గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

బుధవారం, జనవరి 01, 2014

నవ్యాంగ్ల వత్సరాది శుభాకాంక్షలు!!రెండు వేల పద్నాలుగు శ్రేయము లిడు!
రెండు వేల పద్నాలుగు ప్రేమఁ బంచు!
రెండు వేల పద్నాల్గు రాష్ట్రేప్సితమును
దీర్చి, తెలగాణ రాష్ట్రానఁ దేజరిల్లు!!

సకల జనులిట సంతోష సౌఖ్యములను
బొంది, వెలిఁగెడుఁ గావుత పూర్ణముగను!
శాంతిఁ బంచుత తెలుఁగు రాష్ట్రద్వయమున!
స్వేచ్ఛనొసఁగుత, యభివృద్ధి వేగ నిడుత!!

ఆయురారోగ్యభోగభాగ్యైహికములు
సకలశుభముల నొసఁగియు, సౌమ్యత నిడ,
నవ్య రాష్ట్రమ్మునం దెలంగాణ జనులు
శుభము లీప్సితములుఁ బొంది, శోభఁ గనుత!!

జై తెలంగాణ!   జై జై తెలంగాణ!

3 కామెంట్‌లు:

Unknown చెప్పారు...

ji telangana
wishes to all telangana and indians
wishes a new year 2014

regards
anchuri gopal
faculty computers and software engineer
hanuaam nagar,hanamkonda
warangal
phone: 8185944713
orugallu academy
www.123warangal.net

Unknown చెప్పారు...

we have to work more on eduaiton and halth care the eduaiton fee is high
lot of members not goiding higer educaiton and helath care and farmere education
also iimparatnat
regards
Anchuri Gopal
Asst Proffessor computers and software engineer
india youth congress member
http://iyc.in/sns/pg/candidateprofile/profile/1078704
founder oruallu academy
www.123warangal.net
hanumaan nagar,hanamkonda,warangal
email: orugalluacademy@gmail.com
phone: 8185944713
ji bharath ji telangana

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

గోపాల్ గారూ, ఈ బ్లాగును మీ సైటులో ఇలా ఉంచగలరు.

www.ratnaalaveena.blogspot.in

ఇలా ఉంచినచో, హోం లోనికి వెళ్ళి అన్ని పోస్టులూ చూడవచ్చును.

కామెంట్‌ను పోస్ట్ చేయండి