గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

ఆదివారం, సెప్టెంబర్ 29, 2013

నా తెలంగాణ జనభేరి!



“హైదరాబాదు తెలగాణదౌ” నటంచు
వచ్చిరే పది జిల్లాల ప్రజలు కదలి
యా నిజాం కళాశాల గ్రౌండ్స్ నందు నిండ!
సకల తెలగాణ జనభేరి సాక్ష్య మిదియె!! (1)

పెట్టుఁడీ బిల్లు పార్లమెంట్ చట్ట సభను
వేగమే” యంచుఁ దెలగాణ సాఁగి వచ్చి
నినద మెత్తెను గొంతెత్తి వినఁగ ఢిల్లి!
సకల తెలగాణ జనభేరి సాక్ష్య మిదియె!! (2)

కడుపు మండిన వార లిక్కడను నుండ్రి;
వేగఁ దెలగాణ రాష్ట్రమ్ము నీఁగదెయని!
కడుపు నిండిన వార లక్కడను నుండ్రి;
హైదరాబాదు దోఁచఁగా నద నిదెయని!
మండు వారికి శత్రు లీ నిండు వారె!
సకల తెలగాణ జనభేరి సాక్ష్య మిదియె!! (3)

ఆత్మ బలిదాన మిడిరి సహస్ర వీర
జనులుకాంక్షమై తెలగాణ జనులు నిటను
వచ్చి రంజలి ఘటియింపఁ బరుగు లిడుచు!
సకల తెలగాణ జనభేరి సాక్ష్య మిదియె!! (4)

రాష్ట్ర మీయంగఁ బ్రకటించఁ బ్రభుత యచట;
దాని నడ్డుకొనిన యాంధ్ర దౌష్ట్య యుతుల
చేష్ట ఖండింపఁగాఁ బ్రజల్ చేరి రిచట!
సకల తెలగాణ జనభేరి సాక్ష్య మిదియె!! (5)

మా తెలంగాణ నాయక మాన్యుల నవ
మాన పఱుపంగఁ దగదనిమానహీను
లైన సీమాంధ్రులకుఁ దెల్పఁగానిచటికిఁ
దరలి వచ్చిరి తెలగాణ వర జనులును!
సకల తెలగాణ జనభేరి సాక్ష్య మిదియె!! (6)

ఆ దినేశుని దౌష్ట్యమ్ము లాగడములు
సాఁగవను తీర్పు వినియువిచార మెడల
సంతసమ్మున గొంతెత్తి వంత పాడఁ
బరుగులెత్తి వచ్చిరి జనుల్ ప్రబలు రయ్యు!
సకల తెలగాణ జనభేరి సాక్ష్య మిదియె!! (7)

మా తెలంగాణ రాష్ట్రమ్ము మా కిడుఁడన,
మూర్ఖ బుద్ధియౌ కిరణుండు ముఖ్యమంత్రి
పదవి నడ్డము పెట్టియు వదరుచుండఁ,
ద్రిప్పి కొట్టంగ వచ్చిరి యిప్పు డిటకు
పది జిలాల ప్రజలు వేగ పడుచు మిగుల!
సకల తెలగాణ జనభేరి సాక్ష్య మిదియె!! (8)

ఆంధ్రలోఁ గొన్ని వర్గమ్ము లడ్డుపడఁగ;
బడుగు బహుజన వర్గాల ప్రజలు ప్రబల
ముగనుతెలగాణ రాష్ట్ర మీయఁగను గోర,
వారి నణచు క్రూరుల పని పట్ట నెంచి,
యిటకుఁ దరలి వచ్చిరి జను లీ విధముగ!
సకల తెలగాణ జనభేరి సాక్ష్య మిదియె!! (9)

మా తెలంగాణ రాష్ట్రమ్ము మా బలమున
సత్వరమ్ముగ నేర్పడున్సకల జనులు
సంతసింతురుజేజేల సంతస నిన
దమ్ములు తెలగాణ జనులు తఱచి తఱచి
చేతురని తెలుపఁగను వచ్చిరయ యిటకు!
సకల తెలగాణ జనభేరి సాక్ష్య మిదియె!! (10)

8 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

Sir., nenu khachhitam mee blog chustanu.... kani, mamulu bhasha lo raste bagunti ani naa chinna suggestion... endu kante nenu vere vallaki cheppalanna, ee blog chupinchalanna koddiga ibbamdi avutundi.... Hope you understand....Jai Telangana....

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

చూడండి అజ్ఞాతగారూ! మీరన్నది నిజమే. పద్యం అంటేనే భాష గ్రాంథికంలో ఉండాలనే నియమంతో ఉంటుంది. దానికి వ్యాకరణపు కట్టుబాట్లుంటాయి. నేను సాధ్యమైనంత వరకు మామూలుగా అర్థం అయ్యే భాషలోనే, చిన్న పద్యాలలో రాస్తున్నాను. సందర్భాన్నిబట్టి కొన్ని పదాల్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. మీ సలహాను పాటించి ఇంకా సరళమైన భాషలో రాయడానికి ప్రయత్నిస్తాను. పద్యాలలోని భావాలపై మీ అభిప్రాయాన్ని తెలుపుతుండగలరు. దాశరథిగారి బాటే నా బాట! జై తెలంగాణ! జై జై తెలంగాణ!!

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

కుసంస్కారులకు, పిచ్చి రాతలు రాసేవారికి ఈ బ్లాగు తలుపులు మూసివుంటాయి! సంస్కారవంతమైన భాషతో, మమకారంతో స్పందించే వీక్షకులకు, పాఠకులకు, వ్యాఖ్యాతలకు ఈ బ్లాగు స్వాగతం పలుకుతున్నది.

అజ్ఞాత చెప్పారు...

మంచి పద్యాలు . మంచి భావాలు . జై తెలంగాణ జై జై తెలంగాణ

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

మిత్రమా! మీ అభిమానానికి చాలా సంతోషం. మీ వంటి వారి ప్రోత్సాహమే నాకు మరింత ఉత్సాహాన్నిస్తుంది! ధన్యవాదాలతో....

జై తెలంగాణ! జై జై తెలంగాణ!!

Mandhubabu చెప్పారు...

jai telanganaa..

manaku medhaavulu.. telugu telisina vallu lerani evo evo kuthalu kusaaaru.

mee lanti okkaru chaalu sir,

saralmgaa raase vallu entho mandhi unnarru.

meeru ide vidhaanamulo continue cheyandi.

jai telangana.

hatsoff to u sir...

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

ధన్యవాదాలు అజ్ఞాతగారూ! మీ అభిమానానికి కృతజ్ఞతలు. బ్లాగును ఇలాగే చూస్తూ ప్రోత్సహిస్తుంటే చాలు. నేను మరిన్ని మంచి భావాలతో పద్యాలు రాయగలను. స్వస్తి.

జై తెలంగాణ! జై జై తెలంగాణ!!

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

మధుబాబుగారూ! మన్నించండి. ఫొటో లేక పోయేసరికి, మిమ్మల్ని అజ్ఞాతగా భావించి, సంబోధించాను. ఐయామ్ వెరీ వెరీ సారీ.

కామెంట్‌ను పోస్ట్ చేయండి