తున్న అధికారులు ..
-విచారణ తర్వాత కేసుల నమోదుకు రంగం సిద్ధం
ఇందిరమ్మ ఇండ్ల అక్రమాలపై రాష్ట్రవ్యాప్తంగా సీఐడీ విచారణ కొనసాగుతున్నది. ప్రభుత్వ ఆదేశాలతో రంగంలోకి దిగిన సీఐడీ బృందాలు జిల్లాల్లో జోరు పెంచారు. స్వాధీనం చేసుకున్న రికార్డుల్లో ఉన్న వివరాల ఆధారంగా విచారణ ముమ్మరం చేశారు. మంగళవారం నల్లగొండ, కరీంనగర్, నిజామాబాద్, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో విచారణ జరిపారు. పలుచో ట్ల రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. మెదక్ జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఖేడ్ మండలం పంచగామ, మనూరు మం డలం శేరిదామర్‌గిద్ద గ్రామాల్లో ఇందిరమ్మ గృహాల కుంభకోణంపై సీఐడీ డీఎస్పీ వెంకటేశ్వర్‌రావు ఆధ్వర్యంలో సీఐడీ బృందం సభ్యు లు మంగళవారం తనిఖీలు నిర్వహించి విచారణ చేపట్టారు. 
ఇందిరమ్మ పథకం అమలు చేసిననాటి నుంచి ఇప్పటి వరకు మంజూరై న గృహాలు నిర్మించుకున్న లబ్ధిదారులు, పక్కదారి పట్టిన నిధులు ఇలా అన్నికోణాల్లో విచారణ చేపట్టారు. ఇందిరమ్మ లబ్ధిదారుల రేషన్‌కార్డు, బ్యాంకుఖాతా నెంబర్ పరిశీలించి వివరాలను నమో దు చేసుకున్నారు. నారాయణ్‌ఖేడ్ మండలం పంచగామలో సీఐడీ అధికారులు రెండు బృందాలుగా విడిపోయి 419 గృహాల విచారణ చేపట్టారు. మనూరు మండలం దామర్‌గిద్ద గ్రామంలో 104 గృహాలు పక్కదారి పట్టి రూ.27.53 లక్షల అవినీతి జరిగినట్లు విచారణలో తేలింది. ఈ నిధులు లబ్ధిదారుల పేర్లు, ఎంత మంది పేర్లతో డ్రా చేశారు, ఎవరెవరికి డబ్బులు అందాయో ఆరా తీస్తున్నారు. నల్లగొండ జిల్లా చందంపేట మండలంలోని తిమ్మాపురం, అనుముల మండలం చల్మారెడ్డిగూడెం, కొట్టాలలో డీఎస్పీ రామచం ద్రం ఆధ్వర్యంలో అధికారులు ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరించా రు. పాతఇళ్లకే మెరుగులుదిద్ది బిల్లులు స్వాహా చేశారని,అధికారులు, దళారులు కుమ్మక్కై నిధులు కాజేసినట్లు నిర్ధారించారు.

మంథని, హుజూరాబాద్‌పై నజర్

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో సీఐడీ అధికారుల విచారణ రెండోరోజు కొనసాగింది. సోమవారం వీణవంక మండలంలో పర్యటించిన సీఐడీ బృందం మంగళవారం హుజూరాబాద్‌లోని హౌసింగ్ డీఈ కార్యాలయాన్ని సందర్శించింది. సీఐడీ డీఎస్పీ సందేబోగు మహేందర్, సీఐ రత్నపురం ప్రకాష్‌లు పలుఅంశాలపై డీఈ నర్సింహారావును అడిగితెలుసుకున్నారు. అధికంగా అవినీతి జరిగినట్టు భావిస్తున్న హుజూరాబాద్, మంథని నియోజకవర్గాల్లో తొలివిడత విచారణ కొనసాగుతున్నది. ప్రధానంగా మంథని నియోజకవర్గంలో రెండు గ్రామాలు, హుజూరాబాద్ నియోజకవర్గంలోని వీణవంక మండలంలో కొండపాక, రెడ్డిపల్లి గ్రామాలను ఎంచుకున్నారు. నియోజకవర్గంలో 2004 నుంచి 2014సంవత్సరాల మధ్య 75,390 గృహాలు మంజూరవగా 17,125ఇండ్లు పూర్తయినట్లు రికార్డులు చెబుతున్నాయి. కొండపాక, రెడ్డిపల్లి నిర్మించిన ఇండ్ల్లలో అవినీతి ఎక్కువగా జరిగిందని సమాచారం.లబ్ధిదారులను ఎవరు ఎంపిక చేశారు? భూ యజమానులను ఎవరు గుర్తించారు? నిర్మాణం జరుగుతున్న క్రమంలో బిల్లులు ఎలా చెల్లించారనే విషయాలపై విచారణ జరుగుతున్నది.

తాళం వేసి ఉంటే ఇంటి ఫొటోల సేకరణ

నిజామాబాద్ జిల్లాలో మొదటి రోజు లింగంపేట, సదాశివనగర్ మండలాల్లో సీబీసీఐడీ సీఐ వెంకటేశ్వర్‌రావు బృందం మం గళవారం విచారణ చేపట్టింది. లింగంపేట మండలంలోని పోల్కంపేట, సదాశివనగర్ మండలం భూంపల్లిలో విచారణ చేపట్టారు. 2007 నుంచి 2009కు ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన సమాచారం ఉండడంతో లబ్ధిదారుల వద్దకు నేరుగా వెళ్లారు. లబ్ధిదారుని పేరు, మంజూరైన సంవత్సరం, ఎవరి ద్వా రా బిల్లు పొందారనే వివరాలను సేకరించారు. ఒకవేళ ఇల్లు నిర్మించకపోయినా వివరాలు సేకరించారు. వివరాలు సేకరించిన తర్వాత లబ్ధిదారుని ఐడీ నెంబరును పలకపై వేస్తున్నారు. లబ్ధిదారులు ఎవరైనా ఇంటికి తాళం వేసి ఉంటే వారి ఇంటి ఫొ టోలను సేకరిస్తున్నారు. గ్రామంలో ఉన్న 177 ఇళ్ల వివరాల పూర్తి సమాచారం సేకరిస్తున్నారు. ఇండ్ల నిర్మాణంలో అక్రమార్కులకు పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని సీఐడీ సీఐ వెంకటేశ్వర్‌రావు స్పష్టంచేశారు. జిల్లావ్యాప్తంగా 1,29,222 ఇళ్లు ఉండగా, బినామీలు, ఇండ్లు నిర్మించకుండానే బిల్లులు పొందినవారి వివరాలు పూర్తిగా తెలిశాయని చెప్పారు. 2007-09 వరకు గ్రామ వీవోల ద్వారా చెల్లించిన బిల్లుల్లో భారీ అక్రమాలు జరిగాయన్నారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి