- తెలంగాణ సంస్థపై స్థానికేతరుల పెత్తనం
- అవినీతిపరులకు అందలం
- తెలంగాణ ఎండీకి సతాయింపులు
సీమాంధ్ర అధికారులు తెలంగాణలోని సంస్థలపై పెత్తనం సాగిస్తున్నారు.స్టేట్ రూరల్ ఇరిగేషన్ కార్పొరేషన్ ఆ అధికారుల గుప్పిట్లో విలవిలలాడుతున్నది. అక్రమార్కులు దోపిడీదారులకు అడ్డాగా మారిం ది. కొత్తగా పదవీ బాధ్యతలు తీసుకున్న చైర్మన్ కూడా ఆంధ్ర ప్రాంతానికి చెందిన పెత్తందారే కావడంతో సంస్థలోని సీమాంధ్ర అధికారులు మళ్లీ జూలు విదిలిస్తున్నారు. ఇప్పటికే అవినీతికి పాల్పడి సస్పెన్షన్‌కు గురైన సీమాంధ్ర ఉద్యోగులు కూడా మాయోపాయంతో తిరిగి విధుల్లో చేరాలని ఎత్తుగడలు వేస్తున్నారు. గతంలో నిధుల దుర్వినియోగం కేసులో సస్పెన్షన్‌కు గురైన ఈఈ ఒకరు ఇదే దారిలో పైరవీలు చేస్తున్నారు. వాస్తవానికి సదరు ఈఈ సస్పెన్షన్‌పైన న్యాయస్థానాలను ఆశ్రయించారు. - అవినీతిపరులకు అందలం
- తెలంగాణ ఎండీకి సతాయింపులు
-న్యాయస్థానంలో గ్యారెంటీగా తనకు అనుకూలంగా తీర్పు వస్తున్నదని చెప్పుకుంటూ చైర్మన్‌తో బేరాలకు దిగినట్టు జోరుగా ప్రచారం జరుగుతున్నది.
-కాంట్రాక్టర్లు చేయని పనులకు కూడా ఈయన రూ.19లక్షల నుంచి రూ.25లక్షల వరకు అవినీతి జరిపిన ఆరోపణలున్నాయి.
-అలాగే ఒక కాంట్రాక్టర్ చేసిన పనిని ఇంకొక కాంట్రాక్టర్ పేరుమీద రికార్డు చేసిన ఆరోపణలు కూడా ఉన్నాయి.
-గతంలో సహకారమంత్రిగా పనిచేసిన కాసుకృష్ణారెడ్డికి ఈయనపైన ఫిర్యాదులు వెల్లువెత్తాయి.
-అవి చాలవన్నట్టు సంస్థలో రూ.72లక్షలు ఇర్రెగ్యులర్ అడ్జెస్ట్‌మెంట్ చేసినట్లు విజిలెన్స్ డిపార్ట్‌మెంట్ అధికారులు ఏప్రిల్ 9న ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో పేర్కొన్నారు.
-గ్రామీణ నీటి పారుదల సంస్థ మాజీ ఛైర్మన్, ఈ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సీమాంధ్ర వారే కావడంతో ఇద్దరు కలిసి సంస్థను పీల్చిపిప్పి చేశారనే ఆరోపణలున్నాయి.
ఖర్చులు వద్దు బాబోయ్..ఈ సంస్థ ప్రభుత్వ నిధులతో కాకుండా సెల్ఫ్ ఫైనాన్స్‌తో నడుస్తుంది. ఆదాయం అంతంత మాత్రం. ఇక్కడ ఉద్యోగులకే జీతాలు లేని పరిస్థితి . ఇలాంటి పరిస్థితిలో తమపై ఛైర్మన్ ఖర్చులు కూడా రుద్దవద్దని ఆంధ్రప్రదేశ్ కో ఆపరేటివ్ రూరల్ ఇరిగేషన్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏపిఎస్‌సీఆర్‌ఐసీ)అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పీ శివశంకర్‌రెడ్డి, పీ రవిచంద్రరాజు ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వానికి అనేక మార్లు విజ్ఞప్తులు చేసుకున్నారు. అయినా అప్పటి ప్రభుత్వాలు పట్టించుకోలేదు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆగస్టు 11న మరో సారి విజ్ఞప్తి చేశారు.
ఇదిలా ఉంటే ప్రస్తుత ఎండీ తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తి కావడంతో సీమాంధ్రకు చెందిన ఛైర్మన్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు కూడబలుక్కొని ఎండీని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. సంస్థకు నిధులు లేకున్నా ఎండీ చొరవచేసి నిధులు సమకూర్చి పెండింగ్‌లో ఉన్న జీతాలు చెల్లించడం, రిటైర్డ్ అయిన ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు చెల్లించడం, మరణించిన ఉద్యోగుల వచ్చే బెనిఫిట్స్ అందజేయడం చూసి వారు భరించలేక వేధింపులకు పాల్పడుతున్నారని తెలంగాణ ఉద్యోగులు ఆరోపించారు.
(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి