గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

మంగళవారం, డిసెంబర్ 24, 2013

వగల ప్రేమలు చాలు...


బ్రతిమిలాడిన కొలఁదియుఁ బైఁకిఁ బోవు
చుండ్రి సీమాంధ్ర నేతలు చోద్యముగను!
మీ సమైక్యాంధ్రలో నిప్డు మేము కలమె?
స్వార్థపరులయ్య మీరలు స్వార్థపరులు!!

మీ నీలము మా పీవీ
యిద్దరు ఘనులైనవారె!
నీలముఁ దలపై నిడుకొని,
పీవీని మఱతురేలా?

కచ్చితమ్ముగ నిది కుట్ర కాదె? నిన్న
పీవి వర్థంతి వేడ్కను విస్మరించి,
నీలము జయంతి వేడ్కల నిట్లు సేయ
మమ్ము హేళన సేయుటే సుమ్మిదోయి!

తన్మహాత్ముని యేదేని జన్మదినము
జరిపితిరె వేడ్కగా మీరు? సంస్కృతి యిదె?
ఆ మహాత్మునికి జయంతి యంత ఘనము!
యీ మహాత్ముని వర్థంతి యింత వెగటె?

మీ "సమైక్యత" యిట్టిది! మీవి వగల
మాటలేనోయి! జిహ్వాగ్రమందు సుధలు
గుఱియు మాటలు! హృదయాన ఘోర విషము
దాచుకొన్నట్టి మీర లధర్మపరులు!!

ఇట్టి మీతోడ నింక మేమిట్టు లిచటఁ
గలసియుండినఁ గలవు దుఃఖములు మిగుల!
చాలు, చాలోయి మాటలు! స్పష్టమాయె
నిన్న జరిగిన ఘటనతో! నీది నటనె!!

జై తెలంగాణ! జై జై తెలంగాణ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి