గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

ఆదివారం, సెప్టెంబర్ 14, 2014

హైకోర్టులో తెలంగాణ ఫైళ్లు మాయం...!!

ఉద్యోగుల విభజనలో జాప్యం హైకోర్టులోని తెలంగాణ రాష్ట్ర అడ్వకేట్ జనరల్, ప్రభుత్వ న్యాయవాదుల కార్యాలయాలపై చూపుతున్నది. అరకొర సిబ్బందిలోనూ అధికశాతం సీమాంధ్ర వారే కావడంతో తెలంగాణ ప్రభుత్వ ప్రభుత్వ న్యాయవాదుల (జీపీ), సహాయ ప్రభుత్వ న్యాయవాదు( ఏజీపీ)ల కేసుల ఫైళ్లు దొరకడం లేదు. దీంతో ప్రభుత్వం కక్షిదారుగా ఉన్న కేసులను న్యాయస్థానం కొట్టివేసిన సంఘటనలు జరిగినట్లు సమాచారం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం.. హైకోర్టులో చేపట్టిన నియామకాల్లో 70 శాతం సీమాంధ్ర ఉద్యోగులే నియమితులు అయ్యారు. 

HIGH-COURTరాష్ట్ర విభజన జరిగినా ప్రస్తుత సిబ్బందినే తాత్కాలికంగా రెండు రాష్ర్టాల అడ్వకేట్ జనరల్స్, ప్రభుత్వ న్యాయవాదుల కార్యాలయాలకు కేటాయించారు. ఫలితంగా సరిపడా సిబ్బంది లేక సమస్యలు తలెత్తుతున్నాయి. ఇప్పటి వరకు ఒక ప్రభుత్వ న్యాయవాది కార్యాలయంలో పనిచేసే క్లర్క్, టైపిస్టు, ఆఫీస్‌బాయ్‌లు రెండు, మూడు కార్యాలయాలకు పనిచేయాల్సి వస్తున్నది. ఉద్యోగులంతా సీమాంధ్ర వారే కావడంతో తెలంగాణ ప్రభుత్వ న్యాయవాదులకు పూర్తి స్థాయిలో సహకారం లభించడం లేదని చెప్తున్నారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!     జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి