గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

సోమవారం, సెప్టెంబర్ 15, 2014

తెలంగాణ స్థలంలో ఆంధ్రాకు వాటాలా?

-రాష్ట్ర ఏర్పాటుకు ముందే నిధుల పంపిణీ.. జైళ్ల శాఖలో అడ్డంగా నిబంధనల అతిక్రమణ

రాష్ట్ర విభజనకు ముందు కొందరు సీమాంధ్ర అధికారులు వ్యవహరించిన తీరుతో తెలంగాణ జైళ్ల శాఖకు అన్యాయం జరిగింది. రాష్ట్ర ఏర్పాటుకు ముందే రెండు రాష్ర్టాలకు నిధులు పంచుతూ తీసుకున్న నిర్ణయం సర్వత్రా విస్మయానికి గురిచేస్తున్నది. ముషీరాబాద్ జైలును చర్లపల్లికి మార్చిన నాటి ప్రభుత్వం, 2000 సంవత్సరంలో ముషీరాబాద్ స్థలాన్ని గాంధీ దవాఖానకు అప్పగించింది. ముషీరాబాద్ ప్రధాన రహదారికి రెండు వైపులా జైలు స్థలం ఉండగా ఒక వైపు దవాఖానకు మరోవైపు ఎకరాకుపైగా ఉన్న స్థలాన్ని విద్యుత్ శాఖకు అప్పగించింది. విద్యుత్ శాఖకు స్థలాన్ని అప్పగించిన ప్రభుత్వం.. జైళ్ల శాఖకు ఎలాంటి ప్రత్యామ్నాయ స్థలం, నిధులు కానీ ఇవ్వలేదు. ప్రిజన్ డెవెలప్‌మెంట్ ఫండ్ కింద కొంత మొత్తాన్ని ఇచ్చేందుకు విద్యుత్ శాఖ చెల్లించాలని సూచించింది. ఈ విషయాన్ని అటు విద్యుత్ శాఖ...
ఇటు జైళ్ల శాఖ పూర్తిగా మరిచిపోయింది. ఫిబ్రవరి నెలల్లో పార్లమెంట్‌లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ప్రకటన రావడంతో.. పద్నాళ్లుగేళ్లుగా పెండింగ్‌లో ఉన్న జైళ్ల శాఖ నిధుల విషయాన్ని అధికారులు ఆదరాబాదరగా బయటకు తీశారు. అదే నెలలో విద్యుత్ శాఖ అధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి రూ. 7.5 కోట్లు ప్రిజన్ డెవెలప్‌మెంట్ ఫండ్ కింద ఇవ్వాలని నిర్ణయించారు. ఆ నిధులను తెలంగాణకు 48శాతం, ఆంధ్రాకు 52శాతంగా పంచారు. దీంతో రాష్ట్ర విభజనకు ముందే జైలు శాఖ అధికారులు నిధుల పంపిణీకి శ్రీకారం చుట్టారు. రాష్ట్ర విభజన నియమాల ప్రకారం ఏ ప్రాంతంలో ఆస్తులు ఆ రాష్ర్టానికే చెందుతాయి.. కానీ, జైలు శాఖ అధికారులు మాత్రం ఇవేవీ పట్టకుండానే నిధులను తరలించేశారు.

జైలుశాఖలో ఉన్నతాధికారులందరూ సీమాంధ్రకు చెందినవారు కావడంతో.. వారు అడిందే ఆట పాడిందే పాటగా సాగిందని, ఫలితంగానే తెలంగాణ జైళ్ల శాఖకు దక్కాల్సిన నిధులకు గండిపడిందని ఆరోపణలు విన్పిస్తున్నాయి. రాష్ట్ర జైలు శాఖకు జరిగిన అన్యాయంపై తెలంగాణ ప్రభుత్వం దర్యాప్తు చేపట్టాల్సిన అవసరం ఉందని తెలంగాణ అధికారులు పేర్కొంటున్నారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!     జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి