గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

బుధవారం, అక్టోబర్ 09, 2013

నా తెలంగాణ సోదరా, నమ్మకుమయ!


*
"నాకుఁ దెలగాణ నిచ్చెడు, నాపెడు బల
మేమియును లేదు! మీ సెంటిమెంటు నేను
గౌరవింతు" నటంచును కమ్మఁగాను
బలికి, యిపుడిట్టి దీక్షఁ జేపట్టినట్టి
రెండు నాల్కల జగను దుర్నీతి తోడ,
దోచుకొనఁ గోరి పలికెడు దుష్ట వాక్కు
నా తెలంగాణ సోదరా నమ్మకుమయ! (1)

*
"ఆత్మ బలిదాన మెంతయు నార్తి దాయ
కమ్ము! బాసచేసి, యనెదఁ గాంక్షతోడ,
నింక బలిదానములు వల, దిచ్చటఁ దెల
గాణమును బలయుక్తనుగా నొనర్తు!
సోదరుల్లార! తెలగాణ సువిదితమగు
కాంక్ష నెప్పుడు నే నెద గారవింతు"
ననియు శర్మిల యా నాఁడు నమ్మఁ బలికి,
నేఁడు దీనిఁ "బాకిస్తా" ననెడి విధమున,
దోచుకొనఁ గోరి పలికెడు దుష్ట వాక్కు
నా తెలంగాణ సోదరా నమ్మకుమయ! (2)


*
పదవి కొఱకయి మామనే వంచనమున
పదవి వీడఁ జేసినయట్టి బాబు నాఁడు,
"బిల్లు పెట్ట, మద్దతు నిత్తు వేగ సభ" న
టంచుఁ బల్కి, తెలంగాణ వంచకుఁ డయి,
కేంద్ర మిడఁగా, విభేదించి, కీడు సలిపె!
సీటు కోసము చెప్పిన మాట తప్పి,
మోసగించంగఁ జూచెడు వేసగాఁడు;
రెండు కండ్ల సిద్ధాంత సుప్రీతుఁడైన
బాబు దీక్షల, మాటలఁ బరిగణించి,
నా తెలంగాణ సోదరా, నమ్మకుమయ! (3)

*
బ్రతుకు నిచ్చిన కాంగ్రెస్సు బాట నడ్డి,
సొంత లాభమ్ము కోసమై, సొంత జనులఁ
జింతలనుఁ ద్రోయఁగా సాహసించియుఁ, దెల
గాణమును తుంగలోనఁ ద్రొక్కఁగాను దలఁచి,
కుటిల కృతముల నుద్యమ నటకుఁడైన
నల్లికుట్టుల నల్లారి నయ విరహిత
చేష్టలను , వాక్కులను దెలిసి తెలిసి, యిఁక
నా తెలంగాణ సోదరా, నమ్మకుమయ! (4)

*
నీదు మార్గమ్ము తెలగాణ; నీతి, రీతి,
ఖ్యాతి తెలగాణ; మంత్రమ్ము, ఆశయమ్మ
దియ తెలంగాణ; ధర్మమ్ముఁ దిరుగ నీఁక,
న్యాయమునుఁ దప్పనీఁక;సహాయము నిడి,
సహనమునుఁ బూని, తెలగాణ సాధనమున
నెంద ఱడ్డము వచ్చిన; నెవరు నింద
సేసిన; విని, వినని వాని వేసముఁ గొని,
మన "తెలంగాణ రాష్ట్రమ్ము" మనకు దక్కు
దనుక, మోసకారుల బాస తలను నిడక,
యెల్ల వేళల నప్రమత్తోల్లమునను
రాష్ట్ర సాధనా లక్ష్యమ్ముఁ గ్రాలుచుండఁ,
గృత్యములఁ జేయఁగాను రాష్ట్రేప్సితమ్ము
త్వరితముగ నెఱవేఱు! నీ తపన తీరు!!
గాన, నిన్నిప్పు  డుడికించఁ గాను బూను
దుష్ట దుర్మార్గ దుర్నీత దుర్మదాంధ
భాషణము లెప్పుడును నీవు వలచి వలచి,
నా తెలంగాణ సోదరా, నమ్మకుమయ! (5)

జై తెలంగాణ! జై జై తెలంగాణ!

6 కామెంట్‌లు:

Mandhubabu చెప్పారు...

excellent sir.

మఠం మల్లిఖార్జున స్వామి చెప్పారు...

తెలంగాణా ప్రజల నమ్మకాన్ని వారు ఏనాడో పోగొట్టుకున్నారు, రేప్పొద్దున్న ఎలక్షన్లు వస్తే తెలంగాణాలో డిపాజిట్లు కూడా దక్కవని వారికి తెలిసి పోయింది. ఇక మిగిలింది సీమంద్రయే - అందుకే అక్కడి వారిని ఆకర్షించడానికి నానా తంటాలు పడుతున్నారు. అయినా సీమంద్రులు వీళ్ళని పట్టించుకోవటంలేదు - మీరే లేఖలిచ్చారు ఈ విభజనకు మీరే భాద్యులు అంటున్నారు. మొత్తానికి రెంటికీ చెడ్డ రేవడిలా అయింది. అదే వారి బాధ. వారి మానాన వారిని వెళ్ళనీ, వీరి దీక్షల వలన ఒరిగేది-జరిగేది శూన్యం. వారి మనసులో ఏమి పెట్టుకుని ఇచ్చినా - తెలంగాణాకు సపోర్ట్ గా ఉత్తరాలు ఇచ్చినందుకైనా వారికి కృతజ్ఞతలు చెప్పుకుందాం. వీళ్ళు ఇచ్చిన లేఖలకు కట్టుబడి ఉంటె తెలంగాణా వాళ్ళు నెత్తిన పెట్టుకుని రేప్పొద్దున్న కొందరినైనా గెలిపించేవారు - మాట తప్పారు.

అజ్ఞాత చెప్పారు...

ఏడుపుగొట్టు, అసుయా, ద్వెషాలతొ రగిలిన తెలబాన్లు, పక్కవాడి ఉన్నతిని ఓర్వలేని సోమరులు లాడెన్ క చ రా గాడి రాక్షస సంతతి కలిసి చేసిన దొంగ వుద్యమం పక్కవాడి కష్ట పలాన్ని తేరగ దొచుకునే గుంట నక్కలు ఈ తెలబన్ టెర్రరిష్టులు కలియుగమందు కానము ఈ రక్త పిసాచులను పోలిన నర రూప రాక్షషులు. జిన్నా కూడా దిగదుడుపే. ఆంధ్రుల రక్తాని పీల్చిన ఈ జలగల రక్త దాహం ఇంక తీర్లేదు కాబోలు విషం కక్కుతు, ద్వెషం విరజల్లుతు బుసలు కొడుతున్నయి ఈ తెలబాన్ విష నాగులు.

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

ఓయీ అజ్ఞానాంచిత నామక అజ్ఞాతా! నీ మాటలు నీకే వర్తిస్తాయని గుర్తుంచుకో, ఎందుకంటే తెలంగాణను దోచుకుతిన్నదీ, తెలంగాణ వాళ్ళ రక్తాన్ని జలగల్లా పీల్చిందీ మీరే! అరవై ఏళ్ళుగా ఇదే జరుగుతోందిక్కడ! పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ, నన్నెవరూ చూడటం లేదనుకొందిట. మీ బాగోతం ఎవరికి తెలియదు? పైగా ఉల్టా బదలాయింపులు! చేసిందంతా చేసి, మీ దుశ్చర్యల్ని మాకంటగట్టడం మీకే చెల్లింది. ఇక ముందు చెల్లదని గుర్తుంచుకో. మమ్మల్ని తెలబాన్‍లంటున్న మిమ్మల్నేమనలి? అజ్ఞానంతో విషం కక్కడం మాని, రాబోయే కొత్త రాష్ట్రానికి ఏమేం కావాలో ఆలోచించుకో. పుణ్యం, పురుషార్థం దక్కుతాయి. లేకపోతే కేంద్రమే తనకు తోచిందేదో చేస్తుంది. మేం మీ శ్రేయోభిలాషులం. ఇన్ని మాట లంటున్నా మాకు మీపై కోపం, ద్వేషం లాంటివి కలగడం లేదు. జాలి కలుగుతోంది. ఈ పిచ్చిరాతలు ఇకనైనా మానుకొని బుద్ధిగా ఉండు.

అజ్ఞాత చెప్పారు...

వాల్లేమి చెప్తరు సార్? వాల్ల మొకం. వాల్లు ఏడుపుగొట్టు, అసుయా, ద్వేషాలతో రగిలిన సీమపందులు, అంధా రాక్షసులు, పక్కవాడి ఉన్నతిని ఓర్వలేని సోమరులు, పెట్టుబడి దారీ రాక్షస మూక, అవకాశవాద మూతినాకుళ్ళ లత్కోర్ నాయకులు కలిసి చేసిన దొంగ వుద్యమం. పక్కవాడి కష్ట పలాన్ని తేరగ దొచుకునే గుంట నక్కలు. ఈ దొంగ ఉద్యమ టెర్రరిష్టులు. కలియుగమందు కానము ఈ రక్త పిశాచులను పోలిన నర రూప రాక్షసులను. ఈ రాక్షసులముందు. జిన్నా కూడా దిగదుడుపే. తెలంగాణ వాళ్ళ రక్తాన్ని పీల్చిన ఈ జలగల రక్త దాహం ఇంక తీర్లేదు కాబోలు, విషం కక్కుతూ, ద్వేషం విరజిమ్ముతూ బుసలు కొడుతున్నయి ఈ సీమపందులు, అంధా రాక్షస విష నాగులు.

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

వాళ్ళను మనం ఏమీ అనవలసిన పని లేదు> వాళ్ళను ప్రోత్సహించేవారు వారి వెనుక ఉండి దొంగ ఉద్యమం నడిపిస్తున్నారు. వాళ్ళు అమాయకులు. తెలివైనవాళ్ళయితే ఇలా అసమంజసమైన కృత్రిమ ఉద్యమం ఎలా నడిపిస్తారు? మనం వాళ్ళననటం మాని, మన తెలంగాణ రాష్ట్రసాధన సాకారం అయ్యేట్టు నడుచుకోవాలి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి