తెలంగాణ పట్ల సీమాంధ్రుల విద్వేషం మరోసారి బయటపడింది. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం తెలంగాణ అంతటా ఉద్యమం జరుగుతున్న సమయంలో గుంటూరులో ప్రజాస్వామిక వాదులను సమీకరించిన తెలంగాణ అధికారిని సీమాంధ్ర అధికారులు లక్ష్యంగా చేసుకున్నారు. మరో 24 గంటల్లో సొంత రాష్ర్టానికి బదిలీపై వెళతారనగా ఏసీబీ అధికారులు ఆయన్ను వెంటాడారు. గుంటూరు జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌గా పని చేస్తున్న ధరావత్ హనుమంత్ నాయక్.. తెలంగాణ గ్రూప్ వన్ అధికారుల సంఘం ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. తనను బదిలీ చేయాలని కలెక్టర్‌కు అర్జీ పెట్టుకుంటే తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శిగా బదిలీ చేస్తూ ఉత్తర్వులిచ్చారు. కానీ రిలీవింగ్ ప్రక్రియ పూర్తి చేయడానికి మంగళవారం కలవమని కలెక్టర్ సూచించారు. దీంతో గతంలో సకల జనుల సమ్మె సమయంలోనూ దాడి చేసిన సీమాంధ్రులు సోమవారం రాత్రి ఆయన్ను వెంటాడారు.
గుంటూరు నర్సింగ్ కళాశాలల యజమానులు కొందరు ఆయన ఇంటికెళ్లి, హనుమంత్‌నాయక్‌నే లోపలికి తోసుకెళ్లారు. పెనుగులాటలో కంటికి గాయమైనా వదల్లేదు. బలవంతంగా డబ్బులున్న సూట్‌కేసు చేతుల్లో పెట్టి, ఆయన్ను కదలకుండా చేశారు. తర్వాత కొద్ది నిముషాల్లో అంటే అర్థరాత్రి 11 గంటలకు రంగ ప్రవేశం చేసిన ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు చూపి అరెస్ట్ చేసేశారు. అంతే శరవేగంగా రిమాండ్‌పై పంపారు. గ్రూప్ వన్ అధికారుల సంఘం ప్రధాన కార్యదర్శి హనుమంతనాయక్‌పై ఏసీబీ అధికారులు దాడి చేసి రిమాండ్‌పై పంపడం అక్రమం, అప్రజాస్వామికమని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం కోదండరామ్ స్పష్టం చేశారు. ఏపీసీఎం చంద్రబాబు దీనిపై దృష్టి సారించి న్యాయ విచారణ జరుపాలని డిమాండ్ చేశారు. హనుమంత్‌నాయక్ అరెస్ట్‌ను టీఎన్జీవో నేతలు దేవీప్రసాద్, కారెం రవీందర్‌రెడ్డి, టీ ఉద్యోగ సంఘాల జేఏసీ అధ్యక్షుడు సీ విఠల్, గ్రూప్ వన్ అధికారుల సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్‌గౌడ్, టీజీవో అధ్యక్షురాలు మమత, టీజీవో ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ నాల్గో తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు గడ్డం జ్ఞానేశ్వర్, టీ గిరిజన ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు రామచంద్రనాయక్, టీ కేంద్ర ప్రభుత్వోద్యోగుల సంఘం నేత మల్లిఖార్జున్, టీఎన్జీఓ నగర అధ్యక్షుడు కే వెంకటేశ్వర్లు, హైదరాబాద్ జిల్లా ఉద్యోగ సంఘాల జేఏసీ నేత ముజీబ్ తదితరులు ఖండించారు.
హనుమంతనాయక్‌పై దాడి ఘటన, పూర్వాపరాలను ప్రభుత్వ ప్రధానకార్యదర్శి రాజీవ్‌శర్మతో చర్చిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీనిచ్చారు. ఏపీ రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో చర్చించాలని ఆయనకు సూచిస్తామని తెలిపారు. దాడి ఘటనను సీఎం మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే వీ శ్రీనివాస్‌గౌడ్ దృష్టికి తెచ్చారు.

సీఎఎస్‌తో మాట్లాడతా: శ్రీనివాస్‌గౌడ్‌కు సీఎం హామీ
హనుమంతనాయక్‌పై దాడి ఘటన, పూర్వాపరాలను ప్రభుత్వ ప్రధానకార్యదర్శి రాజీవ్‌శర్మతో చర్చిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీనిచ్చారు. ఏపీ రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో చర్చించాలని ఆయనకు సూచిస్తామని తెలిపారు. దాడి ఘటనను సీఎం మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే వీ శ్రీనివాస్‌గౌడ్ దృష్టికి తెచ్చారు.
(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)
జై తెలంగాణ! జై జై తెలంగాణ!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి