-చర్యకు పట్టుబడుతున్న విద్యార్థి సంఘాలు
-రేపటినుంచి ఆందోళన ఉద్ధృతం
రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కూడా సీమాంధ్ర ఉన్నతాధికారుల్లో తెలంగాణ విద్యార్థుల పట్ల అక్కసు తగ్గలేదు. ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్న తెలంగాణ విద్యార్థి రిఫరెన్స్ లేఖలో విషం చిమ్మిన సీమాంధ్ర హెచ్‌వోడీ ఘటన జేఎన్‌టీయూ హెచ్ పరిధిలో బయట పడింది. దీనికి కారణమైన హెచ్‌వోడీని సస్పెండ్ చేయాల్సిందేనని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
దీనిపై యూనివర్సిటీ వైస్‌ఛాన్స్‌లర్ రామేశ్వర్ రావు ముగ్గురు ఉన్నతాధికారులతో కమిటీ వేయడం సిగ్గుచేటని విద్యార్థులు చెప్తున్నారు. ఎమ్మెస్సీ పూర్తి చేసిన పూర్వ విద్యార్థి జీ కే మల్లారెడ్డి సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణుడయ్యాడని.. తెలుగు తప్ప మరోభాష తెలియదని సదరు హెచ్‌వోడీ శశికళ రిఫరెన్స్ లెటర్‌లో రాశారు. ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగానికి రిఫరెన్స్ లెటర్ అడిగితే ఇంత అక్కసు, దుర్బుద్ధి ఎందుకని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత కూడా విశ్వవిద్యాలయంలో సీమాంధ్ర అధికారుల ఆగడాలు కొనసాగిస్తున్నారని... అది శశికళ వ్యవహారశైలితో బయట పడిందని్...విద్యార్థులు, విద్యార్థి సంఘాల నేతలు అంటున్నారు. హెచ్‌వోడీ చర్యపై మండిపడిన విద్యార్థి సంఘాలు శనివారం జేఎన్‌టీయూ క్యాంపస్ వద్ద ఆందోళనకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆది, సోమవారాలు సెలవు కావడంతో మంగళవారం నుంచి భారీ ఆందోళన చేపడతామని విద్యార్థి సంఘాల నేతలు హెచ్చరించారు.
ఈఘటనతో సీమాంధ్ర అధికారులు తెలంగాణ విద్యార్థుల పట్ల వివక్ష ఏవిధంగా చూపుతున్నారన్న విషయం స్పష్టమైంది. ఇలాంటి హెచ్‌వోడీల వల్ల తెలంగాణ విద్యార్థుల మనోభావాలు దెబ్బతింటాయి. హెచ్‌వోడీ శశికళపై చర్యలు తీసుకునే వరకు ఉపేక్షించేది లేదు. ఇలాంటి వారిపట్ల కఠినంగా వ్యవహరించాల్సిందే.

తెలంగాణ విద్యార్థుల పట్ల వివక్ష
ఈఘటనతో సీమాంధ్ర అధికారులు తెలంగాణ విద్యార్థుల పట్ల వివక్ష ఏవిధంగా చూపుతున్నారన్న విషయం స్పష్టమైంది. ఇలాంటి హెచ్‌వోడీల వల్ల తెలంగాణ విద్యార్థుల మనోభావాలు దెబ్బతింటాయి. హెచ్‌వోడీ శశికళపై చర్యలు తీసుకునే వరకు ఉపేక్షించేది లేదు. ఇలాంటి వారిపట్ల కఠినంగా వ్యవహరించాల్సిందే.
-జేఎన్‍టీయూ తెలంగాణ జేఏసీ చైర్మన్ కరుణాకర్‍రెడ్డి
హెచ్‌వోడీ తీరు అవమానకరం
మల్లారెడ్డిపై కక్ష పూరితంగా విషం చిమ్మిన హెచ్‌వోడీ ఇంకా విధుల్లో ఉండడం అవమానకరం. రాష్ట్రం వచ్చినా అధికారులు, హెచ్‌వోడీలు విద్యార్థుల పట్ల కక్ష పూరితంగా వ్యవహరించడం సిగ్గుమాలిన చర్య. వీసీ వెంటనే శశికళను సస్పెండ్ చేయాలి. మంగళవారం నుంచి భారీ ఆందోళన చేపడతాం.
-బీ అశోక్‍గౌడ్, జేఎన్‍టీయూహెచ్ జేఏసీ ప్రెసిడెంట్
అవమాన పరిస్తే ఊరుకోం
ఈ సంఘటనను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునేలా విజ్ఞప్తి చేస్తాం. రాష్ట్రం వచ్చినా జేఎన్‌టీయూలో సీమాంధ్ర ఆధిపత్యం వారి ఆగడాలు కొనసాగుతూనే ఉన్నాయి. సామరస్యంగా వ్యవహరిస్తున్న తమపై కక్ష సాధింపు చర్యలకు దిగుతూ తెలంగాణ విద్యార్థుల పట్ల వారికున్న విషాన్ని చిమ్ముతున్నారు.
-ఓ మధు, జేఎన్‌టీయూహెచ్, టీఆర్‌ఎస్‌వీ అధ్యక్షుడు
(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి