గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శనివారం, సెప్టెంబర్ 13, 2014

ఎవడబ్బ సొమ్మని...

-ప్రభుత్వ భూమి దర్జాగా కబ్జా
-చక్రం తిప్పిన ఎమ్మార్వో చంద్రావతి
-పట్టించుకోని ఆర్డీవో హరీష్
-భూమిపై కోర్టులో కేసు ఉండగానే ఆక్రమణ
-రిటైర్డ్ పోలీస్ అధికారి శివానందరెడ్డి లీలలు
దొంగలు దొంగలు కలిసి ఊర్లు పంచుకున్న చందంగా సా గింది... హైదరాబాద్‌లో ప్రభుత్వ భూముల ఆక్రమణ. అదికారంలో ఉన్నాం కదా అని సీమాంధ్రకు చెందిన కబ్జాదారు లు తమవారితో కలిసి ఆడిందే ఆటగా వ్యవహరించారు. ఫలితంగా అడ్డూ, అదుపు లేకుండా ప్రభుత్వ భూములు దక్కించుకున్నారు. ఈ క్రమంలోనే సీమాంధ్రకు చెందిన ఓ మాజీ పోలీస్ అధికారి లగ్జరీ విల్లాల వెంచర్ కోసం వేయి గజాల ప్రభుత్వ భూమిని రోడ్డుగా మార్చేసుకున్నాడు. అప్పనంగా వచ్చిన ప్రభుత్వ భూమితో కోట్లు గడించేందుకు పక్కా పథకం రూపొందించుకున్నాడు. ప్రజలు శ్మశానవాటికకు వెళ్లేందుకు స్థలం ఇవ్వాలంటే కేటాయించని వలసపాలకు లు, తమ వారి కోసం మాత్రం రోడ్డు స్థలం దారాదత్తం చేశా రు. సీమాంధ్రకు చెందిన పాలకులు, అధికారులు వత్తాసు ఫలితంగా ప్రభుత్వ భూమి కబ్జాదారుల పరమయ్యింది.


roadహైదరాబాద్ జిల్లా గోల్కొండ మండలం పరిధిలోని పర్యాటక కేంద్రమైన తారామతి బారాదరి ముందు ఇబ్రహింబాగ్ గ్రామ రెవెన్యూ పరిధిలోని 178 సర్వే నెంబర్ లో ఏపీఐఐసీ 17 ఎకరాల 38 గుంటల ప్రభుత్వ భూమి ఉంది. 2009లో అప్పటి సీఎం దివంగత వైఎస్.రాజశేఖర్‌రెడ్డి ఈ స్థలాన్ని సినీ నిర్మాత సుభాష్‌ఘాయ్‌కు చెందిన విజిలింగ్ వుడ్స్ అంతర్జాతీయ సినిమా ఇనిస్టిట్యూట్‌కు లీజుకు ఇచ్చారు. లీజు అగ్రిమెంట్‌ను సవాల్ చేస్తూ ఒబె రా అనే వ్యక్తి హైకోర్టులో ప్రజాప్రయోజన వాజ్యం దాఖలు చేశాడు. స్పందించిన కోర్టు ఈ కేటాయింపుపై స్టే విధించింది. భూ వ్యవహారం ప్రస్తుతం కోర్టు విచారణలో ఉంది. అయితే వ్యవహారం కోర్టులో ఉండగానే అదనపు ఎస్పీగా పదవీ విరమణ చేసిన మాజీ పోలీస్ అధికారి, సీమాంధ్రకు చెందిన శివానందరెడ్డికి చెందిన వెసెల్లా విండోస్ సంస్థ వెంచర్‌కు దారి కోసం దాదాపుగా వేయి గజాల స్థలం ఆక్రమించుకునేలా చేశారు. 42 ఎకరాలలో నిర్మిస్తున్న వెంచర్‌లోకి జాతీయ రహదారి నుంచి నేరుగా చేరుకునేందుకు వీలుకలిగింది.

దొడ్డిదారిన వ్యవహారం

సీమాంధ్ర పాలకులు, అధికారుల లీలలు విచిత్రంగా ఉం టాయి. ఈ వ్యవహారం కూడా సీమాంధ్రుల వక్రబుద్ధికి చక్కగా సరిపోతుంది. సంబంధిత రోడ్డుకు కిలోమీటర్ దూరంలో ఉన్న శ్మశానవాటికకు రోడ్డు ఇవ్వాలంటూ అప్ప ట్లో గోల్కొండ ఎంఆర్‌ఓగా విధులు నిర్వహించిన చంద్రావతి ఉన్నతాధికారులకు లేఖ రాసి వ్యవహారాన్ని చక్కబెట్టారు. అయితే గతంలోనే ఇబ్రహీంబాగ్ గ్రామ పరిధిలోని దళిత ప్రజలు శ్మశానవాటికకు రోడ్డు స్థలం కేటాయించేలా చూడాలని గోల్కొండ రెవెన్యూ అధికారులకు విన్నవించారు. అయినా అధికారులు పట్టించుకోలే దు. అంతేకాకుండా సంబంధిత స్థలం ఏపీఐఐసీకి చెందిన స్థలంగా పేర్కొనడంతో పాటు ప్రస్తుతం వ్యవహారం కోర్టులో ఉం దంటూ తప్పించుకున్నారు. దీంతో చేసేది లేక గ్రామస్తులు మిన్నకుండిపోయారు. ఇదిలాఉండగా 2013లో సీమాంధ్రకు చెందిన మాజీ పో లీస్ అధికారి లగ్జరీ విల్లాల కోసం రోడ్డు స్థలం ఆక్రమణకు గురయ్యేలా వ్యవహరించడం విమర్శలకు తావిచ్చింది.

అడ్డుకున్న వీఆర్వో?

కోర్టులో కేసు ఉండగానే ప్రభుత్వ భూమి లో ఓ రియల్టర్ రోడ్డువేస్తున్న విషయం తెలుసుకున్న ఇబ్రహింబాగ్ వీఆర్వో సుదర్శన్ తహశీల్దార్‌కు లేఖ రాశాడు. దీంతో అప్పటి తహసీల్దార్ చంద్రావతి చర్యలు తీసుకుంటామంటూ దాటవేశారు. అంతేకాకుండా పెద్దల వ్యవహారంలో ఎందుకు తలదూర్చుతున్నారంటూ వీఆర్వో, ఆర్‌ఐలకు పరోక్ష హెచ్చరికలు జారీ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. కబ్జా విషయం అప్పటి హైదరాబాద్ ఆర్డీవో హరీష్‌కు తెలిసినా పట్టనట్లుగా వ్యవహరించారు. దీంతో మరోమారు వీఆర్వో సుదర్శన్ తహసీల్దార్‌కు లేఖ రాశాడు.

కబ్జా భాగోతం బయటపడుతుందనుకున్న అధికారులు ఓ వ్యవహారాన్ని సృష్టించి సంబంధిత వీఆర్వోను బదిలీ చేసినట్లు సమాచారం. వివిధ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంబంధిత తహసీల్దార్ చంద్రావతి గతంలో జారీ చేసిస చార్జిమెమో తీసుకోకపోవడంతో శుక్రవారం మరో చార్జిమెమో జారీ చేశారు. జిల్లా కలెక్టర్ ముఖేష్‌కుమార్ మీనా జారీ చేసిన ఆదేశాలను సైతం దిక్కరించడం చర్చనీయాంశంగా మారింది. సీనియర్ ఐఏఎస్ అధికారుల అండదండలతోనే ఆమె ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు కలెక్టరేట్‌లో చర్చజరుగుతోంది. ఇప్పటికైనా తెలంగాణ సీఎం స్పందించి ఆక్రమణకు గురైన భూమిని స్వాధీనం చేసుకోవాలని, సంబంధిత అధికారులపై చర్యలు చేపట్టాలని తెలంగాణవాదులు కోరుతున్నారు.

(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)

జై తెలంగాణ!     జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి