గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శుక్రవారం, సెప్టెంబర్ 19, 2014

భూ బదిలీ బూటకం...!!

-వాస్తవాలు విస్మరించి టీడీపీ గాయిగాయి
-మెట్రోకు కేటాయించిన భూమి ఎల్‌అండ్‌టీ వద్దే
-ప్రైవేటు కంపెనీకి ఇచ్చిన భూమికి దానికి సంబంధమే లేదు
-స్టాంప్ డ్యూటీ కూడా మినహాయించలేదు.. సర్దుబాటే
-కిరణ్ ప్రభుత్వ హయాంలోనే పూర్తయిన నిర్ణయాలు
-వాస్తవాలు దాచి.. బురదజల్లుతున్న టీడీపీ నేతలు
-టీడీపీ వ్యవహారంపై తెలంగాణవాదుల ఆగ్రహం
సమస్యలేకపోయినా సమస్య సృష్టించటం.. ఒకే అబద్ధాన్ని వందసార్లు చెప్పటం! ప్రభుత్వంపై బురదజల్లటమే ఏకైక పనిగా పెట్టుకున్న టీడీపీ నాయకులు.. వారికి వంతపాడే సీమాంధ్ర మీడియాకు ప్రస్తుతం ఈ రెండు అంశాలే ఎజెండాగా మారాయని తెలంగాణవాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


ఎల్‌అండ్‌టీకి మెట్రో రైలు నిర్మాణం నిమిత్తం కేటాయించిన భూమిని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదంటూ టీడీపీ నేతలు గాయిగాయి చేయడం, ప్రభుత్వంపై ఉద్దేశపూర్వకంగా బురదజల్లే ప్రయత్నమేనని వారు మండిపడుతున్నారు. నిజానికి సదరు ప్రైవేటు కంపెనీ వందల కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన భూమికి, మెట్రో రైలుకు కేటాయించిన భూమికి ఎలాంటి సంబంధం లేదు. అది వేరు, ఇది వేరు. సదరు కంపెనీకి ప్రత్యామ్నాయంగా ఇచ్చిన ప్లాట్లు వేరుగా ఉన్నాయి. అదే లేఅవుట్‌లో హైదరాబాద్ మెట్రో రైలుకు కేటాయించిన స్థలం అలాగే ఉంది. ముఖ్యంగా మెట్రో రైలుకు కేటాయించినది కేవలం 15 ఎకరాలు మాత్రమే. కానీ టీడీపీ నేతలు దానిని 31.35 ఎకరాలుగా అభివర్ణించడం విడ్డూరం.

అంతేకాదు స్టాంప్ డ్యూటీని ఆ కంపెనీ 2010లోనే అప్పటి ప్రభుత్వానికి చెల్లించింది. అదే మొత్తాన్ని ఇప్పుడు సర్దుబాటు చేశారు. ఇది తెలియని టీడీపీ నేతలు సదరు కంపెనీకి ప్రభుత్వం స్టాంప్‌డ్యూటీ మినహాయింపు ఇచ్చిందని ఆరోపిస్తున్నారు. నిజానికి ఈ నిర్ణయాలన్నీ కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలోనే పూర్తయ్యాయి.

అందుకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వ హయాంలో జీవోలు మాత్రమే వెలువడ్డాయి. కానీ టీడీపీ నాయకులు, సీమాం ధ్ర మీడియా దీన్నంతటినీ వక్రీకరించి, అసత్యాలతో ప్రజలను మభ్య పెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇదే విషయంలో స్పం దించిన హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డి.. శేరిలింగంపల్లి మండలం రాయదుర్గం గ్రామంలోని సర్వే నంబర్ 83/1లో 15 ఎకరాల భూమిని ప్రభుత్వం జీవోఎంఎస్ నంబర్123 (తేదీ 28.8.2012) ద్వారా మెట్రోరైల్ ప్రాజెక్టుకు కేటాయించిందని తెలిపారు. ఇప్పటికే ఈ భూమి ఎల్‌అండ్‌టీ స్వాధీనంలో ఉందని, నిర్మాణ పనులు కూడా నిర్వహించుకుంటున్నారని పేర్కొన్నారు. దీనిని ప్రైవే టు వ్యక్తులకు ఇవ్వడం అనే ప్రశ్నే తలెత్తబోదని స్ప ష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వంపై బురదజల్లేందుకే టీడీపీ నేతలు పనిగట్టుకుని మాట్లాడుతున్నారని టీఆర్‌ఎస్ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

ఇదీ జరిగింది..: రంగారెడ్డి జిల్లా శేరిలింగపల్లి మండ లం రాయదుర్గంలోని పన్మక్త గ్రామంలో సర్వే నంబ ర్ 83 అనేక రాళ్లతో నిండి ఉంది. ఈ సర్వే నంబర్ భూమిని 2003లోనే అప్పటి ప్రభుత్వం జీవో-4 ద్వారా వారసత్వరాళ్లు/ప్రాంగణంగా ప్రకటించింది. మరోవైపు ఈ భూమిపై ప్రభుత్వం-ప్రైవేటు వ్యక్తుల మధ్య టైటిల్ వివాదం నెలకొని, సుప్రీంకోర్టుదాకా వెళ్లింది. 2006లోని ప్రభుత్వం ఆ జీవోను, వివాదాన్ని విస్మరించింది. సర్వే నంబరు 83/1లోని 424.13 ఎకరాల్లో సమగ్ర ఐటీ పార్కు అభివృద్ధి చేసేందుకు ఆ భూమిని రెవెన్యూ శాఖ నుంచి ఏపీఐఐసీకి బదలాయిస్తూ జీవో 161 జారీ చేసింది.

గతంలోని జీవోను రద్దు చేయకుండా, కనీసం పరిగణలోనికి తీసుకోకుండానే అప్పటి ప్రభుత్వం హైదరాబా ద్ నాలెడ్జ్ సిటీ పేరిట అదే భూమిని ప్లాట్లుగా విభజించి, బహిరంగ వేలం పెట్టింది. 2007లో నిర్వహించిన ఈ వేలంలో వివిధ కంపెనీలు ప్లాట్లను కొ నుగోలు చేయగా ఏపీఐఐసీకి రూ.2వేల కోట్ల ఆదా యం వచ్చింది. దీనిని వెంటనే ఆ సంస్థ ప్రభుత్వ ఖాతాలో జమ చేసింది. అదే రోజు అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం ఆ మొత్తం నుంచి జలయజ్ఞంలో భాగంగా సీమాంధ్రలోని సాగునీటి ప్రాజెక్టులకు నిధులను కేటాయించింది. అంటే.. హైదరాబాద్‌లో అమ్మిన భూముల మొత్తాన్ని సీమాంధ్ర అభివృద్ధికి కేటాయించిందన్నమాట.

చివరకు ఈ భూమిపై సుప్రీంకోర్టులో ఉన్న వివాదం 2010లో పరిష్కారమైంది. తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చింది. అనేక పరిశీలనల తర్వాత 2013లో వేలం లో ప్లాట్లను కొనుగోలు చేసిన కంపెనీలకు ఏపీఐఐసీ రిజిస్ట్రేషన్ చేసింది. అంటే డబ్బులు చెల్లించిన ఆరేం డ్ల తర్వాత అధికారికంగా వారికి ప్లాట్లు దక్కాయి. ఇందులో భాగంగా ఒక కంపెనీ 31.35 ఎకరాలను బహిరంగ వేలం ద్వారా కొనుగోలు చేసింది. అందుకుగాను ప్రభుత్వానికి 2007లోనే రూ.613 కోట్లను (భూమి విలువ రూ.580 కోట్లు, స్టాంప్ డ్యూటీ కోసం మరో రూ.33 కోట్లు) చెల్లించింది.

2013లో రిజిస్ట్రేషన్ పూర్తి కావడంతో అందులో నిర్మాణాలు చేపట్టేందుకు జీహెచ్‌ఎంసీకి దరఖాస్తు చేసుకుంది. కానీ ఆ భూమిని వారసత్వ సంపదగా ప్రకటించి ఉన్నందున అనుమతి ఇచ్చేందుకు జీహెచ్‌ఎంసీ ని రాకరించి, దరఖాస్తులను పెండింగులో ఉంచింది. స్వయానా ప్రభుత్వమే అమ్మిన భూమిలో అనుమతి ఇవ్వకపోవడమేంటని పలు కంపెనీలు ఏపీఐఐసీని నిలదీశాయి. అక్కడి నుంచి సరైన సమాధానం లేకపోవడంతో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లాయి. దీంతో ఆయ న ఈ అంశంపై ఒక సాంకేతిక కమిటీతోపాటు నలుగురు ఐఏఎస్ అధికారులతో రెండు కమిటీలను వేసింది.

సదరు భూమిలో రెండు కంపెనీలకు చెంది న ప్లాట్లు మాత్రమే వారసత్వ సంపదగా ప్రకటించిన భూభాగంలోకి వస్తాయని ఆ కమిటీలు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చాయి. ఆ మేరకు ఏపీఐఐసీ మేనేజింగ్ డైరెక్టర్ ఆ రెండు కంపెనీలను పిలిచి, ప్రత్యామ్నాయంగా అదే లేఅవుట్‌లోని మరోచోట ప్లాట్లను తీసుకోవాల్సిందిగా సూచించారు. రెండింటిలో ఒక కంపె నీ ప్రత్యామ్నాయ ప్లాట్లకు అంగీకరించగా, మరో కంపెనీ కోర్టుకు వెళ్లింది.

ప్రత్యామ్నాయ ప్లాట్లను తీసుకునేందుకు ఒక కంపెనీ ముందుకు రావడంతో ఆ ప్రక్రియను పూర్తి చేయాల్సిందిగా అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, ఏపీఐఐసీని ఆదేశించారు. ఈ మేరకు ఏపీఐఐసీ ఆ కంపెనీకి ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రత్యామ్నాయ ప్లాట్లను కేటాయిస్తున్నట్లుగా లేఖ రాసింది. ఇదంతా జరిగే సరికి సార్వత్రిక ఎన్నికలు వచ్చాయి. ఎన్నికలు ముగిసి, తెలంగాణ ప్రభు త్వం ఏర్పడిన తర్వాత అదే అంశం ప్రస్తుత ప్రభు త్వం ముందుకొచ్చింది. గతంలో సాంకేతిక కమిటీ, ఐఏఎస్ అధికారుల కమిటీ తేల్చిన తర్వాత, అన్నీ ప రిశీలించిన తర్వాతే జరిగిన ప్రక్రియ కావడంతో అం దుకు అనుగుణంగా ప్రభుత్వం జీవో జారీ చేసింది.

హెచ్‌ఎంఆర్ కేటాయింపును ముట్టుకోవద్దన్న సీఎం
గత ప్రభుత్వ హయాంలోనే పూర్తయిన ప్రత్యామ్నాయ కేటాయింపులతో కొన్ని మార్పులు చోటుచేసుకున్నాయి. అందులో భాగంగా గేమ్ సిటీ, ఇతర త్రా పలు రకాల మార్పులు చేయాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. అయితే తమకు కేటాయించిన భూమిని ఎట్టి పరిస్థితుల్లో మార్చవద్దంటూ హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ ప్రభుత్వానికి నివేదించింది.

అందుకు సంబంధించిన కారణాలను కూడా ఆ లేఖలో పేర్కొంది. దీంతో సీఎం కేసీఆర్ ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ.. హెచ్‌ఎంఆర్ లిమిటెడ్‌కు కేటాయించిన స్థలా న్ని మార్చవద్దంటూ (సీ.నం. 1589/ఐపీఅండ్‌ఎన్‌ఎఫ్/ఎ2/2014) ఆదేశించా రు. దానిపై ముఖ్యమంత్రితోపాటు ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ కూడా సం తకం చేశారు. మెట్రో రైలుకు ఈ ప్రభుత్వం ప్రాధా న్యం ఇస్తున్న దరిమిలానే వాళ్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని ఈ సూచన చేశారు. కానీ టీడీపీ నేతలు మాత్రం ఇందుకు విరుద్ధంగా అసత్యాలను ప్రచారం చేస్తుండటం గమనార్హం.

గత ప్రభుత్వాల పాపమే
రాష్ట్ర ప్రభుత్వమే బహిరంగంగా నిర్వహించిన వేలంలో ప్రైవేటు కంపెనీలు భూములను కొనుగోలు చేశాయి. సర్కారుది కావడంతో ఎలాంటి ఇబ్బందులు ఉండవని అందరూ నమ్ముతారు. కానీ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి పాలకులకు ధన పిశాచి పట్టడంతో వివాదాలున్న భూములు, చివరకు వారసత్వ సంపద కింద ప్రకటించిన భూములను సైతం అడ్డంగా అమ్మేశారు.

సర్వేనంబర్ 83 భూమి వివాదంలో ప్రత్యామ్నాయ ప్లాట్లు తీసుకునేందుకు అంగీకరించని ఒక కంపెనీ తాను చెల్లించిన మొత్తాన్ని 18 శాతం వడ్డీతో సహా చెల్లించాలని డిమాండు చేస్తున్నది. ప్రత్యామ్నాయానికి అంగీకరించిన కంపెనీ కూడా ఇదే డిమాండ్ చేసి ఉంటే.. రాష్ట్ర సర్కారు ఏకంగా రూ.1708 కోట్లు చెల్లించాల్సి వచ్చేది. ఆ భారం తెలంగాణ సర్కారుపైనే పడేది.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)
                             జై తెలంగాణ!     జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి