గమనిక:

ఈ బ్లాగులోని టపాలకు పెట్టే వ్యాఖ్యల్లో అసభ్య, అశ్లీల, అపఖ్యాతికర, దూషణ, విరుద్ధ, చట్టవ్యతిరేక, వివాదాస్పద, హానికర, అవహేళనాత్మక వ్యాఖ్యలు రాసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మనవి. దయచేసి గమనించగలరు.
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

బుధవారం, నవంబర్ 06, 2013

మేం తెలబానుల మైతే...మీరు తెలబాన్ధ్రులు కారా? (1)

మా తెలంగాణ రాష్ట్రమ్ము మాకు నిడఁగఁ
గోరు వారలన్ వేర్పాటుఁ గోరు వార
లంచుఁ, దీవ్రవాదు లటంచు ననఁగ నేల?

మొదటి వేర్పాటు వాదులు గదయ మీరు!
నాఁడు మద్రాసు సఖ్యమ్ము నూడఁ బెఱికి,
వేఱు రాష్ట్రమ్ము నిడఁగానుఁ గోరి రెవరు?
తీవ్రముగ నుద్యమించిన దెవ రదెవరు?

మమ్ము తెలబాను లనఁగ మే మగుదు మెట్లు?
మొదటి తెలబాన్ధ్రులే మీరు! మురువకుఁ డయ!

ఒక్క ప్యూను జాబునకయి నిక్కి నీల్గి,
యాగి చేసితి రయ్య మీ యాంధ్రు లపుడు!
సభలు చేసియు, నిందించి, జాలి లేక,
యాంధ్ర రాష్ట్ర మేర్పాటె ధ్యేయ మ్మటంచు,
నుద్యమమ్ము నడిపినది యోర్వలేని
యాంధ్రులరు కాదె? మదరాసు నాంధ్ర దనుచుఁ
గోరి యుద్యమించిన యట్టి వార లెవరు?

మమ్ముఁ దెలబాను లందురే? మమ్ము దోచి,
యెఱుఁగ నట్టున్న తెలబాన్ధ్రు లీరు కారె?

దొంగయే "దొంగ..దొంగరో..దొంగ" యనుచుఁ
బరుగుఁ దీయంగ...దొంగయే దొరగ నగునె?
యిచటి వెన్నియో దోచియు, నెఱుఁగ నట్లు,
మమ్ముఁ దెలబాను లనఁగానె మాయునె యవి?

మీరు చేసిన శృంగారమే యదౌనె?
మేము చేసిన వ్యభిచారమే యిదౌనె?
నోరు మూయుఁడు! నవ్వియుఁ బోరె? మీర
లింక వగల మాటలు మానుఁ డిట్టి తఱిని!!


జై తెలంగాణ!        జై జై తెలంగాణ!!


11 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

మనలో మనం తిట్టుకోవడం లో చాలా పురగతి సాధించామండి. ఇలాంటి పద్యాల వల్ల, తెలుగు ఖ్యాతి ఇంకా ప్రజ్వరిల్లుతుంది.. ధన్యవాదాలు.

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

అజ్ఞాతగారూ! తమరు తేది:21-10-2013 నాటి ఆకాశరామన్న బ్లాగును చూడండి. పోస్టు మరియు వ్యాఖ్యలు ఎలా ఉన్నాయో? బాగా చదివి, (ముఖ్యంగా మమ్మల్ని వేర్పాటు {తీవ్ర} వాదులు, తెలబాన్‍లు అన్న రచయితతో సహా) తిట్టిన వారికి గడ్డి పెట్టి, నా బ్లాగు రచన ననండి. నేనేం తిట్టలేదే? మాటకు సరియైన సమాధాన మిచ్చా. అంతే. నిజాలు మాట్లాడితే నిష్ఠూరాలాడినట్టుందా? ఏం చేస్తాం...ఉన్నదున్నట్టు అనకూడదు. మేం ఏమైనా చేస్తాం...అంటాం ...పడండి...! అనే మనస్తత్వం సీమాంధ్రుల కున్నప్పుడు...మేం ఎంతకని పడతాం? పిల్లిని ఇంట్లో బంధించి, కొడుతుంటే...తిరగబడదా? మేం పిల్లికన్నా పనికిరానివాళ్ళామా? మాటంటే పడేది లేదు. మీది తెలుగు ఖ్యాతి కావచ్చు. మాది తెలంగాణ ఖ్యాతి. మీకూ మాకూ పొత్తే లేదు...పోలికే లేదు.

స్పందించినందుకు కృతజ్ఞతలు.

అజ్ఞాత చెప్పారు...

Nuvvu super ra babu :)

అజ్ఞాత చెప్పారు...

ha ha goonda moddusudan telabans are telabans. maatalu mukkaluga vidagotti raasi adi padyamantae elaa? pakkodi meeda padi edavadamae telaban character.

shayi చెప్పారు...

ఇప్పుడు దోపిడి చేసారనగానే తెగ బాధపడిపోయి, నీతులు వల్లించే ఈ స’మెక్కు’సాలెగాళ్ళు మనను ’తెలబానులు’ అంటూ దశాబ్ద కాలంగా నిందించినప్పుడు మనమెంత కుమిలిపోయామో ఆలోచించారా? అప్పుడు ఈ నీతులు వల్లించేవారు ఏ పాయఖానలలో పడుకొన్నారు? ఆనాడు రజాకారులు మనను పీడించారు. ఇప్పుడు వీరు. అందుకే వీళ్ళను ’ఆంజాకారులు’ అనడం సబబు.

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

పేరు కూడా చెప్పుకోడానికి భయపడే, వెనుకాడే అనామకుడవు అయి కూడా ఇలా తెలిసే తెలియకుండా విషం కక్కుతూ తిడుతున్నావంటే...నీ స్వభావం ఏమిటొ...తెలుస్తోంది. నన్ను...goonda moddusudan telaban...అని తిడుతున్నా వంటే...నేను రాసిన కారణాలు సక్రమమైనవైనా...నేను రాసినవి పద్యాలే ఐనా...పద్యాలు కావంటూ తిడు తున్నా వంటే...నీ సంస్కారాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? వాదించడం చేతగాక...తిట్లపురాణం చదవడం మీకు చేతనైనంత మాకు చేతకాదు. ఆడలేక మద్దెల ఓడన్నట్టు, నువ్వు వెధవ వేషాలు వేసి, నన్ను ఇలా వెకిలిగా తిట్టడం బాగా లేదు. అసలైన తెలబాన్ధ్రుల్లాగ మాట్లాడుతున్నావు. నేను చెప్పిందీ ఇదే తెలబాన్ధ్రుడా! నేను సకారణంగా అంటే, నీవు అకారణంగా అంటున్నావ్. ఇదే తేడా మీకూ మాకూ...

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

కొందరు అక్కసుతో, అసహనంతో విషం కక్కుతున్నారు! అదే పదజాలం! "తెలబాన్"లు అని. ఇందులో చెప్పిన నిజాల్ని ఖండించడానికి తగిన ఆధారాలతో చర్చించాలి గానీ, తిట్ల పురాణం శోభనీయదని మనవి చేస్తున్నాను. తిట్లతో విషం కక్కడానికైతే..మీ వ్యాఖ్యలు మా కనవసరం. న్యాయమైన మార్గంలో రండి. మే మన్న దానిలో తప్పుంటే చర్చించండి..మనుషుల్లా ప్రవర్తించండి. పశువుల్లా మారకండి. మీలాంటి వాళ్ళ ప్రవర్తన వలననే మేం ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుతున్నా మన్నది గుర్తుంచుకోండి. అదే ప్రవర్తనైతే మేం తిప్పికొట్టక తప్పదని మనవి చేస్తున్నాను.

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

బాగా సెలవిచ్చారు పన్నగ శాయిగారూ! స్పందించినందుకు ధన్యవాదాలు. ధర్మమేవ జయతే, సత్యమేవ జయతే, న్యాయమేవ జయతే...తెలంగాణైవ జయతే...

Unknown చెప్పారు...

తెలంగాణా రాష్ట్రం ఏర్పడబోతున్నదన్న ఉక్రోషంతో,ఆక్రోశంతో చేస్తున్న వ్యాఖ్యల గూర్చి పట్టించుకోనక్కరలేదు!

Anil చెప్పారు...

ఈ మధ్య జరిగిన సేవ్ ఆంధ్ర సమావేశంలో వక్తలు మాట్లాడిన విధానం వారు మాట్లాడిన విషయం పూర్తిగా అసంబద్దం. వాక్చాతుర్యం ప్రదర్సిన్హతమే తప్ప వారు మాట్లాడిన దాంట్లో ఏవిధంగానూ తర్కానికి నిలబడే అవకాసం లేదు. తమ్ముడి ఇంటికి వస్తే భోజనం కూడా పెట్టలేదని యాగి చేసిన విధానం చూస్తే ఏదోవిధంగా తమ్ముడిని దుర్మార్గుడిగా చిత్రీకరించే ప్రయత్నమే తప్ప కుటుంబ గౌరవం కాపాడే ఉద్దేశం కనిపించలేదు.
అక్కగా భోజనం చేయటానికి తమ్ముడి ఇంటికి వచ్చావ లేక తమ్ముడి కుటుంబాన్ని బ్రష్టు పట్టించటానికి వచ్చావో అర్థం కావటం లేదు. అశోక చక్రవర్తిలా యుద్ధం చేసి మారణ హోమం సృస్టించటానికి సిద్ధపడ్డారు.తమ్ముడిని చంపేసి దురాక్రమణ చేయటానికి, అహంకారం తప్ప అభిమానం లేదని చాటిచేప్పుకోవతనిక్ ,స్వార్ధం తప్ప అభిమానం లేదని నిరూపించుకోవటానికి ప్రయత్నిచారే తప్ప మానవత్వం వున్నా మనుషులుగా ప్రవర్తించలేదు. లక్షల మందిని చంపి చివరికి అశోకుడు సాధించింది యెమిలెదనె విషయాన్నీ మర్చిపోయారు. అశోకుడు తన తప్పు తెలుసుకొని కుమిలిపోయడనే విషయాన్ని గుర్తిన్చుకోలేదు.
ప్రధాన మంత్రిని కర్ణుడితో , కృష్ణ కమిషన్ ని కృష్ణుడితో పోల్చిన వారు ఒక విషయాన్నీ మర్చిపోయారు. కృష్ణుడు పాండవులకు రాయబారిగా అప్పుడు వచ్చినా ఇప్పుడు మాత్రం కౌరవుల తరఫున వచ్చాడని తెలుసుకుంటే బాగుండేది. ప్రేమపూర్వకంగా అక్కయ్య లాగా మాట్లాడుతున్నానని చెబుతూ ద్రౌపది లాగ ప్రవర్తించటం ఏవిధంగా సమర్ధనీయమో అర్థం కాదు.
హైదరాబాద్ అందరిది మాకు హక్కువుంది అని చెబుతున్నవారు ఏ హైదరాబాద్ గురించి మాటలడుతున్నారో స్పష్టంగా చెబితే బాగుండేది. పొరుగువారితో సఖ్యంగా వుండే సహజ సిద్ధ స్వభావంతో తమ భూభాగాన్ని పంచుకున్న నల్గొండ, మెదక్, మహబూబ్నగర్, సికింద్రాబాద్ తదితర జిల్లాల వారి పరిస్థితి ఏమిటి.? వారి భూభాగాన్ని వాళ్లకి తిరిగి ఇవ్వాళా అఖరలేదా? ఇవ్వకపోతే వాళ్ళు ఊరుకుంటారా? ఇవ్వకుండా వుండటం న్యాయమేనా? మనది కానిది ఎవరో ఇచ్చినది ఎవరైనా ఎలా హక్కుదారు ఔతారు?
మేము పెట్టుబడి పెట్టి అభివృద్ధి చేసాము మా రక్తం ధారపోసము అంటున్నారు. అందుకని మాకు హక్కు వుంది అని వాదిస్తున్న వాళ్ళు మనసోమ్ముతో మన శ్రమతో అభివృద్ధి ఐన లండన్ నగరాన్ని ఎందుకు అడగటం లేదో చెప్పాలి.ఆంధ్ర ఉద్యోగస్తులు వెనక్కి వెళ్ళిపోతే పిల్లల పరిస్థితి ఏమిటి అని ప్రశ్నిస్తున్నారు? వాళ్ళు ఒంటరిగా ఎలా బ్రతుకుతారు అని ప్రశ్నిస్తున్నారు. మళ్లి వాళ్లే మా పిల్లల ఉద్యోగావకాశాలు ఇక్కడే వున్నాయి అంటారు. మరి పిల్లలని ఉద్యోగాలకి ఒంటరిగా ఎలా పంపుతారు? అప్పుడు తల్లిదండ్రులు కూడా వాళ్ళతో వస్తార? విదేశాలకు వెళుతున్న పిల్లలు ఒంటరిగా వుండటం లేదా? ఈ మాటల్లో ఏమైనా పొంతన వుందా? ఈ ఆంధ్ర వాళు తమ పొలాల్లో పనిచేసిన వారికి, తమ భవంతులు కట్టినవారికి భాగం ఇస్తున్నార లేక కూలి ఇచ్చి పంపిస్తున్నార? పనిచేయటానికి, బ్రతుకు తెరువుకు వచ్చినవాళ్ళు తమ పని చూసుకొని వెళ్లిపోవాలి కాని ఇలా భాగం అడగటం లేని హక్కు కోసం యాగీ చేయటం సమంజసమ అదే సమైక్యమ? విదేశాల్లో బ్రతుకు తెరువుకు వెళ్లి ఊరికే వస్తున్నామ లేక భాగం అడుగుతున్నామ? భారత దేశం అభివృద్ధి చేసామని బ్రిటిష్ వాళ్ళు అంటే వాళ్ళు భాగం అడిగితే ఇవ్వాలంటారా?
తెలంగాణా మేతకతనాన్ని అలుసుగా తీసుకొని గందరగోళం చేస్తున్నవారిని ఇంకా కుటుంబ సభ్యులుగా సహోదరులుగా భావిస్తూ సంయమనంతో ప్రవర్తిస్తున్న తెలంగాణా ప్రజలకు సరి ఐన నాయకత్వం లేక పోవటం దౌర్భాగ్యం. ఈ దౌర్భాగ్యం ఎప్పటికి పోతుందో అర్థం కాదు. మీ సంపదలో భాగం కావలి కాని మేము మాత్రం మీకు ఏమి ఇవ్వము అంటున్నవారిని ఇంకా సహోదరులుగా చూస్తున్న తెలంగాణా ప్రజల అమాయకత్వం ఎప్పటికి పోతుందో?
విడిపోతే మాకు నష్టం, విడిపోతే మాకు భవిష్యత్తు లేదు , విడిపోతే మేము బ్రతకలేము, విడిపోతే మేము నాశనం ఐపొతము, పరాన్నజీవులుగా తప్ప మేము బతుకలేము అనే తప్ప కలిసి వుంటే ఒకరికి ఒకరం ఎలా తోడ్పాటుగా ఉంటామో ఒక్క ఉదాహరణ కూడా చూపించని వాళ్ళని ఇంకా భరిస్తున్న తెలంగాణా ప్రజలకి దిక్సూచిగా ఎవరూ లేకపోవటం బాధాకరం.
యెర్ర చందనం స్మగ్గ్లింగ్ చేసే వ్యక్తులు, RTC ని నాశనం చేసి ప్రైవేటు రవాణా అభివృద్ధి చేసిన వ్యక్తులు, రాయపాటి కావూరి లాంటి తోడేళ్ళు డబ్బుతో తప్ప మరి దేనితోను బాంధవ్యం లేని చిరంజీవులు , తను తన కొడుకు మాత్రమే అభివృద్ధి చెందాలని అనుకుంటూ అందుకోసం ఎన్ని కుటుంబాలనైన నాశనం చేసే ఎన్ని వెన్నుపోట్లనైన పొడిచే రెండు కళ్ళ బాబుల నుంచి తెలంగాణా ప్రజలని రక్షించే నాయకత్వం లేకపోవటం బాధాకరం.

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

ధన్యవాదాలు అనిల్ గారూ! తీరికలేని పనులతో తలమునకలై ఉండడం వల్ల సకాలంలో మీ వ్యాఖ్యను ప్రచురించలేకపోయాను. మన్నించండి.
మీ ఆవేదనలో సామంజస్యం ఉంది! తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఆ నాయకులనే మనం భరించాల్సి ఉంది. అందుకు ప్రజ లేం చేయాలో, వాళ్ళను ఎలా ప్రభావితం చేసి, వచ్చిన తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చుకోవాలో మేధావులే ఆలోచించాలి. సరియైన నాయకులుగా మనమే వారిని తీర్చిదిద్దుకోవాలి. లేకుంటే ఈన గాచి నక్కల పాలు చేసినట్లవుతుంది.
స్పందించినందుకు అభినందనలు!
జై తెలంగాణ! జై జై తెలంగాణ!

కామెంట్‌ను పోస్ట్ చేయండి