-"లంచమిస్తే చారానా-లేకుంటే బారానా"వార్తతో కదిలిన అధికారులు
-ఆయన అక్రమ వ్యవహారాలపై విచారణ
-ప్రాధాన్యంలేని పోస్టుకు తరలింపు
వాణిజ్య పన్నులశాఖలో లంచావతారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సీటీవో రవీంద్రనాథ్‌రెడ్డిపై రాష్ట్ర ప్రభుత్వం బదిలీవేటు పడింది. జూబ్లీహిల్స్ సీటీవో అయిన ఆయన అక్రమాలను వెలుగులోకి తెస్తూ "లంచమిస్తే చారానా-లేకుంటే బారానా" అన్న శీర్షికన ఆగస్టు 3న నమస్తే తెలంగాణ ప్రచురించిన కథనంతో అధికారులు స్పందించారు.-ఆయన అక్రమ వ్యవహారాలపై విచారణ
-ప్రాధాన్యంలేని పోస్టుకు తరలింపు
ఈ వ్యవహారంపై విచారణ జరిపిన వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ హీరాలాల్ సమారియా శుక్రవారం రవీంద్రనాథ్‌రెడ్డిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. ఆయనను ఫోకల్ పోస్టు నుంచి తొలగించి ప్రాధాన్యం లేని పోస్టుకు పంపారు. ఆయన స్థానంలో వరంగల్ నుంచి శ్రీనివాస్‌గౌడ్‌ను నియమించారు. కర్నూలుకు చెందిన వాణిజ్యపన్నుల అధికారి రవీంద్రనాథ్‌రెడ్డి హైదరాబాద్‌లో వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించేవారిని హడలెత్తిస్తున్నారని, లంచావతారమెత్తి విచక్షణారహితంగా షోకాజ్ నోటీసులు జారీచేస్తున్నారని నమస్తే తెలంగాణ వెలుగులోకి తెచ్చిన విషయం తెలిసిందే. వర్క్ కాంట్రాక్టర్లు, మ్యానుఫాక్చరర్స్, ట్రేడర్స్ ఆయన పేరు చెప్తే పారిపోయే పరిస్థితి నెలకొందని వివరించింది.
ఆయన మొదట అడ్డంగా పన్నులను బాది.. ఆ తర్వాత తన దారికొచ్చిన వారి నుంచి లంచాలు గుంజేవాడని, లంచం ఇవ్వడానికి నిరాకరిస్తే నిజాయితీగా పన్ను కట్టే వారికి భారీగా వడ్డింపులు వేస్తూ వేధించేవాడని వస్తున్న ఆరోపణలను బహిర్గతం చేసింది. పంజాగుట్ట డివిజన్ జూబ్లీహిల్స్ సర్కిల్‌లో పనిచేస్తున్న ఆయన ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ తన జేబులు నింపుకొని సర్కార్ ఖజానాకు గండి కొడుతున్న వైనాన్ని వివరించింది. కొన్ని కోట్ల రూపాయల్లో చేతివాటం ప్రదర్శించినట్లు రవీంద్రనాథ్‌రెడ్డిపై ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఉన్నతాధికారులు విచారణ జరిపి బదిలీవేటు వేశారు.
(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి