గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

ఆదివారం, సెప్టెంబర్ 28, 2014

ట్యాంక్‌బండ్‌పై కొండా లక్షణ్ ’బాపూజీ’ విగ్రహం పెట్టిస్తాం...!!!

 
-అక్కడ అవసరం లేనివి తీసేస్తం.. లారీలో ఆంధ్రాకు పంపిస్తం
-జగమెరిగిన మహానేత లక్ష్మణ్‌బాపూజీ
-తెలంగాణ కోసం తొలి పదవీత్యాగం చేసిన మహనీయుడు
-జలదృశ్యం కూల్చిన పాపం చంద్రబాబుదే
-దానిని సమీక్షించి.. చిరస్మరణీయం చేస్తాం
-త్వరలో చేనేత అభివృద్ధి కోసం అఖిలపక్ష సమావేశం
-బాపూజీ విగ్రహావిష్కరణ సభలో సీఎం కే చంద్రశేఖర్‌రావు
‘తెలంగాణ కోసం ప్రాణమున్నంతకాలం తపించి పోరాడిన మహనీయుడు.. తొలి పదవీ త్యాగం కూడా ఆయనదే. 1969లోనే మంత్రి పదవిని తృణప్రాయమనుకున్నడు. ఆచార్య కొండా లక్ష్మణ్‌బాపూజీ జగమెరిగిన మహానేత’ అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కొనియాడారు. రాష్ట్రంలో యూనివర్సిటీకో, లేదంటే ఏదైనా గొప్ప సంస్థకో ఆ మహానుభావుడి పేరు పెట్టి భావితరాలకు గుర్తుండిపోయేటట్లు చేస్తం అని సీఎం ప్రకటించారు. కొండా లక్ష్మణ్‌బాపూజీ 99వ జయంతి ఉత్సవాల్లో భాగంగా శనివారం సాయంత్రం హైదరాబాద్‌లోని పద్మశాలి భవన్ ముందు ఆయన నిలువెత్తు విగ్రహాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. బాపూజీ విగ్రహాన్ని ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అక్కడున్న అవసరం లేని వ్యక్తుల విగ్రహాలను తీసేస్తామన్నారు. వాటిని లారీల్లో తెలంగాణ ప్రభుత్వమే ఆంధ్రాకు తరలిస్తుందన్నారు.
chandraదానికి టీడీపీ మిత్రపక్షమైన బీజేపీ కూడా కలిసి రావాలని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. చేనేత కార్మికుల ఆకలిచావులు కొనసాగుతుండటం బాధాకరమన్నారు. అందుకే త్వరలోనే అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించి, ఆ తర్వాత కార్యాచరణను కొండా లక్ష్మణ్‌బాపూజీ మిషన్‌గా నామకరణం చేసి అమలు చేస్తామని ప్రకటించారు. వచ్చే ఏడాది బాపూజీ శతజయంతివేడుకల సందర్భంగా ప్రతి నెలా కార్యక్రమాలు ఉండేటట్లుగా అధికారికంగా నిర్వహిస్తామన్నారు. ‘అందరూ ఉద్యమం 2001లో పుట్టిందంటారు.. కానీ 2000లోనే తెలంగాణ ఐక్యవేదిక పేరిట ప్రొఫెసర్ జయశంకర్, కొండా లక్ష్మణ్‌బాపూజీల సారథ్యంలో జలదృశ్యంలోనే పని మొదలుపెట్టారు’ అని సీఎం కేసీఆర్ గుర్తుచేశారు. ’ఆ తర్వాత ఏడాది పాటు 3, 4 వేల గంటల చర్చలు జరిగాయి. అప్పుడే టీఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భావానికి పునాదులు పడ్డాయి’ అని వివరించారు. ఇదంతా కొండా లక్ష్మణ్‌బాపూజీ ఆశీస్సులతోనే జరిగిందన్నారు. ‘కర్కోటకుడైన ముఖ్యమంత్రి ఉన్న సమయంలోనే పార్టీని ఏర్పాటు చేశాం. అప్పట్లో ఆంధ్రా పత్రికలు, ఆంధ్రా మీడియా, మా అడుగు ముందుకు పడనియ్యలేదు. మా పార్టీకి కిరాయికి ఇల్లు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. సీఎం కార్యాలయం నుంచే బెదిరింపులు వచ్చేవి ’ అని చెప్పారు. ’చంద్రబాబునాయుడు జలదృశ్యంపై దాడి చేయించాడు.. మా పార్టీకి సంబంధించిన ఫర్నీచర్‌ను, కంప్యూటర్లను బయట పడేయించిండు. ఇప్పుడు జలదృశ్యంపై సమీక్ష జరుపుతం.. బాపూజీని చిరస్మరణీయుడిని చేసేందుకు అవసరమైన అన్ని చర్యలను చేపడుత’మని సీఎం హామీ ఇచ్చారు. రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు మాట్లాడుతూ, ’కేసీఆర్ తెలంగాణ రథసారథి, తెలంగాణ సాధకుడైతే, బాపూజీ తెలంగాణ స్వాప్నికుడు, తెలంగాణ సాధనలో భాగం’ అని కొనియాడారు.

రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనంద్‌భాస్కర్ మాట్లాడుతూ ప్రజాప్రతినిధి అంటే ఇలా ఉండాలని నిరూపించిన వ్యక్తి బాపూజీ అని కొనియాడారు. ఎంపీ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ బాపూజీ విగ్రహాన్ని ట్యాంక్‌బండ్‌పై పెట్టాలని, అధికారికంగా జయంతి వేడుకలు నిర్వహించాలని కోరారు.


(నమస్తే తెలంగాణ దినపత్రిక సౌజన్యంతో)


జై తెలంగాణ!     జై జై తెలంగాణ!

2 కామెంట్‌లు:

మఠం మల్లిఖార్జున స్వామి చెప్పారు...

ఆంధ్రా మొత్తం భూతద్దం పెట్టి వెతికినా ఒక్క తెలంగాణ మహా వ్యక్తి విగ్రహం కనిపించదు. అదే తెలంగాణలో కుప్పలు తెప్పలుగా ఆంధ్రా నాయకుల విగ్రహాలు ఎక్కడ బడితే అక్కడ పెట్టారు. తెలంగాణలో ఏ ఒక్క మహా వ్యక్తి లేడా? తెలంగాణ వారు ఆంధ్రకు అవసరం లేనపుడు ఆంధ్ర వారి విగ్రహాలు తెలంగాణలో ఎందుకు పెట్టుకుని దండలు వేసి దండాలు పెట్టి పూజించాలి? సమానత పాటించి ఉంటే ఈ తీసివేతలు - కూడికలు ముందుకు వచ్చేవి కాదు. ఒక సమాజాన్నే వివక్షతకు గురిచేసినపుడు ఆ సమాజంలో ఇలాంటి భావం ఏర్పడటం సహజమే.

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

నిజం చెప్పారు స్వామిగారూ! కేసీఆర్‍గారి మాటల సారాంశం కూడా అదే. మన మహోన్నతులు వారికి కనపడనప్పుడు వారి మహాత్ములు మనకెందుకు కనులముందుండాలి? మనకు అక్కరకురాని వాళ్ళ విగ్రహాల్ని వాళ్ళదగ్గరికే పంపుదామంటున్నారు మన ముఖ్యమంత్రిగారు. మన మహనీయులను వివక్షకు గురిచేయడం సహింపరానిది. వాళ్ళు ఈ విషయంలో సమత్వం చూపలేదు. అందుకే ఈ కూడికలు, తీసివేతలు అనడం సబబే. ధన్యవాదాలు. స్వస్తి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి