గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

మంగళవారం, ఫిబ్రవరి 18, 2014

తెలంగాణ అఖండ విజయం!!


అరువదేండ్ల తెలంగాణ
కల సాకారమ్మాయెను!
కేంద్ర మిపుడు పూనినట్టి
కార్యమ్మేనెరవేరెను!!

సీమాంధ్రులు సృష్టించిన
ఆటంకము లధిగమించి,
తెలంగాణ లక్ష్యముగా
విజయము సాధించెనుగా!

స్వేచ్ఛాకాశమ్ములోన
హృదయము తేలుచునున్నది!
మానస మానందముతో
పరవశించిపోతున్నది!!

కష్టాలే కడతేరెను!
దోపిడులే దూరమాయె!
తెలంగాణ కడ్డొచ్చిన
ఆటంకాల్ తొలగిపోయె!!

నేడే మన తెలగాణకు
నిజముగ స్వాతంత్ర్యమబ్బె!
బానిస సంకెళ్ళు తొలగి,
తెలగాణుల మేనులుబ్బె!!

ఇది అఖండవిజయమ్మయ!
ఉద్యమాల ఫలితమ్మయ!
సకల జనులు కోరినట్టి
స్వేచ్ఛాయుత తెలగాణయ!!

ఇదియె సకల తెలగాణులు
ఎత్తిన జయ కేతనమ్ము!
ఇదియె అధర్మమ్ము పైన
ధర్మ విజయమే సుమ్ము!!

ఇది అమరుల త్యాగఫలము!
అరువదేండ్ల తపఃఫలము!
మన బంగరు తెలంగాణ!
కలలుగన్న తెలంగాణ!!

తెలగాణకు స్వేచ్ఛనిడిన
కేంద్రమునకు కృతజ్ఞతలు!
విజయమునకు ఊతమిడిన
నేతల కివె కృతజ్ఞతలు!!

జై తెలంగాణ!    జై జై తెలంగాణ!

10 కామెంట్‌లు:

Unknown చెప్పారు...

jai telanagana

Jai Gottimukkala చెప్పారు...

Congratulations sir!

Prasanth చెప్పారు...

congrats.. But I feel it is not Akhanda Vijayam

Unknown చెప్పారు...

మాస్టారూ, శుభాకాంక్షలు. ఇకనైనా మీరు తిట్ల దండకం ఆపుతారని ఆశిస్తున్నాను. మీశ్సక్తి తెలంగాణా అభివృద్ది మీద చూపండి.

శ్రీరామ

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

జై జై తెలంగాణ!

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

ధన్యవాదాలు గొట్టిముక్కలవారూ! మీకూ నా శుభాకాంక్షలు! అందుకోండి.

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

పూర్తి మెజారిటీతో నెగ్గిన బిల్లును అఖండం విజయం పొందిందనక మరేమనాలి? మీరు అఖండవిజయంగా అనుభూతి చెందకుండటం మీకు సంబంధించిన విషయం. మాకు సంబంధం లేదు. అరవై ఏళ్ళ కల సాకారం కావడమే అఖండం అని నేను నమ్ముతున్నాను. బిల్లు పాస్ కావడమే గగనంగా మారిన తరుణంలో, ఆటంకాలు అధిగమించి అధిక మెజారిటీతో నెగ్గడం అఖండమే! మీ సమ్మతి మాకనవసరం.

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

మాటమాటకు తప్పులు వెదకేవాళ్ళకు ’రామ’అన్నా బూతుగానే వినబడుతుంది. నేను ఎవర్నీ తిట్టలేదు. ఆక్షేపించాను, వాళ్ళ తప్పుల్ని దుయ్యబట్టాను. తప్పు చేసిన వాడి గుణగణాలను అభివర్ణించాను. ఎంత అనర్హుడో తెలియజేశాను. నేను చేసింది సరియైన పద్ధతిలోనే చేశాను. మీరు వ్యంగ్యంగా నన్ను విమర్శించాల్సిన అవసరంలేదు. సీమాంధ్రులు తెలంగాణ వాళ్ళను ఎన్ని దుర్భాషలాడారో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. సీమాంధ్ర బ్లాగుల్లో తెలంగాణుల్ని తెలబాన్‍లనీ..గోచీగాళ్ళనీ..ఇంకా అనేక పదాలతో... అసభ్యపదజాలంతో పిలిచి, వెక్కిరించి,...పైశాచికానందం అనుభవించారు. మేం అలా కాదు. ఒకరిని అనే ముందు తామెంతటివారో ఆలోచించాలి. "తప్పు లెన్ను వారు తమతప్పు లెఱుగరు..."!

మీ శుభాకాంక్షలకు, మీ సలహాకు ధన్యవాదాలు!

మా తెలంగాణ అభివృద్ధిలో మా ప్రణాళికలు మాకున్నాయి. వేరొకరి సలహాలు అవసరముండవనే అనుకుంటాను. మీ సలహా అవసరమైతే మీకు కబురుపెడతాను.

డా.ఆచార్య ఫణీంద్ర చెప్పారు...

Jai Telangana!!!

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

జై జై తెలంగాణ! ఫణీంద్రగారికి తెలంగాణ అఖండవిజయ శుభాకాంక్షలు!

కామెంట్‌ను పోస్ట్ చేయండి