గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

గురువారం, సెప్టెంబర్ 18, 2014

గండిపేట దొంగలకు వణుకు...!!

-మంగళవారం కొనసాగిన కూల్చివేతలు
-కలెక్టర్ ఆదేశాలతో వివిధ శాఖలు రంగంలోకి
గండిపేట చెరువు భూములు కబ్జా చేసిన ఆక్రమణదారుల గుండెల్లో వణుకుపుట్టింది. రాజకీయ అండదండలతో ఏం చేసినా చెల్లుతుందని భావించిన సీమాంధ్రబాబులు సర్కారు కన్నెర్ర చేయడంతో గడగడలాడుతున్నారు. జలాశయం పరిసరాల్లోని పట్టా భూముల్లో ఎకరం కొని జలాశయం పరిధిలోకి వచ్చే ఐదెకరాలు ఒకడు కబ్జా చేస్తే.. మూడెకరాలు కొని పదెకరాలు కబ్జా పెట్టింది ఇంకొకడు.. ఇలా అనకొండలాగా జలాశయాన్ని మింగుతూపోయారు. వీరి పాపం పండి ఈ బాగోతం వెలుగు చూడడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీవ్రస్థాయిలో స్పందించింది.
gandipetఫలితంగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శ్రీధర్ రంగంలోకి దిగారు. ఆయన ఆదేశాలతో జిల్లా ఏడీ సర్వేయర్ నరహరి, తహసీల్దార్ చంద్రశేఖర్, జలమండలి జనరల్ మేనేజర్ సాయినాథ్, జిల్లా సర్వేఇన్‌స్పెక్టర్ రాంచందర్, జలమండలి డీజీయం రామకృష్ణ, డిప్యూటి సర్వేయర్ కృష్ణయ్య, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ ప్రసాద్, జలమండలి మేనేజర్ వెంకట్రావులతో కూడిన బృందం మంగళవారం తరలివచ్చి గండిపేట చెరువు పరివాహక ప్రాంతంలో వెలసిన అక్రమ నిర్మాణాలు, ఆక్రమణలను పరిశీలించారు. ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్ల పరిధిలో నాటిన హద్దు రాళ్లను తొలగించి చెరువులోకి పాతిన కడిరాళ్లను, కాంపౌండ్ గోడలను జేసీబీలతో కూల్చేశారు. ఇక్కడ ఒక్కో ఆక్రమణదారుడు ఐదు నుంచి పదిఎకరాలకు పైగా చెరువు భూములను ఆక్రమించుకున్నారని గుర్తించినట్టు అధికారులు చెప్పారు.

మంగళవారం ఒక్కరోజే సుమారు 20 ఎకరాల కబ్జాలను తొలగించినట్లు చెప్పారు. తాము ఊహించిన దానికి పదిరెట్లు చెరువు భూములు ఆక్రమణలకు గురయినాయని అధికారులు చెప్పారు.ఆక్రమణల తొలగింపునకు ఎక్కువ సమయం పట్టేలా ఉందన్నారు. జీఐఎస్ సర్వేతో హద్దులు తనిఖీ చేసి ఎక్కడ ఆక్రమణ జరిగినా, ఏ నిర్మాణం ఉన్నా నిర్దాక్షిణ్యంగా కూల్చేస్తామని చెప్పారు. ఇదిలాఉండగా జలాశయాన్ని కబ్జా పెట్టిన ఆక్రమణదారులు ప్రభుత్వంలోని కొంతమంది పెద్దలపై వత్తిళ్లు తీసుకువచ్చేందుకు యత్నిస్తున్నట్లు సమాచారం. ఈ కబ్జాలను లోకాయుక్త దృష్టికి తీసుకెళ్లేందుకు స్థానికులు సిద్ధమౌతున్నారు.

ఉపేక్షించే ప్రసక్తే లేదు : నరహరి, జిల్లా సర్వే ఏడీ

జలాశయ భూముల్లో నిర్మాణాలు చేపడుతున్న వారు ఎవరైనా ఊపేక్షించే ప్రసక్తేలేదు. కోట్లాది మంది ప్రజల దాహార్తిని తీర్చే జలాశయ పరిరక్షణ కోసం ప్రత్యేక నిబంధనలున్నా యి. వాటిని ఉల్లంఘించడం చట్టపరమైన నేరం.ఈ కబ్జాలపై సమగ్ర సర్వే నిర్వహించి కలెక్టర్‌కు నివేదిస్తాం.

ఎఫ్‌టీఎల్ నిర్ధారించండి... క్షణాల్లో కూల్చివేస్తాం

చెరువు భూములను కబ్జాలను తొలగించేందుకు రెవెన్యూశాఖ సిద్ధంగా ఉంది. జలమండలి అధికారులు చెరువు ఎఫ్‌టీఎల్ హద్దులను నిర్థారించి చూపితే ఆక్రమణలన్నింటినీ తక్షణమే కూల్చిపారేస్తాం అని తహసీల్దార్ చంద్రశేఖర్ తెలిపారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!      జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి