- ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం
ప్రతి ఏడాది సెప్టెంబర్ 9న ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా నిర్వహించాలని నిర్దేశిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం జీవో జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు నిర్వహించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ప్రతి ఏడాది తెలంగాణ భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు వీలుగా రాష్ట్ర సాంస్కృతికశాఖ కావాల్సిన చర్యలు తీసుకోవాలని నిర్దేశించింది. ఈ మేరకు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ ముఖ్యకార్యదర్శి బీపీ ఆచార్య ఉత్తర్వులు జారీ చేశారు. వరంగల్‌లో జరిగిన కాళోజీ శతజయంతి సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ కాళోజీ జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా ప్రకటించారు. ఆయన ప్రకటన చేసిన 24 గంటల్లోనే అందుకు సంబంధించిన జీవో వెలువడటం గమనార్హం. తెలంగాణ భాషా సాంస్కృతిక రంగాల పురోభివృద్ధికి, తెలంగాణలోని ప్రతీ పాలనారంగంలో తనదైన అస్తిత్వ పతాకం ఎగురవేయాలన్న ఆలోచనకు ఈ నిర్ణయం నిలువుటద్దమని భాషాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
1 కామెంట్:
శుభవార్త చెప్పారు - చాలా సంతోషం.
కామెంట్‌ను పోస్ట్ చేయండి