నమస్తే తెలంగాణా పత్రికని ఆంధ్రాలో కేవలం ఒక్కరైనా చదువుతారా?
కానీ తెలంగాణాలో ఆంధ్రా పత్రికల్ని కొన్ని కోట్ల మంది చదువుతారు!
టీ న్యూస్ కానీ వీ6 కానీ ఆంధ్రాలో ఒక్క ఇంట్లో ఐనా ఈ చానల్స్ వొస్తాయా?
కానీ తెలంగాణలో ప్రతీ ఇంట్లో పదుల సంఖ్యలో ఆంధ్రా చానల్స్ వొస్తాయి!
ఆంధ్రాలో ఒక్కరంటే ఒక్కరైనా మన కే సీ ఆర్ కి గౌరవం ఇస్తారా?
అదే తెలంగాణాలో చంద్ర బాబు నాయుడిని కోట్ల మంది అభిమానిస్తారు!
ఆంధ్రాలో ఒక్కరైనా తెలంగాణా జాన పదాలు వింటారా? సంస్కృతిని గౌరవిస్తారా?
తెలంగాణాలో ఆంధ్రా సంస్కృతిని,ఆంధ్రా భోజనాలని కూడా గౌరవిస్తారు!
ఎంతో మంది ఆంధ్రా హీరో లకి తెలంగాణా ఒక గొప్ప జీవితాన్ని ఇచ్చింది!
కానీ ఒక్క ఆంధ్రా హీరో ఐనా ఏ ఒక్క రోజైనా తెలంగాణా ఉద్యమాన్ని సపోర్ట్ చేసాడా? కనీసం ఒక్కరు అయినా తెలంగాణా ఆకాంక్షని గౌరవించారా?
సపోర్ట్ చేయటం మాట అటుంచి తెలంగాణా ఉద్యమాన్ని తిట్టిన వాళ్ళే ఎక్కువ.
బతుకు ఇచ్చిన గడ్డని తిట్టిన గొప్పతనం చరిత్రలో వీళ్ళకే దక్కింది మరి!
తెలంగాణా ఉద్యమాన్ని తిట్టుకుంటూ. తెలంగాణా ప్రజల్ని అపహాస్యం చేస్తూ
ఎన్నో ఆంధ్రా చానల్స్ తెలంగాణా మీద ఆధార పడి బతికాయి. బతుకుతున్నాయి...ఉద్యమాన్ని అణిచి వేయటానికి విపరీతంగా ప్రయత్నించి...!
ఇప్పుడు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక కూడా రాళ్ళు వేసే బుద్ధి పొనిచ్చు కోకుండా ఇంకా మొరుగు తూనే ఉన్నాయి.
తిన్నింటి వాసాలు లెక్క పెట్టటం ఆంధ్రా మీడియాకి వెన్నతో పెట్టిన విద్య. అపరిమిత అజ్ఞానంతో పిచ్చి వాగుడుతో మళ్ళీ ఎలాగోలా తెలంగాణలో ఆంధ్రా చానల్స్ పునరుద్ధరణ కోసం అడ్డమైన దారులు ఎన్ని ఉన్నాయో అన్ని అడ్డమైన ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నాయి!
తెలంగాణా పత్రికలు...చానల్స్... పేరు వింటేనే ఆంధ్రా వాళ్లకి నచ్చదు!
అలాంటప్పుడు ఆంధ్రా పత్రికలు.TV లు మనకు ఎందుకు? అవసరం లేదు కదా...!!
మనల్నే తిడుతూ మనకే పత్రికలు అమ్ముతూ, మనమీదే జోకులు వేస్తూ మనకే చూపిస్తూ. మనమీదే ఆధార పడి బతుకుతూ. మనల్నే విమర్శించే ఈ ఆంధ్రా మీడియా మనకు అవసరమా...???!!!
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
5 కామెంట్‌లు:
హాట్సాఫ్ మిత్రమా!
హాట్సాఫ్ మిత్రమా!
స్పందించినందుకు ధన్యవాదాలు మిత్రమా!
నమస్తే తెలంగాణ పత్రికను గాని, T చానల్, V6 చానల్ వంటి తెలంగాణ చానల్స్ ని ఆంధ్రలో వ్యాప్తం కాకుండా అడ్డుకోవడం చాలా దుర్మార్గం. నమస్తే తెలంగాణ వారు ప్రచారానికి అక్కడ వెళితే కొట్టి పంపడం, పత్రికలను కాల్చివేయడం, తెలంగాణ చానల్స్ ని అక్కడ ప్రసారం కానీయకపోవడం వంటివి ప్రజాస్వామ్యాన్నే పరిహసించే సంఘటనలు. తెలంగాణ మీడియా మీడియా కాదా? వీటిని అడ్డుకున్నప్పుడు ఎక్కడ పోయింది మీడియా స్వేచ్చ?
ఇప్పుడు తెలంగాణ సమాజం, తెలంగాణను గౌరవించే మీడియాకే పట్టంకడుతున్నది. దానికి నిదర్శనమే తెలంగాణా చానెల్స్ కి పెరిగిన రేటింగ్, అలాగే నమస్తే తెలంగాణ పత్రికకి పెరిగిన సర్క్యులేషన్. ఇది రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉంది.
తెలంగాణ పత్రికలు, తెలంగాణ చానల్స్ లేనపుడు తమను హేళన చేస్తూ, కించపరుస్తూ, తమకే వ్యతిరేకంగా ప్రసారం చేస్తున్నా గత్యంతరంలేని పరిస్థితిలో తెలంగాణ ప్రజలు వాటిని పోషించడం జరిగింది. నమస్తే తెలంగాణ పత్రిక, T చానల్, V6 చానల్ వంటివి ప్రవేశించడంతో తెలంగాణలో వాటి ఆదరణ తగ్గింది, పరిస్థితిని గమనించిన తెలంగాణేతర పత్రికలూ, చానల్స్ కొన్ని తమ ధోరిణి మార్చుకున్నాయి. మనం ఉంటున్న నేలను గౌరవించడం, మనం తింటున్న ఉప్పుకు విశ్వాసం చూపించడం మానవులైన వారి ప్రథమ కర్తవ్యమ్.
ఈ సీమాంధ్ర మీడియా విశ్వాస హీనతకు, విశ్వాస ఘాతుకతకు స్పందించి వ్యాఖ్యరాసినందుకు ధన్యవాదాలు మిత్రమా!
కామెంట్‌ను పోస్ట్ చేయండి