-న్యాయవాదుల జేఏసీ ఆగ్రహం
సాధారణ పెయింటర్‌గా ఉన్న రేవంత్‌రెడ్డి అనతికాలంలోనే రూ.వందల కోట్లు ఎలా సంపాదించారని న్యాయవాదుల జేఏసీ కో కన్వీనర్ కొంతం గోవర్ధన్‌రెడ్డి ప్రశ్నించారు. వనపర్తిలోని తమ మద్యం దుకాణానికి రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలోనే పెయింట్ వేయించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. పెయింటింగ్ వేసి రూ.కోట్లు సంపాదించే ఆ కిటుకేదో చెబితే పేదలంతా బాగుపడతారన్నారు.రేవంత్‌రెడ్డికి మానసిక చికిత్స చేయండి: సాధారణ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు ఇచ్చిన తీర్పుతో మానసికరోగిలా మారిన టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి సీఎం కేసీఆర్‌పై దుష్ప్రచారం చేస్తున్నాడని న్యాయవాదుల జేఏసీ నేతలు మండిపడ్డారు. రేవంత్‌రెడ్డికి మానసిక వికలాంగుల దవాఖానలో చికిత్స అందించాలని ఎర్రగడ్డలోని మానసిక వికలాంగుల దవాఖాన సూపరింటెండెంట్ ప్రమోద్‌కుమార్‌కు అడ్వకేట్ జేఏసీ కో కన్వీనర్ కొంతం గోవర్ధన్‌రెడ్డి, అధికారప్రతినిధి సీహెచ్ ఉపేంద్ర, పీ దేవరాజు, టీ శ్రీధర్‌రెడ్డి , పీ గోవర్ధన్‌రెడ్డి, భిక్షమయ్య, సదానందం వినతిపత్రం అందజేశారు.
(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి