గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శుక్రవారం, సెప్టెంబర్ 12, 2014

ఆప్కోలో అక్రమాలపై దర్యాప్తు...!!!



ఆప్కోలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. నమస్తే తెలంగాణలో ప్రచురితమైన ఆప్కోలో "నిల్వ" దోపిడీ, వీఐపీ సేవలో తరిస్తున్న ఆప్కో వంటి కథనాలను పరిగణనలోకి తీసుకొని.. వస్త్ర నిల్వల్లో గోల్‌మాల్, ఉన్నతాధికారులకు ప్రత్యేక రాయితీల పేరుతో నిధుల స్వాహా...వంటి అంశాలపై దర్యాప్తుకు ఆదేశించింది. వారంల్లోపు క్షేత్ర స్థాయి పరిశీలన చేసి దర్యాప్తు నివేదిక సమర్పించాలని ఆప్కో మేనేజింగ్ డైరెక్టర్ జీ గౌరీశంకర్‌ను ఆదేశిస్తూ.. చేనేత, జౌళి శాఖ సంచాలకులు ఏ నర్సింగ్‌రావు గురువారం సర్క్యులర్ జారీ చేశారు. నర్సింగ్‌రావు గురువారం టీ మీడియాతో మాట్లాడుతూ..

నమస్తే తెలంగాణ దినపత్రికలో ప్రచురితమైన ఆప్కోలో నిల్వ దోపిడీ, వీఐపీ సేవలో తరిస్తున్న ఆప్కో వంటి కథనాలు ఆశ్చర్యానికి గురి చేశాయన్నారు. అందుకే వెంటనే దర్యాప్తు చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. నివేదిక సమర్పించిన తర్వాత అనుమానాలు నివృత్తి కాకపోతే తానే స్వయంగా క్షేత్ర స్థాయిలో తనిఖీలు చేపడుతానన్నారు. హైదరాబాద్‌లో కంటే కడపలో వస్త్ర నిల్వలు ఉంచే అవకాశమే లేదన్నారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, రాజకీయ నాయకులు, మంత్రుల కోసమంటూ ప్రత్యేక రాయితీలు ఇచ్చేందుకు నిబంధనలు అంగీకరించవని స్పష్టం చేశారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!     జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి