-వలసపాలనలో జీవోలన్నీ ఆంధ్రాకు అనుకూలమే
-సెంట్రల్ వర్సిటీని దేశంలోనే నెంబర్ వన్‌గా మార్చుతాం
-టీఆర్‌ఎస్వీలో టీఎస్‌ఏ విలీనం సభలో ఎంపీ కవిత
తెలంగాణ ప్రభుత్వం చిత్రగుప్తుడిలా గత పాలకుల పాపాల చిట్టా రాస్తున్నదని, వలస పాలనలో తప్పిదాలను సవరించాకే ప్రభుత్వం పూర్తి స్థాయి కార్యాచరణకు దిగుతుందని నిజామాబాద్ ఎంపీ కల్వకంట్ల కవిత అన్నారు. టీఆర్‌ఎస్వీలో తెలంగాణ విద్యార్థి అసోసియేషన్ (టీఎస్‌ఏ) విలీనం సందర్భంగా హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీలో జరిగిన సభలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ గత ప్రభుత్వాల జీవోలన్నీ ఆంధ్రాకు అనుకూలమైనవేనని, అవి తెలంగాణ అభివృద్ధికి సరిపోవన్నారు. వలస ప్రభుత్వం తెలంగాణ, భాష, సంస్కృతి, నాయకులను కించపరుస్తూ గోబెల్స్ ప్రచారం చేసిందని.. ప్రజలు మాత్రం ఉద్యమంలో భాగమయ్యారని పేర్కొన్నారు. తెలగాణ పునర్మాణంలోనూ అదే చొరవను ప్రదర్శించాలని కోరారు. పునర్నిర్మాణమంటే పాలకుల అహంకారాన్ని కూలగొట్టడమే అన్నారు. -సెంట్రల్ వర్సిటీని దేశంలోనే నెంబర్ వన్‌గా మార్చుతాం
-టీఆర్‌ఎస్వీలో టీఎస్‌ఏ విలీనం సభలో ఎంపీ కవిత
హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీని దేశంలోనే నంబర్ వన్‌గా చేసేందకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా ఘనంగా నిర్వహింంచేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని, ఇప్పటికే ముఖ్యమంత్రి రూ. పదికోట్లు కేటాయించారని గుర్తుచేశారు. ప్రొఫెసర్ క్రిష్ణ అధ్యక్షతన జరిగిన విలీన సభలో ప్రొఫెసర్ డీ వెంకటరమణ, టీఎస్‌ఏ వ్యవస్థాపక అధ్యక్షుడు సిలువేరు హరినాథ్, శంకర్ గౌడ్, వెంకటేశ్ చౌహాన్, ఉపేందర్ గౌడ్, దానయ్య సుమన్ ప్రసంగించారు. నేర్నాల కిషోర్, దండేపల్లి శ్రీనివాస్‌ల ఆటపాటలు సభికులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఒగ్గుడోలు, కొమ్ము నృత్యం, డప్పు తదితర కళారూపాలతో క్యాంపస్‌లో ర్యాలీ నిర్వహించారు. గోనె లింగరాజు తెలంగాణ సాయుధ పోరాట చిత్రాలను ప్రదర్శించారు. సభానంతరం తెలంగాణ వంటకాలతో ధావత్ నిర్వహించారు.
(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి