గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

ఆదివారం, సెప్టెంబర్ 14, 2014

సీమాంధ్ర మీడియా పద్ధతి మారాలి...!!

-ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ సూచన
"ప్రత్యేక రా ష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా సీమాంధ్ర మీడియా పద్ధతి మార్చుకోకుండా తెలంగాణపై విషం చిమ్ముతూనే ఉన్నది. సమగ్ర సర్వే, భూ కబ్జాలపై చర్యలు తీసుకుంటే పనిగట్టుకొని విమర్శలు చేస్తున్నది" అని ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ మండిపడ్డారు. శనివారం గోదావరిఖని ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ రాష్ట్రంలో మీడియా-సవాళ్లు అంశంపై సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. 30 ఏండ్లుగా తెలంగాణకు అన్ని విధాలుగా సీమాంధ్ర మీడియా నష్టం చేసేలా పనిచేసిందన్నారు. 


narayanaపార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు పెట్టినా రాజ్యసభలో వీగిపోతుందని ప్రచారం చేసిందని ఆగ్రహించారు. సీమాంధ్ర పెట్టుబడిదారుల చేతుల్లోనే ఇన్నాళ్లూ పత్రికలు ఉండడం వల్ల వారి భావజాలం మనపై రుద్దారన్నారు. ఒక సీమాంధ్ర పెట్టుబడిదారుడు రూ.600 కోట్లతో అన్ని కలర్ పేజీలతో పత్రిక తెచ్చారని, దీంతో తెలంగాణకు చెందిన చిన్న పత్రికలు బతుకలేదన్నారు. నమస్తే తెలంగాణ మరో రెండు టీవీ చానెళ్లు మాత్రమే ధైర్యంగా మీడియా రంగంలోకి వచ్చాయన్నారు. గోదావరిఖని ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు మాదాసు రాంమూర్తి అధ్యక్షత వహించిన సమావేశంలో టీయూడబ్ల్యుజే నాయకులు పల్లె రవి, శ్రీశైలం, బల్మూరి విజయసింహారావు, తదితరులు పాల్గొన్నారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!     జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి