-నమస్తే తెలంగాణ ఎఫెక్ట్
-కార్మికశాఖ రంగారెడ్డి డిప్యూటీ కమిషనర్‌పై అంతర్గత విచారణ
-వరంగల్ జేసీ ఇన్‌చార్జి బాధ్యతల నుంచి తొలగింపు
కార్మికశాఖలో అక్రమంగా తిష్ఠవేసిన రాయలసీమ ప్రాంత అధికారి ఆటలకు చెక్ పడింది. కార్మికశాఖ రంగారెడ్డి జిల్లా డిప్యూటీ కమిషనర్ నరేశ్‌కుమార్‌పై వచ్చిన ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం అంతర్గత విచారణకు ఆదేశించింది. వరంగల్ జాయింట్ కమిషనర్ ఇన్‌చార్జి బాధ్యతల నుంచి ఆయనను తొలగించింది. ఆయన స్థానంలో సీనియర్ అధికారి మోహన్‌బాబును నియమించారు.-కార్మికశాఖ రంగారెడ్డి డిప్యూటీ కమిషనర్‌పై అంతర్గత విచారణ
-వరంగల్ జేసీ ఇన్‌చార్జి బాధ్యతల నుంచి తొలగింపు
కార్మికశాఖలో అక్రమ అధికారి అన్న శీర్షికతో నమస్తే తెలంగాణలో ఈ నెల 22న ప్రచురితమైన కథనంపై ఉన్నతాధికారులు ఈమేరకు స్పందించారు. కార్మికశాఖలో రాయలసీమకు చెందిన నరేశ్‌కుమార్‌ది ఆడింది ఆటగా పాడింది పాటగా సాగుతున్నది. రంగారెడ్డి జిల్లా కార్మికశాఖ డిప్యూటీ కమిషనర్‌గా ఉన్న ఆయనకు తాజాగా వరంగల్ జాయింట్ కమిషనర్‌గా అదనపు ఇన్‌చార్జి బాధ్యతలుకూడా కేటాయించడం కార్మికశాఖలో కలకలం రేపింది. 11 మంది సీనియర్ అధికారులను కాదని, తెలంగాణకు చెందిన సీనియర్ అధికారులను పక్కనబెట్టి, ఒక జూనియర్‌ను, పైగా తెలంగాణేతరుని నియమించడంపై విమర్శలు వచ్చాయి.
నిబంధనలకు విరుద్ధంగా నరేశ్‌కుమార్‌కు ఇన్‌చార్జి బాధ్యతలు కట్టబెట్టడం.. అది కూడా తెలంగాణ కార్మికశాఖ మంత్రి ఆమోదం లేకుండానే జరిగిన విషయాన్ని నమస్తే తెలంగాణ వెల్లడించింది. దీనిపై తెలంగాణ రాష్ట్ర హోంశాఖ, కార్మిక మంత్రి నాయిని నర్సింహారెడ్డి స్పందించారు. అడ్డదారిలో పదోన్నతులను నిరోధించాలని, వెంటనే వరంగల్ జాయింట్ కమిషనర్ ఇన్‌చార్జిగా అర్హులను నియమించాలని నాయిని సూచించినట్లు సమాచారం. దీంతో ఉన్నతాధికారులు హడావుడిగా నరేశ్‌ను ఇన్‌చార్జి బాధ్యతల నుంచి తొలగించి..మోహన్‌బాబుకు ఆ బాధ్యతలను అప్పగించారు. నరేశ్‌పై వచ్చిన ఆరోపణలపై శాఖాపరమైన విచారణ జరుగుతున్నట్లు హోంమంత్రికి ఉన్నతాధికారులు తెలిపారు.
(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి